Home /News /explained /

EXPLAINED AS COVID ANTIVIRAL MOLNUPIRAVIR LAUNCHES IN INDIA HERES ALL YOU NEED TO KNOW ABOUT THE PILL GH VB

Explained: భారత్‌లో విడుదలైన కొవిడ్‌ యాంటీ వైరల్‌ డ్రగ్ మోల్నుపిరావిర్‌.. దీని గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మోలూలైఫ్‌ అనే పేరుతో మ్యాన్‌కైండ్‌ ఫార్మా సంస్థ ఇప్పటికే ఈ మాత్రను విడుదల చేసినట్టు తెలుస్తోంది. దీని కోసం ఆ సంస్థ BDR ఫార్మసూటికల్స్‌తో ఉత్పత్తి ఒప్పందం కుదుర్చుకుంది.

భారత్‌లో(India) మరో యాంటీ కోవిడ్ డ్రగ్ (Anti Viral Medicine) మార్కెట్లోకి విడుదలైంది. భారత ఔషధ నియంత్రణ మండలి నుంచి అత్యవసర ఉపయోగానికి ఆమోదం పొందిన యాంటీ వైరల్‌(Anti Viral) మాత్ర మోల్నుపిరావిర్‌ (Molnupiravir) మార్కెట్‌లోకి వచ్చేసింది. తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో ఉత్పత్తికి వీలుగా ఈ మాత్రపై అమెరికన్‌ సంస్థ పేటెంట్‌ను(Patent) రద్దు చేయడంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ డజన్‌కు(Dozen) పైగా భారతీయ కంపెనీలు(Indian Companies) వీటిని ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. కొవిడ్‌-19 (Covid19)చికిత్స కోసం అత్యంత చౌకైనదిగా పేర్కొంటున్న ఈ మాత్రను కేవలం కొన్ని నిర్దిష్ట కేసుల్లో మాత్రమే ఉపయోగించేందుకు అనుమతించారు.

Moths: మీ దుస్తులను తినే కీటకాలను ఇలా వదిలించుకోండి... అసలు ఇవి క్లాత్స్‌ను ఎందుకు తింటాయంటే..


భారత్‌లో ఎన్ని సంస్థలు మోల్నుపిరావిర్‌ మాత్రను తయారు చేస్తున్నాయి?
మోలూలైఫ్‌ అనే పేరుతో మ్యాన్‌కైండ్‌ ఫార్మా సంస్థ ఇప్పటికే ఈ మాత్రను విడుదల చేసినట్టు తెలుస్తోంది. దీని కోసం ఆ సంస్థ BDR ఫార్మసూటికల్స్‌తో ఉత్పత్తి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ 200mg మాత్రలు ఢిల్లీ, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ మాత్రల కోర్సు మొత్తానికి రూ.1,500- రూ.2,500 వరకు ఖర్చవుతుంది. సిఫార్సు చేసిన మొల్నూపిరావర్‌ డోసు 800mg. అంటే 200mg క్యాప్సూల్స్‌ నాలుగు, ప్రతీ 12 గంటలకు తీసుకోవాల్సి ఉంటుంది. ఐదు రోజుల పాటు ఈ మాత్రలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే పూర్తి కోర్సు అంటే 40 మాత్రలు తీసుకోవాలి. మొలెక్స్‌విర్‌ పేరుతో మోల్నుపిరావిర్‌ ఔషధాన్ని ప్రవేశపెట్టనుంది సన్‌ ఫార్మా. ఈ ఔషధాన్ని తయారు చేసిన అమెరికా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న ఐదు భారతీయ జనరిక్‌ డ్రగ్స్‌ తయారీదార్లలో ఇది ఒకటి.

మొలెక్స్‌విర్‌ పేరుతో మోల్నుపిరావిర్‌ ఔషధాన్ని ప్రవేశపెట్టనుంది సన్‌ ఫార్మా. ఈ ఔషధాన్ని తయారు చేసిన అమెరికా సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న ఐదు భారతీయ జనరిక్‌ డ్రగ్స్‌ తయారీదార్లలో ఇది ఒకటి.

మోల్నుపిరావిర్‌ ఔషధ వినియోగానికి డిసెంబర్‌ 28న అత్యవసర అనుమతి ఇచ్చిన సందర్భంలో 13 భారతీయ కంపెనీలు ఈ మాత్రలు తయారు చేస్తున్నట్లు ప్రకటించారు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ. అయితే ఈ మాత్రలను కొవిడ్‌తో బాధపడుతున్న వయోజనులైన రోగులు, అది కూడా లక్షణాలు తీవ్రంగా పెరుగుతున్న క్రమంలో మాత్రమే ఉపయోగిస్తారు.

Online Payments: ఆన్​లైన్ పేమెంట్లు ఎలా జరుగుతాయి..? ట్రాన్సాక్షన్స్​ ప్రాసెసింగ్ ప్రక్రియ, ఛార్జీల గురించి పూర్తి వివరాలు..


ఇంతకీ మోల్నుపిరావిర్‌ ఏంటి?
అమెరికాకు చెందిన ఎమోరీ యూనివర్సిటీ, రిడ్జ్‌బ్యాక్‌ బయోఫార్మసూటికల్స్‌, ఫార్మా దిగ్గజం మెర్క్‌ సంయుక్తంగా కృషి చేసి ఈ మాత్రను అభివృద్ధిపరిచాయి. కొవిడ్‌ కోసం ప్రపంచమంతటా ఉపయోగించేందుకు అనుమతి పొందిన మొట్టమొదటి యాంటీ కొవిడ్‌ మాత్ర ఇది. దీనికి యూకే డ్రగ్‌ రెగ్యులేటర్‌ అనుమతి కూడా లభించింది. భారత్‌లో ఉపయోగించేందుకు అనుమతి వచ్చిన వెంటనే అమెరికా కూడా దీనికి ఆమోదం తెలిపింది.

అధిక రిస్క్‌ కలిగిన వ్యక్తులు, రోగనిరోధకశక్తి బలహీనంగా ఉన్నవారికి ఇది ఎంతో ప్రయోజనకారిగా చెబుతున్నారు. కొవిడ్‌కు సంబంధించిన మిగిలిన చికిత్సల్లో ఆస్పత్రుల్లో చేరాల్సి ఉంటుంది. దీనికి ఆ అవసరం లేదు. ఇంట్లో ఉండి ఈ మాత్రలను నోటి ద్వారా తీసుకోవచ్చు.

నవంబర్‌ 2021లో మెర్క్‌ విడుదలే చేసిన తాజా ట్రయల్‌ సమాచారం ప్రకారం ఈ ఔషధాన్ని తీసుకున్న వారిలో 6.8 శాతం మంది మాత్రమే హాస్పిటల్‌లో చేరడం లేదా మృత్యువాత పడటం జరిగింది. అదే ప్లాసిబో గ్రూప్‌లో ఇది 9.7 శాతంగా ఉంది. రిస్క్‌ తగ్గింపు అన్నది కచ్చితంగా 3 శాతం ఉన్నట్టుగా గుర్తించారు. మోల్నుపిరావిర్‌ మాత్ర తీసుకున్న బృందంలో కేవలం ఒక మరణం సంభవిస్తే, ప్లాసిబో గ్రూప్‌లో తొమ్మిది మరణాలు నమోదయ్యాయి.

మోల్నుపిరావిర్‌ను ఎవరు ఉపయోగించవచ్చు?
కొవిడ్‌-19 సోకి, ఆ వ్యాధి లక్షణాలు తీవ్రంగా పెరుగుతున్న వయోజనులైన కొవిడ్‌ 19 రోగులకు మోల్నుపిరావిర్‌ మాత్రలను ఉపయోగించేందుకు భారతదేశం అత్యవసరం ఆమోదం మంజూరు చేసింది. దీన్ని నియంత్రిత మార్గదర్శకాల కింద విడుదల చేశారు. అంటే ఈ మాత్రను తీసుకోవాలంటే సరైన మెడికల్‌ ప్రిస్క్రిప్షన్‌ ఉండాలి. మెడికల్ షాప్ కౌంటర్‌లోకి వెళ్లి కొనుగోలు చేసే ఔషధం కాదు ఇది.

కొవిడ్‌-19తో బాధపడుతున్న పెద్దవారిలో స్వల్ప నుంచి మధ్యస్థాయి వరకు ఉండి వారిలో వ్యాధి లక్షణాలు ఉన్నవారికీ దీన్ని ఉపయోగించవచ్చు. అయితే ఆ లక్షణాలు తీవ్రంగా పెరిగే అవకాశాలు ఉండటం, ఆస్పత్రిలో చేరడం లేదా మరణించడం, ఇతర ప్రత్యామ్నాయ కొవిడ్‌-19 చికిత్స అవకాశాలు అందుబాటులో లేకపోవడం లేదా వైద్యపరంగా అవి తగినవి కాకపోవడం వంటి వారికి ఈ ఔషధం ఉపయోగించవచ్చు. ఈ మేరకు తమకు అమెరికా ఔషధ సంస్థ నుంచి అనుమతి లభించిందని మెర్క్‌ తెలిపింది.

