హోమ్ /వార్తలు /Explained /

Explained: అప్పట్లోనే దేశద్రోహ చట్టాన్ని వ్యతిరేకించిన స్వతంత్ర సమరయోధులు.. దీనిపై తిలక్, గాంధీ, నెహ్రూ ఏమన్నారంటే..

Explained: అప్పట్లోనే దేశద్రోహ చట్టాన్ని వ్యతిరేకించిన స్వతంత్ర సమరయోధులు.. దీనిపై తిలక్, గాంధీ, నెహ్రూ ఏమన్నారంటే..

స్వాతంత్య్రసమరయోధులు

స్వాతంత్య్రసమరయోధులు

సెక్షన్ 124Aపై మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ చేసిన ప్రకటనలను సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మంగళవారం కోర్టుముందుంచారు. ఈ నిబంధనను కొట్టివేయాలని పిటిషన్ల తరఫున వాదిస్తున్న సిబల్ కోరుతున్నారు.

దేశద్రోహం చట్టానికి సంబంధించి ఈ బుధవారం (మే 11న) సుప్రీంకోర్టు(Supreme Court) కీలక నిర్ణయం తీసుకుంది. దేశద్రోహ అభియోగాలతో వ్యవహరించే సెక్షన్ 124Aకి సంబంధించి పెండింగ్‌లో(Pending) ఉన్న అన్ని ట్రయల్స్, అప్పీళ్లు, ప్రొసీడింగ్స్‌పై సుప్రీం కోర్టు స్టే(Stay) విధించింది. వలసవాద కాలంనాటి నిబంధనలను సమీక్షించడానికి కేంద్ర ప్రభుత్వం(Central Government) కసరత్తును పూర్తి చేసే వరకు ఈ స్టే వర్తిస్తుంది. అయితే భారత స్వాతంత్య్ర పోరాటంలో అనేక మంది నాయకులపై బ్రిటిష్ వారు దేశద్రోహం చట్టాన్ని ఉపయోగించారు. దీన్ని కొట్టివేయాలని దాఖలైన పిటిషన్లను కోర్టు(Court) విచారిస్తోంది. ఈ నేపథ్యంలో సెక్షన్ 124Aపై మహాత్మా గాంధీ(Mahatma Gandhi), జవహర్‌లాల్ నెహ్రూ(Nehru) చేసిన ప్రకటనలను సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మంగళవారం కోర్టుముందుంచారు. ఈ నిబంధనను కొట్టివేయాలని పిటిషన్ల తరఫున వాదిస్తున్న సిబల్ కోరుతున్నారు. అప్పట్లో గాంధీ, నెహ్రూ, బాల గంగాధర తిలక్ వంటివారు ఈ చట్టం గురించి ఏం చెప్పారో తెలుసుకుందాం.

బాల గంగాధర తిలక్

లోకమాన్య తిలక్‌పై బ్రిటీషర్లు మూడుసార్లు దేశద్రోహం అభియోగాలు మోపారు. రెండుసార్లు జైలుకు పంపించారు. తిలక్ నిర్వహించే కేసరి వార్తా పత్రికలో 1897 జూన్ 15 సంచికలో కొన్ని కథనాలను ప్రచురించారు. ఇవి ప్రభుత్వం పట్ల అసంతృప్తి భావాలను రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ ఆయనపై దేశద్రోహం అభియోగాలు మోపారు. 1659లో ఆదిల్‌షాహీ జనరల్ అఫ్జల్ ఖాన్‌ను శివాజీ చంపడాన్ని ప్రస్తావిస్తూ తిలక్ చేసిన ప్రసంగం.. 1897లో చాపేకర్ సోదరులు పూనాలోని ప్లేగు కమీషనర్ వాల్టర్ రాండ్‌ను హత్య చేయడానికి ప్రేరేపించిందని ప్రభుత్వం పేర్కొంది.

1908 ఏప్రిల్‌లో, ముజఫర్‌పూర్‌లో బ్రిటీష్ మేజిస్ట్రేట్ డగ్లస్ కింగ్స్‌ఫోర్డ్‌ను లక్ష్యంగా చేసుకుని జరిపిన బాంబు దాడిలో యువ విప్లవకారులు ఖుదీరామ్ బోస్, ప్రఫుల్ల చాకీ ప్రమాదవశాత్తు ఇద్దరు యూరోపియన్ మహిళలను చంపారు. చాకి అరెస్టు కాకముందే తనను తాను కాల్చుకున్నాడు. బోస్‌ను అరెస్టు చేసి ఉరి తీశారు. తిలక్ కేసరిలో విప్లవకారులను సమర్థిస్తూ కథనాలు ప్రచురించారు. దీంతో దేశద్రోహం ఆరోపణలపై ఆయన్ను అరెస్టు చేశారు. అదే సంవత్సరం జూలైలో తిలక్ కేసరిలో తన రచనల ద్వారా బ్రిటీష్ ప్రభుత్వంపై ద్వేషం, ధిక్కారం వ్యక్తం చేస్తూ అధికారులపై శత్రుత్వం పెంచుతున్నారని ఆరోపించారు.

Explained: భారీగా క్షీణిస్తున్న రూపాయి విలువ.. ఇది ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..? తెలుసుకోండి..


ఈ కేసులపై విచారణ సందర్భంగా తిలక్ కోర్టులో లాయర్ సాయం తీసుకోకుండా, సొంతంగా వాదించుకున్నారు. ఈ సందర్బంగా దేశద్రోహం అభియోగంపై తీవ్రంగా మండిపడ్డారు. బ్రిటీష్ ప్రభుత్వం భావప్రకటనా స్వేచ్ఛ వంటి కొన్ని చట్టపరమైన హక్కుల నుంచి తనను దూరం చేస్తోందని వాదించారు. బ్రిటిష్ పౌరులతో పాటు ఆంగ్లో-ఇండియన్లు అనుభవిస్తున్న అదే స్వేచ్ఛను ఆస్వాదించగలిగే హక్కు తనకు ఉందన్నారు. తన రచనల్లో నేరపూరిత ఉద్దేశాలు ఉన్నాయని, ఈ నేరపూరిత ఉద్దేశాలు సమాజాన్ని పెద్దగా ప్రభావితం చేయగలిగాయని ప్రాసిక్యూషన్ నిరూపించలేదని ఎత్తి చూపారు. అయితే కోర్టు తిలక్‌ను దోషిగా నిర్ధారించింది. ఆరు సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

మహాత్మా గాంధీ

1922 మార్చిలో గాంధీ తన వీక్లీ జర్నల్ ‘యంగ్ ఇండియా’లో మూడు వ్యాసాలు రాసినందుకు దేశద్రోహం నేరం మోపారు. వార్తాపత్రిక యజమాని శంకర్‌లాల్ బ్యాంకర్‌పై కూడా IPC సెక్షన్ 124A కింద అభియోగాలు మోపారు. ఇలాంటి చట్టాలను వ్యతిరేకించడం తన నైతిక బాధ్యత అని గాంధీ ప్రకటించారు. సెక్షన్ 124A అనేది పౌరుల స్వేచ్ఛను అణిచివేసేందుకు రూపొందించిన రాజకీయ పరమైన ఐపీసీ సెక్షన్లలో యువరాజు వంటిదని గాంధీ పేర్కొన్నట్లు కపిల్ సిబల్ గుర్తు చేసుకున్నారు. సెక్షన్ 124A కింద ఎందరో దేశభక్తులను అరెస్ట్ చేశారని చెప్పారు. జాతీయవాదులు అనైతిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసంతృప్తిని వ్యాప్తి చేయడం అవసరమని ప్రకటించారు.

Sri Lanka Crisis: శ్రీలంకలో అరాచకత్వం.. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు.. పారిపోయిన రాజపక్స కుటుంబం

జవహర్‌లాల్ నెహ్రూ

1930లో నెహ్రూపై దేశద్రోహం అభియోగం మోపారు. గాంధీలాగే ఆయన కూడా కోర్టులో సెక్షన్ 124A కింద నేరాన్ని అంగీకరించారు. స్వేచ్ఛ, బానిసత్వం మధ్య.. సత్యం, అసత్యం మధ్య ఎటువంటి రాజీ ఉండదని ఆయన మేజిస్ట్రేట్‌తో చెప్పారు. స్వేచ్ఛ కోసం బాధ (suffering) అనుభవిస్తూ రక్తాన్ని దారపోయాలంటే.. అందుకు సిద్ధమన్నారు. జాతీయవాద నాయకులను లక్ష్యంగా చేసుకోవడానికి వలసరాజ్యం ఉపయోగించిన ఈ చట్టాన్ని స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కొనసాగించారు. అయితే నెహ్రూ దీంట్లోని సమస్యలను అర్థం చేసుకున్నారు. ‘మనం దీన్ని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది’ అని పార్లమెంటుకు చెప్పారు.

First published:

Tags: Explained, Mahatma Gandhi, Supreme Court

ఉత్తమ కథలు