హోమ్ /వార్తలు /Explained /

Explained: ఢిల్లీలో కొత్త లిక్కర్ పాలసీపై భగ్గుమంటున్న వ్యాపారులు.. ఆందోళనకు కారణం ఏంటి..?

Explained: ఢిల్లీలో కొత్త లిక్కర్ పాలసీపై భగ్గుమంటున్న వ్యాపారులు.. ఆందోళనకు కారణం ఏంటి..?

దేశ రాజధాని ఢిల్లీలో మద్యం విధానం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. అధికార పార్టీ ఆమ్ ఆద్మీ (AAP) తీసుకొచ్చిన ఈ లిక్కర్ పాలసీని ప్రతిపక్షాలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆందోళనకు తెరలేచింది.

దేశ రాజధాని ఢిల్లీలో మద్యం విధానం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. అధికార పార్టీ ఆమ్ ఆద్మీ (AAP) తీసుకొచ్చిన ఈ లిక్కర్ పాలసీని ప్రతిపక్షాలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆందోళనకు తెరలేచింది.

దేశ రాజధాని ఢిల్లీలో మద్యం విధానం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. అధికార పార్టీ ఆమ్ ఆద్మీ (AAP) తీసుకొచ్చిన ఈ లిక్కర్ పాలసీని ప్రతిపక్షాలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆందోళనకు తెరలేచింది.

  దేశ రాజధాని ఢిల్లీలో(Delhi) మద్యం విధానం వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. అధికార పార్టీ ఆమ్ ఆద్మీ (AAP) తీసుకొచ్చిన ఈ లిక్కర్ పాలసీని ప్రతిపక్షాలైన భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆందోళనకు తెరలేచింది. అయినప్పటికీ ఆప్ ప్రభుత్వం(Government) మాత్రం ఈ విషయంలో తగ్గేదేలే.. అన్న రీతిలో వ్యవహరిస్తుండటంతో గొడవలకు దారితీసింది. మద్యం దుకాణాలు ఇచ్చే డిస్కౌంట్లపై(Discounts) ప్రభుత్వం నిషేధం విధించడంతో లైసెన్స్ హోల్డర్లు, ప్రభుత్వానికి మధ్య కొత్త చిచ్చురేగింది. ఆప్ సర్కారు తీసుకున్న నిర్ణయం ఏకపక్షంగా ఉందని వారు వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఈ అంశంపై 17 లిక్కర్ కంపెనీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశాయి.

  అసలు కొత్త లిక్కర్ పాలసీలో (Liquor Policy) ఏముంది?

  ఈ కొత్త పాలసీలోని 3.5.1 క్లాజు ప్రకారం ఎల్-72 లైసెన్సులు ఉన్న దుకాణాలు రాయితీలు ఇవ్వవచ్చు. ఎంఆర్పీ రేట్లపై రీబేట్లు, రాయితీలు ఎక్సైజు కమిషనర్ ఫిక్స్ చేస్తారు. ఇప్పటికే ఎక్సైజు డ్యూటీతో పాటు 10 శాతం అదనపు సుంకాలు, ఇతర లైసెన్స్ ఛార్జీలను ఈ కొత్త విధానంలో పొందుపరిచారని విక్రేతలు ఆందోళన చెందుతున్నారు. మద్యం దుకాణాల డిస్కౌంట్ పథకంలో కొంత మంది విక్రేతలు ఎంఆర్పీపై ఒకటి కొంటే మరొకటి ఉచితం లాంటి ఆఫర్ తో పాటు 40 నుంచి 50 శాతం రాయితీ ఇస్తున్నారు. ఇంకొంతమందికి రెండు కొంటే ఒకటి ఉచితం, 40 నుంచి 50 శాతం రాయితీని ఇస్తున్నారు.

   Dirty Bomb : ఉక్రెయిన్ పై రష్యా దాడికి అసలు కారణం ఇదేనట..న్యూక్లియర్ "డర్టీ బాంబ్" రెడీ చేస్తున్న ఉక్రెయిన్!

  కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఆల్కహాలిక్ బెవరేజ్ కంపెనీస్(CIABC) ప్రకారం బిడ్డింగ్ ప్రక్రియలోనే ఈ రాయితీలను ప్రతిపాదించి అనుమతించామని పేర్కొంది. ఈ పాలసీతో బీర్ వెండింగ్ మిషన్‌లను ప్రారంభించాలని, టెట్రా ప్యాక్‌ల్లో మద్యంాన్ని విక్రయించాలని ప్రతిపాదించింది. రాయితీలను నిషేధించడం వల్ల ప్రజల సంఖ్య తగ్గినప్పటికీ ఎవరినీ తాగకుండా ఆపలేరని విక్రేతలు అంటున్నారు. చౌకైన మద్యం కోసం గుడ్ గావ్ వరకు వెళ్తున్నారని తెలిపారు.

