Explained: లిటరేచర్‌ విభాగంలో ROBOలకు నోబెల్ ప్రైజ్...కారణం ఏంటో తెలిస్తే..షాక్ తింటారు..

(ప్రతీకాత్మక చిత్రం)

ఊహాశక్తి మానవునికి ఉన్న వరం. కానీ భవిష్యత్తులో ఈ రంగంలో మనిషిని కృత్రిమ మేధస్సు అధిగమిస్తుందా? అంటే పలు నివేదికలు అవుననే చెబుతున్నాయి.

  • Share this:
మానవ మేధో శక్తికి అంతు అనేది లేదు. నిప్పు కనిపెట్టడం దగ్గర నుంచి నింగిలోకి దూసుకెళ్లడం వరకు.. ప్రతిదీ మనిషి ఆలోచనల పరంపర నుంచి వచ్చినదే. మనిషి ఆలోచనల నుంచి నిర్మితమై మనిషినే సవాలు చేసే స్థాయికి ఎదిగింది సాంకేతికత. ముఖ్యంగా తర్వాతి తరం టెక్నాలజీగా చెబుతున్న కృత్రిమ మేధస్సును(Artificial intelligence) ఇప్పుడిప్పుడే చాలా రంగాల్లో ఉపయోగిస్తున్నారు. అయితే రచన లాంటి సృజనాత్మకత రంగంలో మనిషిదే ఆధిపత్యం. అంతటి ఊహాశక్తి మానవునికి ఉన్న వరం. కానీ భవిష్యత్తులో ఈ రంగంలో మనిషిని కృత్రిమ మేధస్సు అధిగమిస్తుందా? అంటే పలు నివేదికలు అవుననే చెబుతున్నాయి.

అమెరికా శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఓపెన్ ఏఐ అనే సంస్థ న్యూరల్ నెట్వర్క్ మెషిన్ లెర్నింగ్ మోడల్ ద్వారా ఆ దిశగా అడుగులు వేస్తోంది. ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ సహ వ్యవస్థాపకులుగా ఉన్న ఈ కంపెనీ రూపొందించిన GPT-3 AI భాషా సామర్థ్యం అందర్నీ ఆకర్షించింది. 2020లో ప్రారంభించిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. పుస్తకాలు రాయడం, కంప్యూటర్ కోడింగ్, కవిత్వం లాంటి విషయాల్లో ప్రారంభ అడుగులు వేసింది. దీంతో రాబోయే GPT-4 AI మానవ సామర్థ్యాన్ని చేరుకుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

GPT-3 అంటే ఏంటి?
జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ- ట్రైన్డ్ ట్రాన్స్‌ఫార్మర్ లేదా జనరేటివ్ ప్రీ ట్రైనింగ్. ఇది ఇంటర్నెట్ నుంచి డేటాను సంగ్రహించి టెక్ట్స్‌ను తనంతట తానే రూపొందించే మూడో తరం కృత్రిమ మేధస్సు మోడల్. ఈ జీపీటీ-3 నిర్మాణాత్మకంగా ఉన్న ఎలాంటి అంశాన్నైనా చదవగలదు, అధ్యయనం చేయగలదు. భాషకు సంబంధించిన పనులను చేయగలదు. ఉదాహరణకు, పత్రికా ప్రకటనలు, ట్వీట్లు కంప్యూటర్ కోడ్ ను కంపోజ్ చేయడంలో ఇది శిక్షణ పొందింది. ఇది భాషలో ఉండే కొంత భాగాన్ని(Input) తీసుకొని వినియోగదారుని ఉపయోగపడేలా లాంగ్వేజిని మారుస్తుంది. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రజల ముందుకు రాలేదు. కేవలం ఎంపిక చేసిన నిపుణులు మాత్రమే దీన్ని వినియోగిస్తున్నారని గత అక్టోబర్‌లో కొన్ని నివేదికలు తెలిపాయి.

జీపీటీ-3 కంటే ముందు జీపీటీ-2, జీపీటీ-1ను 2019, 2018 సంవత్సరాల్లో ఓపెన్ ఏఐ లాంచ్ చేసింది. ఈ రెండింటి కంటే భిన్నంగా జీపీటీ-3ని రూపొందించింది. జీపీటీ-2.. 1.5 బిలియన్ పారామీటర్స్‌ను కలిగి ఉంటే, జీపీటీ-3లో 175 బిలియన్ పారామీటర్స్ ఉన్నాయి. అంటే దాదాపు 10 రెట్లు అధికంగా ఆర్టిఫిషియల్ న్యూరాన్ నెట్వర్క్ జీపీటీ-3లో ఉన్నాయి. ఈ కృత్రిమ న్యూరల్ నెట్వర్క్(ANN) మనిషి మెదడు ఎలా పనిచేస్తుందో అలా అనుకరించేలా రూపొందించిన వ్యవస్థ. కంప్యూటర్ ప్రోగ్రామ్స్ నమూనాలను గుర్తించడానికి, మెషిన్ లెర్నింగ్ రంగాల్లో సాధారణ సమస్యలను పరిష్కరించడానికి వీలు కల్పిస్తుంది.

GPT-4 ఎలా ఉండబోతుంది?
జీపీటీ ఇతర NLP ప్రోగ్రామ్స్ సంబంధించిన ప్రీ ట్రైనింగ్ మోడల్. భాషా నియమాలు, పదాల అర్థంలో వైవిధ్యాలను తెలుసుకునేలా భారీ లోడ్లను ఇన్ పుట్ గా ఇచ్చారు. ప్రతి ఏడాది ఓ కొత్త వెర్షన్ లాంచ్ చేసేలా జీపీటీ-4ను ఈ సంస్థ తీసుకు రానుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో లేదా చివర్లో విడుదల చేసే అవకాశముంది. దీన్ని నిపుణులు గేమ్ ఛేంజర్ గా చెబుతున్నారు. జీపీటీ-4లో 100 ట్రిలియన్ పారామితులు ఉంటాయట. అంటే జీపీటీ 3 కంటే ఐదు వందల రెట్లు శక్తిమంతంగా ఉంటుంది. అంతేకాకుండా 100 సినాప్సిస్ ను కలిగి ఉంటుందని చెబుతున్నారు. జీపీటీ-3 కంటే పారామితులు అధికంగా ఉండటం వల్ల భాష విషయంలో మరింత పగడ్భందీగా మారనుంది. "విజువల్ వరల్డ్ గురించి తెలుసుకోవడానికి త్వరలో లాంగ్వేజ్ మోడల్స్ ప్రారంభమవుతాయని" ఓపెన్ ఏఐ ఛీఫ్ సైంటిస్టుల్లో ఒకరు తెలిపారు.

మనిషితో ఎలా పోటీ పడగలదు?
సాధారణ మానవుని మేధస్సుకి సరిసమానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉండేలా చేయడమే తమ లక్ష్యమని ఓపెన్ ఏఐ సంస్థ స్పష్టం చేసింది. అంటే మనిషి ప్రదర్శించే తెలివి తేటలను కృత్రిమ మేధస్సు ద్వారా సాధ్యం చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. అనుకోవడానికి సింపుల్ ఉన్నప్పటికీ ప్రస్తుతమున్న AIల సామర్థ్యాలు అంత ప్రభావవంతంగా లేవని, మానవునితో పోటీపడాలంటే కృత్రిమ మేధస్సు పనితీరు ఇంకా బలపడాలని ఓపెన్ ఏఐ తెలిపింది.

అంతేకాకుండా మానవ స్థాయి మేధస్సును అంచనా వేయలేమని, ఒకవేళ ఆ స్థాయిలో నిర్మించినప్పటికీ వాటిని తప్పుగా ఉపయోగించినట్లయితే సమాజాన్ని ఎంత తీవ్రంగా దెబ్బతీస్తుందో ఊహించడానికి కూడా కష్టమని పేర్కొంది. డిజిటల్ ఇంటెలిజెన్స్ ను మానవాళికి ఉపయోగపడేలా ముందుకు తీసుకెళ్లాలని, అయితే ఇందుకు ఎంత సమయం పడుతుందో చెప్పలేమని చెప్పింది.

"కృత్రిమ మేధస్సు మానవుని స్థాయికి ఎప్పుడు చేరుకోగలదో అంచనా వేయడం కష్టం. ఇందుకు లోతైనా అభ్యాసం కావాలి. అంతేకాకుండా చాలా కాలం పడుతుంది. ప్రస్తుతం AI మానవ ఆలోచన విధానాలను అనుకరించడానికి దగ్గరగా ఉంది" అని ఓపెన్ ఏఐ స్పష్టం చేసింది.
Published by:Krishna Adithya
First published: