Home /News /explained /

EXPLAINED FROM PIG TO HUMAN THE HEART TRANSPLANT IN US MAN OFFERS HOPE AMID ORGAN SHORTAGE GH VB

Explained: మనిషికి పంది గుండెను అమర్చిన వైద్యులు.. అవయవ మార్పిడి చికిత్సలకు ఈ విధానం కొత్త ఆశగా మారనుందా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అమెరికా వైద్యులు మనిషికి పంది గుండెను విజయవంతంగా అమర్చిన విషయం ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలుస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ సెంటర్‌లో (University of Maryland Medical Center) వైద్యులు హార్ట్ ఫెయిల్యూర్ అయిన రోగికి పంది గుండెను విజయవంతంగా మార్పిడి చేశారు.

ఇంకా చదవండి ...
అమెరికా వైద్యులు మనిషికి పంది గుండెను విజయవంతంగా అమర్చిన విషయం ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలుస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ సెంటర్‌లో (University of Maryland Medical Center) వైద్యులు హార్ట్ ఫెయిల్యూర్ అయిన రోగికి పంది గుండెను(Heart) విజయవంతంగా మార్పిడి చేశారు. ఆ రోగి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా, ఆయనకు మనుషుల గుండెను మార్పిడి చేయడం కుదరదని వైద్యులు(Doctors) తేల్చారు. ఇతర ప్రత్యామ్నాయాలు లేవు కాబట్టి, జన్యుమార్పిడి చేసిన పంది గుండెను ఆయనకు అమర్చారు. ఈ ప్రయోగాత్మక విధానం ప్రస్తుతం విజయవంతమైంది. ఇలాంటి సర్జరీలకు అవయవాల కొరత ఉన్నందువల్ల, ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఒక అడుగు ముందుకు పడిందని తెలిపారు సర్జరీ చేసిన డాక్టర్ బార్ట్లీ గ్రిఫిత్ (Dr Bartley Griffith). ‘నేను చనిపోవాలి.. లేదంటే ఈ మార్పిడి చేయించుకోవాలి.

Royal Enfield: బుల్లెట్ బండి లవర్స్‌కు గుడ్ న్యూస్.. పండుగ ఆఫర్ మూమూలుగా లేదుగా.. వివరాలిలా..


ఇది చీకట్లో రాయి విసరడమేనని నాకు తెలుసు. కానీ నాకు ఇదే లాస్ట్ ఛాయిస్’ అని చెప్పారు అవయవ మార్పిడి చేయించుకున్న 57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్ (David Bennett). సర్జరీకి ఒకరోజు ముందు అసోసియేటెడ్ ప్రెస్‌తో మాట్లాడిన డేవిడ్.. ఆపరేషన్‌కు తాను సిద్ధమైనట్లు చెప్పారు.

ఈ సర్జరీ ప్రత్యేకత ఏంటి?
అవయవ మార్పిడి రంగంలో ఈ సర్జరీ ఒక మైలురాయి. పంది గుండెను మనిషికి విజయవంతంగా మార్చిన మొదటి గుండె మార్పిడి సర్జరీ ఇదే. ఇతర జాతుల నుంచి అవయవాలను మానవులకు మార్పిడి చేయడాన్ని జెనోట్రాన్స్‌ప్లాంటేషన్ (xenotransplantation) అంటారు. ఈ ప్రక్రియకు సుదీర్ఘ చరిత్ర ఉంది. గతంలో మనుషులకు గుండె మార్పిడి సర్జరీల కోసం పరిశోధకులు ప్రైమేట్‌లపై దృష్టి సారించారు. ఈ క్రమంలో కొన్ని ప్రయత్నాలు విజయవంతమయ్యాయి. అనారోగ్యంతో చనిపోయే దశకు చేరుకున్న బేబీ ఫే అనే శిశువుకు బబూన్ గుండెను వైద్యులు అమర్చారు. అయితే కొత్త అవయవంతో ఆమె 21 రోజులు మాత్రమే బతకగలిగింది.

కానీ బెన్నెట్ సర్జరీ విషయంలో కొత్త టెక్నాలజీ ద్వారా శాస్త్రవేత్తలు అద్భుతాలు చేయగలిగారు. జన్యు సవరణ ద్వారా వారు ప్రత్యేకంగా పంది గుండెను మనుషులకు మార్పిడి చేసేలా ప్రయోగాలు చేశారు. బెన్నెట్‌కు అమర్చిన పంది గుండెకు ఒక ప్రత్యేకత ఉంది. మానవ శరీరానికి మరింత అనుకూలంగా ఉండేలా ప్రత్యేకంగా ఆ పందికి జన్యు సవరణ చేశారు. వర్జీనియాకు చెందిన బయోటెక్ సంస్థ రివివికోర్ ఈ ప్రయోగాలు చేపట్టింది. పరిశోధకులు మొత్తం 10 జన్యువులను సవరించారు. పంది గుండె కణజాలం అధికంగా పెరగడానికి కారణమయ్యే ఒక జన్యువును తొలగించారు. అలాగే అవయవాన్ని తిరస్కరించడానికి దారితీసే మూడు ఇతర జన్యువులను కూడా తొలగించారు. కొత్త అవయవాన్ని రోగి స్వీకరించడానికి వీలు కల్పించే ఆరు మానవ జన్యువులను కూడా ఆ పందికి జోడించారు.

బెన్నెట్‌ రోగనిరోధక వ్యవస్థ కొత్త అవయవంపై దాడి చేయకుండా కాపాడేందుకు సర్జన్లు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇందుకు కినిక్సా ఫార్మాస్యూటికల్స్‌ (Kiniksa Pharmaceuticals) అభివృద్ధి చేసిన కొత్త స్టాండర్డ్ ఇమ్యునో-సప్రెసెంట్స్ అందించారు. సర్జరీ చేసే రోజు వరకు పంది గుండెను భద్రపరిచే కొత్త పెర్ఫ్యూజన్ డివైజ్‌ను కూడా కంపెనీ అభివృద్ధి చేసింది. ఈ విధానం ద్వారా భవిష్యత్తులో రోగుల ప్రాణాలను రక్షించవచ్చని చెబుతున్నారు మేరీల్యాండ్ జెనోట్రాన్స్‌ప్లాంటేషన్ ప్రోగ్రామ్ సహ వ్యవస్థాపకుడు డాక్టర్ ముహమ్మద్ మొహియుద్దీన్. కినిక్సా ఎక్స్‌పరిమెంటల్ డ్రగ్‌ను కూడా ఆయన అభివృద్ధి చేశారు.

గుండె మార్పిడి అంటే ఏంటి?
గుండె మార్పిడి అనేది అరుదుగా చేసే సర్జరీ. గుండె వైఫల్యమైన బాధితులకు.. వేర్వేరు సందర్భాల్లో దాతల నుంచి సేకరించిన గుండెను సర్జరీ చేసి అమర్చుతారు. ఏ ఇతర చికిత్స మార్గాలు లేనప్పుడు, చివరి ప్రయత్నంగా రోగులను బతికించేందుకు మాత్రమే ఇలాంటి సర్జరీ చేస్తారు. పుట్టుకతో వచ్చే లోపాలతో సహా వివిధ వైద్య పరిస్థితుల కారణంగా కొందరికి గుండె జబ్బులు రావచ్చు. లేదా హార్ట్ ఫెయిల్యూర్ కావడం ప్రారంభించవచ్చు. వారికి హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఒకటే మార్గం. గుండె మార్పిడికి అర్హత పొందడానికి రోగులు సర్జరీ చేయించుకునేంత ఆరోగ్యంగా ఉండాలి. వారికి 69 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉండాలి. మూత్రపిండాలు, కాలేయ వ్యాధులు, ఇతర తీవ్రమైన అనారోగ్యాలు లేదా అంటువ్యాధులు ఉండకూడదు.

Sankranthi Offers: టాటా మోటార్స్ పండుగ ఆఫర్లు.. ఈ మోడళ్లపై ఏకంగా రూ. 85 వేల వరకు డిస్కౌంట్..​


గుండె మార్పిడితో ఎదురయ్యే ప్రధాన సమస్య... కొత్తగా రోగులకు మార్పిడి చేసిన గుండెను వారి శరీరం తిరస్కరించడం. దాత గుండె బయటి అవయవం కాబట్టి, మార్పిడి చేసిన వ్యక్తి రోగనిరోధక వ్యవస్థ దానిపై సహజంగా దాడి చేస్తుంది. అంటే వారి శరీరం కొత్తగా అమర్చిన గుండెను తిరస్కరిస్తుంది. అన్నిరకాల అవయవ మార్పిడి చికిత్సల్లో ఈ సమస్య సాధారణం. హార్ట్ రీప్లేస్‌మెంట్ సర్జరీ విజయవంతమైన తర్వాత కూడా రోగుల జీవితకాలం తగ్గిపోవడానికి ఈ రిజెక్షన్ ప్రధాన కారణం. అవయవ మార్పిడి సర్జరీలకు దాతల నుంచి అవయవాలు అందుబాటులో ఉండట్లేదు.

ఈ సమస్యను అధిగమించేందుకు పరిశోధకులు ప్రారంభంలో బబూన్ కోతుల గుండెలను మనుషులకు అమర్చేందుకు ప్రయోగాలు చేశారు. ల్యాబ్స్‌లో మూలకణాలతో అవయవాలను తయారు చేసే ప్రయోగాలు సైతం కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కొందరు పరిశోధకులు పందులపై ప్రయోగాలు ప్రారంభించారు. తాజాగా జన్యుమార్పిడి చేసిన పంది గుండెను బాధితుడికి విజయవంతంగా అమర్చగలిగారు. ఈ రోగి ఎక్కువ రోజులు బతికితే.. ఈ విధానంపై పూర్తి స్థాయిలో వైద్య రంగం దృష్టి సారించే అవకాశం ఉంది.
Published by:Veera Babu
First published:

Tags: Heart

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు