EXPLAINED BEIJING 2022 WINTER OLYMPICS HERE HOW COVID 19 TESTS AND ISOLATION WILL WORK AT MEGA EVENT GH SRD
Explained: క్రీడా సంబరానికి కరోనా సవాల్.. చైనాలో అథ్లెట్లు సేఫేనా? వింటర్ ఒలింపిక్స్ కోవిడ్ రూల్స్ ఇవే..
Beijing 2022 Winter Olympics
Explained: మహమ్మారి భయాల నడుమ భారీ క్రీడా ఈవెంట్‌ను నిర్వహించడం క్లిష్టమైన సమస్య అని చైనా భావిస్తోంది. ఈ క్రీడల్లో పాల్గొనేవారి నుంచి స్థానిక జనాభాకు వైరస్ వ్యాప్తి చెందకుండా చూసుకోవడం అతిపెద్ద టాస్క్.
మహమ్మారి ప్రారంభం నుంచే వైరస్ పట్ల జీరో టాలరెన్స్(zero tolerance) విధానాన్ని అనుసరిస్తున్న చైనా.. అతిపెద్ద ఈవెంట్ అయిన వింటర్ ఒలింపిక్స్-2022 నిర్వహణకు మరింత పటిష్ఠ చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో క్రీడలకు హాజరయ్యే వారి నుంచి దేశంలోని సాధారణ పౌరులకు వైరస్ వ్యాప్తి చెందకుండా పకడ్బందీ వ్యూహాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. వాస్తవానికి కరోనా వైరస్ వెలుగుచూసినప్పటి నుంచి కఠిన చర్యలు తీసుకుంటోంది చైనా. అక్కడ మరికొద్ది రోజుల్లో ప్రఖ్యాత వింటర్ ఒలింపిక్స్(Winter Olympics-2022) అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. బీజింగ్‌తో పాటు.. దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో ఈ క్రీడలను నిర్వహించనుంది డ్రాగన్ కంట్రీ.
ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 20 మధ్య జరిగే ఈ గేమ్స్‌కు హాజరయ్యే క్రీడాకారులు, ఇతర సిబ్బంది ఆతిథ్య దేశం నిర్వహించే కొవిడ్-19 నిర్ధరణ పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంది. పలు దశల్లో ఉండనున్న ఈ టెస్టుల వల్ల ఇన్ఫెక్షన్లు(China corona cases) సోకిన వారిని ముందుగా గుర్తించి, వారిని ఐసోలేట్ చెయ్యొచ్చని వింటర్ ఒలింపిక్స్ నిర్వాహకులు చెబుతున్నారు.
మహమ్మారి భయాల నడుమ భారీ క్రీడా ఈవెంట్‌ను నిర్వహించడం క్లిష్టమైన సమస్య అని చైనా భావిస్తోంది. ఈ క్రీడల్లో పాల్గొనేవారి నుంచి స్థానిక జనాభాకు వైరస్ వ్యాప్తి చెందకుండా చూసుకోవడం అతిపెద్ద టాస్క్. అందుకే బయో బబుల్స్ సృష్టించేందుకు గత వేసవిలో ముగిసిన టోక్యో ఒలింపిక్స్‌లో(Tokyo olympics) అనుసరించిన ప్రోటోకాల్స్‌నే ప్రస్తుతం ఫాలో కానున్నారు. దీనిలో భాగంగా నిర్వహించబోయే పరీక్షలు ఎలా ఉంటాయో మీరూ తెలుసుకోండి మరి..
* కరోనా టెస్టులు ఎలా ఉంటాయంటే..?
బీజింగ్ వింటర్ ఒలింపిక్స్(Beijing Winter Olympics-2022) కోసం చైనాకు వెళ్లే అథ్లెట్లు, జట్టు అధికారులు, జర్నలిస్టులు, ఇతర సిబ్బంది వారం వ్యవధిలో కనీసం రెండుసార్లు నెగిటివ్ రిపోర్ట్‌ను అందించాలి. ఒలింపిక్ సైట్లకు వెళ్లే ముందు విమానాశ్రయంలో మళ్లీ పరీక్షలు నిర్వహిస్తారు. ఈవెంట్స్ జరిగే సమయంలోనూ ప్రతి ఒక్కరూ PCR ల్యాబ్ పరీక్షల కోసం రోజు శాంపిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్క రోజులోనే ఫలితాలు వస్తాయి. ఇక ప్రపంచంలోని అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఇప్పటికే చాలా మంది టీకాలు తీసుకున్న వారికి క్వారంటైన్ నిబంధనల నుంచి సడలింపు ఉంటుంది.
* పాజిటివ్‌గా తేలితే?
మొదటగా నిర్ధరణ పరీక్షలు చేస్తారు. కొవిడ్-19(COVID-19 Test in China) లక్షణాలతో ఉన్నవారిని ఆసుపత్రికి తరలిస్తారు. లక్షణాలు లేని వారు ఐసోలేషన్ కోసం ప్రత్యేక హోటల్‌కు పంపిస్తారు. ఈ రెండు సందర్భాల్లోనూ క్రీడాకారులు పూర్తిగా కోలుకునేంత వరకు ఒలింపిక్స్‌లో పాల్గొనలేరు.
* ఐసోలేషన్ ఎంతకాలం?
ఇది ఆయా వ్యక్తులు కోలుకునే సమయంపై ఆధారపడి ఉంటుంది. నెగిటివ్ పరీక్షలతో పాటు లక్షణాలు లేకుండా ఉన్నవారికి క్వారంటైన్ అవసరం లేదు. ఒక వ్యక్తికి వైరస్ సోకే అవకాశం ఉన్న చాలాకాలం తర్వాత పరీక్షలు సానుకూలంగా రావచ్చు. ఈ నేపథ్యంలో దేశం కాని దేశంలో ఒంటరిగా క్వారంటైన్లో(China Quarantine Rules) ఎంతకాలం ఉండాలనే అంశం క్రీడాకారులను ఆందోళనకు గురి చేస్తోంది.
* నిర్ధరణ పరీక్షలు సరిపోతాయా?
ఓ వ్యక్తికి కరోనా పరీక్షలు నిర్వహించడంతో పాటు ఇతర అంశాలను పరిశీలిస్తామని ఒలింపిక్ నిర్వాహకులు చెబుతున్నారు. గతంలో ఆ వ్యక్తికి కొవిడ్ సోకిందా? టీకా డోసులు తీసుకున్నారా? లేదా? అనే అంశాలను పరిశీలించనున్నట్లు బీజింగ్ ఒలింపిక్స్ వైద్యాధికారి డాక్టర్ బ్రియాన్ మెక్‌క్లోస్కీ అన్నారు.
* అథ్లెట్లు సేఫేనా?
అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వేరియంట్(Omicron Cases) వల్ల ప్రపంచంలోని అనేక దేశాల్లో కొత్త కేసులు విజృంభిస్తున్నాయి. దీని ప్రభావం వింటర్ ఒలింపిక్స్‌లోనూ కనిపించే అవకాశాలున్నాయని నిపుణులు భావిస్తున్నారు.
జనవరి ప్రారంభం నుంచి ఇప్పటివరకూ చైనాకు వచ్చిన వారికి విమానాశ్రయంలో 2,500 పైచిలుకు పరీక్షలు నిర్వహించగా 39 మందికి పాజిటివ్‌గా తేలింది. బయో బబుల్‌లో ఉన్న 3,36,400మందిని పరీక్షించగా 33 మందికి వైరస్ బయటపడింది. అయితే అథ్లెట్లలో ఎవరికీ కరోనా మహమ్మారి సోకక పోవడం ఊరటనిచ్చే అంశం.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.