  ఈ కొత్త పాలసీలో ప్రభుత్వం ఇంకా చాలా మార్పులు చేసింది. ప్రభుత్వ దుకాణాలను మూసివేయడంతో పాటు ఢిల్లీలోని రిటైలింగ్, ప్రైవేటు రంగాలు స్వాధీనం చేసుకునేందుకు మార్గం సుగమం చేసింది. షోరూంలో మాదిరిగా వాకిన్ సుదాపాయాలతో పాటు ఎయిర్ కండీషన్డ్ ప్రీమియం వెండ్‌‍లను కూడా ప్రవేశపెట్టింది. అంతేకాకుండా పొరుగు రాష్ట్రాల్లో వయోపరిమితిని 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని కూడా ప్రతిపాదించింది. పంజాబ్, హరియాణాలో అయితే 21 సంవత్సరాల నుంచి 3 ఏళ్లు తగ్గించి 18 ఏళ్లకు పరిమితం చేశాయి. మద్యం దుకాణాల వెలుపల రద్దీ, పొడవైన క్యూలను ఆపడానికి, ఢిల్లీ ప్రభుత్వం ఫిబ్రవరి 28 న లైసెన్స్ హోల్డర్లందరికీ MRPపై డిస్కౌంట్లు, రాయితీలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ రాయితీలు నగరంలో తాగునీటికి సమస్యకు దారితీస్తుందని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు.

  Petrol Diesel ధరల కంటే భారీ షాకిచ్చే ఘటన: పెట్రోల్ బంకులో డీజిల్ అంటూ నీళ్లు అమ్మేస్తున్నారు!


  ప్రభుత్వ వాదన ఇది..

  ఇదిలా ఉంటే కొంతమంది లైసెన్సు దారుల స్వల్పకాలిక వ్యాపార లాభాల కోసం అవలంభించే విధానం వల్ల మార్కెట్‌లో అవకతవకలు జరుగుతాయని ప్రభుత్వం పేర్కొంది. డిస్కౌంట్లను అనుమతించడం అనేది వినియోగదారుల ఎంపిక, ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడమేనని, అంతేకానీ మార్కెట్ శక్తుల ద్వారా ధరను నిర్ణయించినట్లు కాదని స్పష్టం చేసింది.

  వ్యాపారులు ఇంత ఎక్కువ రాయితీలు ఎందుకు ఇస్తున్నారు?

  లాక్డౌన్ సమయంలో వ్యాపారులు ఎదుర్కొన్న నష్టాలను తిరిగి పొందేందుకు వారు డిస్కౌంట్లను ఆశ్రయించారు. కొత్త విధానం అమలులోకి రావడానికి ముందు ఓ నెల కంటే ఎక్కువ దుకాణాలు మూసివేశారు. దేశరాజధానితో పోలిస్తే గుడ్ గావ్ లాంటి పొరుగు నగరాల్లో మద్యం ధర తక్కువగా ఉండటం వల్ల అక్కడ కొనుగోలు చేయకుండా వినియోగదారులను ఆపడానికి రాయితీలు సహాయపడతాయని మద్యం వ్యాపారులు అంటున్నారు. తాము ఎక్సైజు సుంకాన్ని చెల్లించామని, దీని ప్రకారం డిస్కౌంట్లు ఇచ్చే హక్కును కూడా కలిగి ఉన్నామని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల గత నెలలో తమ వ్యాపారం పెరిగిందని, జనవరిలో కోవిడ్ వ్యాప్తి వల్ల మద్యం దుకాణాలు నష్టాలు ఎదుర్కొన్నాయని స్పష్టం చేశారు.

  మార్పులు చేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ లైసెన్సుదారులు కోట్ల రూపాయలు చెల్లిస్తూ కూడా నష్టాన్ని భరించాల్సి వస్తుందని, కనీసం తమను సంప్రదించిన ఉండాల్సిందని ఆవేదన వ్యక్తం చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మద్యం ధరలపై రాయితీ ఇవ్వడం వల్ల లిక్కర్ పరిశ్రమలో దాదాపు 200 శాతం అమ్మకాలు పెరిగినట్లు తెలుస్తోంది.

  First published:

  Tags: Delhi, Explained, Wines

  ఉత్తమ కథలు