హోమ్ /వార్తలు /Explained /

Delta Plus Variant: కొత్తగా డెల్టా ప్లస్ వేరియంట్.. దీని​పై వ్యాక్సిన్‌లు సమర్థవంతంగా పనిచేస్తాయా?

Delta Plus Variant: కొత్తగా డెల్టా ప్లస్ వేరియంట్.. దీని​పై వ్యాక్సిన్‌లు సమర్థవంతంగా పనిచేస్తాయా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Delta plus variant: డెల్టా ప్లస్ వేరియంట్ ఈ ఏడాది మార్చి నుంచే ఉందని తాజాగా కేంద్రం ప్రకటించింది. అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ప్రపంచ దేశాల్లో దీని ఉనికిపై నిపుణులు విశ్లేషణ చేస్తున్నారు.

భారత్​లో కరోనా సెకండ్​వేవ్​కు కారణమైన డెల్టా వేరియంట్ బలహీనపడిందని సంతోషిస్తున్న సమయంలోనే మరో సవాల్​ ఎదురవుతోంది. డెల్టా వేరియంట్​ రూపాంతరం చెంది.. కొత్తగా డెల్టా ప్లస్​గా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ డెల్టా ప్లస్​ వేరియంట్‌తో ప్రస్తుతానికి పెద్దగా ముప్పు లేకపోయినా..​ భారత్​లో థర్డ్​ వేవ్​కు ఇది దారితీస్తుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలో ఓవైపు కరోనా పాజిటివ్​ కేసులు తగ్గుతున్నాయని భావిస్తున్న నేపథ్యంలో కొత్త వేరియంట్​ పుట్టుకురావడం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై నీతి ఆయోగ్​ సభ్యడు డాక్టర్​ వీకే పాల్​ మాట్లాడుతూ.. ‘‘డెల్టా వేరియంట్​ నుంచి కొత్తగా డెల్టా ప్లస్​ వేరియంట్​ పుట్టుకొచ్చింది. గత కొన్ని రోజులుగా కరోనా బాధితుల్లో డెల్టా ప్లస్​ వేరియంట్​ కేసులు గుర్తించడం నిజమే. కానీ ఈ కొత్త వేరియంట్​ వేగంగా వ్యాప్తి చెందుతుందని చెప్పేందుకు స్పష్టమైన ఆధారాలు లేవు. ప్రస్తుతానికి దీన్ని కేవలం కొత్త వేరియంట్​ గానే భావిస్తున్నాం. ఇది ప్రమాదకరమైన B.1.617.2 నుంచి పుట్టుకొచ్చిందని స్పష్టంగా చెప్పలేం. ఇది ప్రమాదకరమైన వేరియంట్ అనే సంకేతాలు ఇప్పటివరకూ కనిపించలేదు” అని చెప్పారు.

డెల్టా ప్లస్ వేరియంట్ ఈ ఏడాది మార్చి నుంచే ఉందని తాజాగా కేంద్రం ప్రకటించింది. అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. ప్రపంచ దేశాల్లో దీని ఉనికిపై నిపుణులు విశ్లేషణ చేస్తున్నారు.

డెల్టా వేరియంట్లు అంటే ఏంటి?

