• HOME
  • »
  • NEWS
  • »
  • EXPLAINED
  • »
  • EXPLAINED GENERAL KNOWLEDGE WORLD LARGEST TREE AND KNOW ALL ABOUT IT NK

World's tallest tree: ప్రపంచంలోనే అతి ఎత్తైన చెట్టు ఎక్కడుందో తెలుసా?

World's tallest tree: ప్రపంచంలోనే అతి ఎత్తైన చెట్టు ఎక్కడుందో తెలుసా?

ప్రపంచంలోనే అతి ఎత్తైన చెట్టు ఎక్కడుందో తెలుసా?

World's tallest tree: న్యూయార్క్ లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కంటే ఎత్తుగా ఉన్న చెట్టు ఉందంటే నమ్మడం కష్టమే. దాని విశేషాలు తెలుసుకొని ఆశ్చర్యపోదాం.

  • Share this:
    ఎండలు మండుతున్నాయి. వేసవి కాలం వచ్చేసింది. అలా బయటకు వెళ్లగానే... ఏ చెట్టు నీడ దొరుకుతుందా అని వెతుక్కుంటున్నాం. మనకు చెట్ల వల్ల అన్నీ లాభాలే కానీ నష్టాలు లేవు. మనం కూడా అది గుర్తించి... మొక్కలు పెంచి... చెట్లను కాపాడుకుంటున్నాం. అందువల్లే కనీసం వాతావరణం ఈ మాత్రంగానైనా ఉంది. లేదంటే... సహారా ఎడారిలా మండిపోయేదే. నిజంగానే చెట్లు మనకు ఎంతగానో మేలు చేస్తున్నాయి. మీకు ఎప్పుడైనా తలనొప్పి వస్తే... ఓ 40 నిమిషాల పాటూ... మొక్కలు, చెట్ల మధ్య నడుస్తూ వెళ్లండి... కచ్చితంగా తగ్గిపోతుంది. ఎందుకంటే... చెట్లు ఇచ్చే ఆక్సిజన్ మీ బ్రెయిన్‌లోకి ఎక్కువగా వెళ్తుంది. దాంతో అక్కడి రక్త ప్రసరణ జోరందుకొని... ఆక్సిజన్‌తో మెదడులో కణాలన్నీ చల్లబడతాయి. దాంతో తలనొప్పి పోతుంది. సరే అసలు మేటర్‌కి వద్దాం. ఈ ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత పురాతనమైన చెట్లు ఉన్నాయి. గుజరాత్‌లోని కబీర్ వాద్ అలాంటిదే. అక్కడ చాలా ఎత్తైన ప్రాచీన చెట్లు ఉంటాయి. కానీ ప్రపంచంలోనే అతి ఎత్తైన చెట్టు మాత్రం అక్కడ లేదు.

    ప్రపంచంలోనే ఎత్తైన చెట్టు ఉత్తర అమెరికా... కాలిఫోర్నియా రాష్ట్రంలోని రెడ్ వుడ్ నేషనల్ పార్కులో ఉంది. దాని ఎత్తు 115.85 మీటర్లు. అడుగుల్లో అయితే... 380 అడుగులు. అది అమెరికా... న్యూయార్క్‌లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, ఇండియా... ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే ఎత్తైనది. ఆ చెట్టు పేరు హైపెరియన్ (Hyperion). అది కోనిఫెరస్ కోస్ట్ రెడ్ వుడ్ జాతి చెట్టు. సైంటిఫిక్ నేమ్ సెకోయా సెంపెర్విరెన్స్ (Sequoia sempervirens). 2006లో ఈ చెట్టును ఎత్తైనదిగా గుర్తించారు. పనిలో పనిగా గిన్నీస్ బుక్‌లో కూడా ఎక్కించేశారు.

    world largest tree, Hyperion, Sequoia sempervirens, viral news, trending news, trending topics, telugu news, వైరల్ వార్తలు, తెలుగు న్యూస్, తెలుగు వార్తలు,
    ప్రపంచంలోనే అతి ఎత్తైన చెట్టు


    ఈ సందర్భంగా మనమో కొత్త విషయం తెలుసుకుందాం. మీకు దగ్గర్లో ఏదైనా చెట్టు ఉంటే... దాన్ని మీరు మెచ్చుకోవచ్చు. ఎందుకంటే... అది ప్రతి సంవత్సరం 20 కేజీల దుమ్ము, 20 టన్నుల కార్బన్ డై-ఆక్సైడ్‌ని పీల్చేసుకుంటుంది. అలాగే... మనకు 700 కేజీల ఆక్సిజన్ ఇస్తుంది. సపోజ్ లీటర్ ఆక్సిజన్ ధర రూ.400 అనుకుంటే... ఆ చెట్టు... మనకు సంవత్సరానికి... 3,30,000 విలువైన ఆక్సిజన్ ఇస్తోందని అర్థం. మరి అలాంటి చెట్టును మనం నాశనం చేసుకుంటే... ఎంత నష్టపోతున్నట్లో కదా. మరో విషయం... చెట్టు కింద ఎప్పుడూ ఉష్ణోగ్రత 4 డిగ్రీలు తక్కువగా ఉంటుంది. ప్రతీ చెట్టు... తన చుట్టూ ఉన్న 1 లక్ష చదరపు మీటర్ల కలుషిత గాలిని ఓ ఏడాదిలో క్లీన్ చేస్తుంది.

    విస్కాన్సిన్యూనివర్శిటీ పరిశోధకులు ఆ ఆసక్తికర విషయం చెప్పారు. ఇంటి బయట ఎవరికైతే చెట్టు ఉంటుందో... వారికి మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ పెద్దగా రావట్లేదట. అంటే ఇంటి చుట్టూ 10 చెట్లు ఉంటే... ఆ ఇంట్లో వాళ్లు చెట్లు లేని వాళ్ల కంటే అదనంగా 7 ఏళ్లు బతకుతున్నారు. ఈ విషయాన్ని కెనడా సైంటిఫిక్ రిపోర్ట్ చెప్పింది.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు