EXPLAINED FOUND IN MORE THAN THREE DOZEN COUNTRIES WHATS KNOWN ABOUT STEALTH VERSION OF OMICRON GH VB
Explained: ఒమిక్రాన్ కొత్త వెర్షన్ 'Stealth'.. దాదాపు 40 దేశాల్లో విస్తరణ.. దీని గురించి తెలిసిందేమిటి..? పూర్తి వివరాలిలా..
ప్రతీకాత్మక చిత్రం
ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావం చూపుతున్న నేపథ్యంలో వైద్య వర్గాలు అప్రమత్తమవుతున్నాయి. కరోనా కొత్త రూపాంతరాలపై కన్నేసి ఉంచిన శాస్త్రవేత్తలు మరో కొత్త వేరియంట్‌ను గుర్తించారు. అమెరికా సహ కనీసం 40 దేశాల్లో ఒమిక్రాన్ నుంచి కొత్తగా రూపాంతరం చెందిన 'Stealth' వెర్షన్‌ను వారు కనుగొన్నారు. ఈ కొత్త రకాన్ని శాస్త్రవేత్తలు BA.2 అని పిలుస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఒమిక్రాన్ వేరియంట్(Omicron Variant) ప్రభావం చూపుతున్న నేపథ్యంలో వైద్య వర్గాలు అప్రమత్తమవుతున్నాయి. కరోనా(Corona) కొత్త రూపాంతరాలపై కన్నేసి ఉంచిన శాస్త్రవేత్తలు మరో కొత్త వేరియంట్‌ను గుర్తించారు. అమెరికా సహ కనీసం 40 దేశాల్లో ఒమిక్రాన్ నుంచి కొత్తగా రూపాంతరం చెందిన 'Stealth' వెర్షన్‌ను వారు కనుగొన్నారు. ఈ కొత్త రకాన్ని శాస్త్రవేత్తలు BA.2 అని పిలుస్తున్నారు. ఒరిజినల్ వెర్షన్(Original Version) ఒమిక్రాన్‌తో పోలిస్తే దీన్ని మరింత శక్తిమంతమైనదిగా పరిగణిస్తున్నారు. దీని జన్యు లక్షణాలను గుర్తించడం చాలా కఠినంగా ఉంది. ఇది తీవ్రమైన సంక్రమణ రకం కావచ్చని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. అయితే దీని గురించి తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. ఇది వ్యాక్సిన్‌కు లొంగుతుందా లేదా మరింత తీవ్రమైన వ్యాధిగా పరిణమిల్లుతుందా అనే విషయాలపై పరిశోధనలు చేయాల్సి ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది మొదట ఎక్కడ వ్యాపించింది?
నవంబర్ మధ్య నుంచి BA.2 రకం జన్యుక్రమాలను మూడు డజన్లకు పైగా దేశాలు GISAIDకి అప్లోడ్ చేశాయి. GISAID అనేది కరోనా వైరస్‌కు సంబంధించిన డేటాను పంచుకునే అంతర్జాతీయ వేదిక. మొన్నటి వరకు అమెరికా నుంచి 96 కేసులు వచ్చాయి. అయితే ఇది అమెరికాలో బలపడినట్టుగా చెప్పలేమని BA.2 ను గుర్తించిన టెక్నాస్‌లోని హూస్టన్ మెథడిస్ట్కు చెందిన పాథాలజిస్టు డాక్టర్ వెస్లీ లాంగ్ తెలిపారు. ఆసియా, యూరోప్‌లో ఈ రకం ఎక్కువ కనిపిస్తోంది. డెన్మార్క్‌లో జనవరి మధ్య నాటికి మొత్తం కొవిడ్ -19 కేసుల్లో ఈ రకానికి చెందినవి 45% ఉన్నాయి. అంతకు రెండు వారాల ముందు సమయంతో పోలిస్తే ఇది 20% అధికం.
ఈ రకం వైరస్ గురించి తెలిసిందేమిటి?
BA.2లో చాలా మ్యుటేషన్లు ఉన్నాయి. ఇందులో 20 రకాలు ఒరిజినల్ ఒమిక్రాన్‌కు దగ్గరగా ఉన్నాయి. కానీ ప్రారంభ వెర్షన్లో కనిపించని జన్యుపరమైన మార్పులు అదనంగా వీటిలో ఉన్నాయి. ఒరిజినల్ ఒమిక్రాన్ బారిన పడిన జనాభాలో ఈ మార్పులు ఎలా ఉంటాయనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ మస్సాచుసెట్స్ మెడికల్ స్కూల్‌కు చెందిన వైరాలజిస్టు డాక్టర్ జెరిమీ లూబన్. ప్రస్తుతానికి అయితే ఒరిజినల్ వెర్షన్ BA.1, BA.2ను ఒమిక్రాన్ ఉపభాగాలుగా పరిగణిస్తున్నారు. అయితే ఈ రకం ఆందోళనకరమైన వేరియంట్ అని అంతర్జాతీయంగా గుర్తించిన తర్వాతే దీనికి కూడా ఒక గ్రీక్ అక్షరంతో పేరు ఇస్తారు. వేగంగా విస్తరిస్తున్న BA.2 రకం ఒకింత ఆందోళన కలిగిస్తోంది. ఇది ఒరిజినల్ ఒమిక్రాన్లాగా సంక్రమణ కలిగి ఉండవచ్చు లేదా అధిక సంక్రమణ కూడా కలిగి ఉండవచ్చు. కానీ కచ్చితంగా అలా ఉంటుందని తాము చెప్పలేమంటున్నారు డాక్టర్ లాంగ్.
ఒమిక్రాన్ రకాన్ని ఆందోళనకరమైనదిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటోంది. కరోనా వైరస్ కంటే ఇది మరింత ప్రమాదకారి. కానీ BA.2 రకానికి వేరుగా ఆ స్టేటస్ ఇవ్వడం లేదు. కొన్ని దేశాల్లో దీని తీవ్రత పెరుగుతున్న తీరును బట్టి దీనిపై ఇన్వెస్టిగేషన్లకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని సంస్థ చెబుతోంది. అటు యూకే హెల్త్ సెక్యూరిటీ సంస్థ BA.2 రకాన్ని దర్యాప్తులో ఉన్న రకంగా పేర్కొంది. ఈ కేసులు యూకేలోనే కాదు అంతర్జాతీయంగానే పెరుగుతున్నాయి. యూకేలో ఇప్పటికీ ఒరిజినల్ ఒమిక్రాన్ రకం కేసులు ఎక్కువే ఉన్నాయి.
దీన్ని గుర్తించడం ఎందుకు కష్టం?
డెల్టా రకానికి భిన్నంగా ఉన్న ఒమిక్రాన్ ఒరిజినల్ రకాన్ని ఒక ప్రత్యేకమైన PCR టెస్టు ద్వారా గుర్తించగలిగారు. BA.2 రకంలో అటువంటి జన్యు రకం లేదు. BA.2 కూడా డెల్టా మాదిరిగానే కనిపిస్తోందని శాస్త్రవేత్తలు అంటున్నారు.
దీని గురించి రక్షణకు ఏం చేయాలి?
ఇప్పటి వరకు పాటిస్తున్న జాగ్రత్తలు కొనసాగించాలి. వ్యాక్సిన్ వేయించుకోవాలి. మాస్కులు ధరించడం, రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండటం, అనారోగ్యంగా ఉంటే ఇంటికి పరిమితం కావాలి. తీవ్రమైన వ్యాధి, ఆస్పత్రిలో చేరిక మరణం వంటి వాటి నుంచి వ్యాక్సిన్లు ఇప్పటికీ మంచి రక్షణే అందిస్తున్నాయి. మీకు గతంలో కొవిడ్-19 వచ్చినా లేదా సహజమైన ఇన్ఫెక్షన్ ఏర్పడినా వ్యాక్సిన్ అందించే రక్షణ ఇంకా బలంగానే ఉంటుంది. మహమ్మారి మనల్ని ఇంకా వదిలి వెళ్లలేదని చెప్పేందుకు సంకేతం సరికొత్త వెర్షన్.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.