కరోనావైరస్ డెల్టా వేరియంట్‌ను ట్రిపుల్ మ్యూటెంట్ వైరస్​గా చెప్పవచ్చు. ఎందుకంటే ఇది ఇప్పటివరకు మూడు రకాలుగా రూపాంతరం చెందింది. ప్రధాన బి 1 వేరియంట్​తో పోలిస్తే ఈ వేరియంట్‌లో 12 మ్యూటేషన్లు ఉన్నాయని వైరాలజిస్టులు అంటున్నారు. స్పైక్ ప్రోటీన్‌లో K417N మ్యుటేషన్‌ పొందడం ద్వారా, దీన్ని రెండు రకాలుగా వర్గీకరించారు. వాటిలో ఒకటి డెల్టా వేరియంట్​. WHO రిపోర్ట్ ప్రకారం, డెల్టా వేరియంట్ ఇప్పటివరకు కనీసం 74 దేశాలలో బయటపడింది. మరొక వేరియంట్​ డెల్టా ప్లస్. ఈ డెల్టా ప్లస్​ ఉనికి జూన్ 7 నాటికి కెనడా, జర్మనీ, రష్యా, నేపాల్, స్విట్జర్లాండ్, ఇండియా, పోలాండ్, పోర్చుగల్, జపాన్, అమెరికా దేశాల్లో కనిపించింది. ఆయా దేశాల్లో ఇప్పటివరకు 63 కేసులు నమోదయ్యాయి. ఈ డెల్టా ప్లస్​ కేసును మొట్ట మొదటిసారిగా మార్చి చివర్లో ఐరోపాలో కనుగొన్నారు.

* డెల్టా Vs ఇతర వేరియంట్లు

డెల్టా వేరియంట్​ను WHO ఆందోళనకరమైన వేరియంట్​గా గుర్తించింది. భారత్​తో సహా అనేక దేశాల్లో ఇది గణనీయమైన ప్రభావాన్ని చూపింది. తద్వారా లక్షలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇక, బ్రిటన్‌లో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్​ కేసుల్లో కేవలం డెల్టా వేరియంట్ వల్లే 90 శాతం నమోదయ్యాయి. డెల్టా ప్లస్ వేరియంట్​ కేసులు మాత్రం 36 మాత్రమే వెలుగులోకొచ్చాయి.

* టీకాలు Vs డెల్టా వేరియంట్లు

డెల్టా ప్లస్ వేరియంట్‌పై వ్యాక్సిన్ల ప్రభావాన్ని శాస్త్రవేత్తలు ఇంకా పరీక్షించాల్సి ఉంది. కోవిడ్​19 వ్యాక్సిన్లు డెల్టా వేరియంట్‌పై ప్రభావవంతంగా పనిచేస్తాయని నిపుణులు నమ్ముతున్నారు. అయితే, దీనిపై మరింత లోతుగా అధ్యయనం జరగాల్సి ఉంది. కాగా MRNA వ్యాక్సిన్ డెల్టా వేరియంట్‌పై 88 శాతం ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు తేలింది. జాన్సన్ & జాన్సన్, ఆస్ట్రాజెనెకా వాక్సిన్లు 60 శాతం ప్రభావవంతంగా పనిచేస్తాయని కనుగొన్నారు. మోడెర్నా, ఫైజర్ / బయోఎంటెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లను mRNA సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అభివృద్ధి చేశారు. కాబట్టి, ఇవి కూడా రెండు డోసుల తర్వాత 88 శాతం ప్రభావవంతంగా పనిచేస్తాయని తేలింది.

భారతదేశంలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ను సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) కోవిషీల్డ్‌ పేరుతో తయారు చేస్తోంది. కాబట్టి డెల్టా ప్లస్​ వేరియంట్​ తీవ్రమైనా సరే దాన్ని అరికట్టడంలో కోవిషీల్డ్​ వ్యాక్సిన్​ మెరుగ్గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ తయారు చేసిన కోవిషీల్డ్​ వ్యాక్సిన్​ కూడా డెల్టా ప్లస్ వేరియంట్​పై బాగా పనిచేస్తుందని ఆ సంస్థ పేర్కొంది. కాగా, కొత్త వేరియంట్ల నుంచి కాపాడుకోవడానికి దేశంలోని కనీసం 80 శాతం ప్రజలకు టీకా వేయాలని డబ్ల్యూహెచ్​ఓ పేర్కొంది.

First published:

Tags: Corona Vaccine, Coronavirus, Covid-19, COVID-19 vaccine, Sanjeevani

ఉత్తమ కథలు