ఇప్పటికే ఆస్పత్రిలో ఉన్నవారు లేదా ఐదు రోజుల కంటే ఎక్కువ రోజులు చికిత్స తీసుకున్న రోగులు దీన్ని ఉపయోగించరాదు. అయితే వైరల్‌ ఉధృతిని తగ్గించడానికి, సార్స్‌ కొవ్‌-2 సంక్రమణను పరిమితం చేసేందుకు పూర్తి ఐదు రోజుల కోర్సు ఉపయోగించడం ముఖ్యమని మెర్క్‌ చెప్తోంది. దీన్ని కొవిడ్‌-19 నివారణ చర్యగా ముందస్తుగా తీసుకోవడం కుదరదు.

New Smartphone: రూ. 999లకే శామ్​సంగ్​ గెలాక్సీ 5జీ స్మార్ట్ ఫోన్.. ఇలా సొంతం చేసుకోండి..


ఈ మాత్రకు లాగేవ్రియో అనే పేరు కూడా. దీన్ని కొవిడ్‌ 19ను గుర్తించిన తొలి దశలో లక్షణాలు వృద్ధి చెందుతున్న దశలో ఉపయోగించాలని యూకే డ్రగ్స్‌ రెగ్యులేటర్‌ పేర్కొన్నారు. అంతే కాదు స్వల్ప నుంచి మధ్యస్థాయి కొవిడ్‌-19 కలిగి వారిలో ఊబకాయం, డయాబెటీస్‌, లేదా గుండె జబ్బు సహ ఏదైనా తీవ్రమైన వ్యాధి పెరిగే ముప్పు ఉన్నవారికి లేదా 60 ఏళ్లు పైబడిన వారికి దీన్ని ఉపయోగించేందుకు అనుమతించింది.

ఇన్ఫెక్షన్‌ తొలి దశలో ఉన్నప్పుడు లాగేవ్రియో అత్యంత ప్రభావవంతంగా ఉందని క్రినికల్‌ ట్రయల్స్‌ డేటా సూచిస్తోంది. కొవిడ్‌-19 పాజిటివ్‌ గుర్తించిన తర్వాత లక్షణాలు ఏర్పడుతున్న మొదటి ఐదురోజుల్లో దీన్ని ఉపయోగించేందుకు MHRA సిఫార్సు చేసింది.

గర్భిణులు ఉపయోగించేందుకు మోల్నుపిరావిర్‌ సిఫార్సు చేయడం లేదని మెర్క్ తెలిపింది. జంతువులపై నిర్వహించిన అధ్యయనాల ప్రకారం ఈ ఔషధాన్ని తీసుకుంటే పిండానికి హాని తలెత్తవచ్చని తేలిందని మెర్క్ వివరించింది. అయితే మోల్నుపిరావిర్‌ ద్వారా తలెత్తే పుట్టుకతో వచ్చే ప్రధాన లోపాలు, గర్భస్రావం లేదా తల్లి లేదా పుట్టే శిశువుకు ప్రతికూలంగా ఉంటుందా అని గుర్తించేందుకు మానవ డేటా అందుబాటులో లేదు.

సంతానం పొందే వయస్సు కలిగిన స్త్రీలు ఈ మాత్రలు తీసుకుంటున్నప్పుడు గర్భనిరోధక విధానాలను స్రక్రమంగా, స్థిరంగా ఉపయోగించాలని, చికిత్స సమయంలోనూ మోల్నుపిరావిర్‌ చివరి డోసు తీసుకున్న తర్వాత నాలుగు రోజుల వరకు దాన్ని కొనసాగించాలని సూచించింది. చికిత్స సమయంలో సంతాన సామర్ధ్యం కలిగిన పురుషులు సంతాన సాఫల్యత కలిగిన స్త్రీలతో లైంగిక చర్యలు జరిపేటప్పుడు విశ్వసనీయమైన గర్భనిరోధక విధానాన్ని సక్రమంగా, స్థిరంగా ఉపయోగించాలని, అలాగే చివరి డోసు తర్వాత మూడు నెలల వరకు దీన్ని కొనసాగించాలని సిఫార్సు చేసింది.

ఎముకలు, మృదులాస్థి ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది కాబట్టి 18 ఏళ్లలోపు వారికి ఈ మాత్ర ఉపయోగించరాదు. పిల్లల విషయంలో ఈ మాత్ర సామర్థ్యం, రక్షణకు సంబంధించి ఇంత వరకు ధ్రువీకరణ జరగలేదు.

ఇది ఎలా పనిచేస్తుంది?
మెకానిజంలో లోపాలు ప్రవేశపెట్టడం ద్వారా మోల్నుపిరావిర్‌ పనిచేస్తుంది. ఇందులో RNA రిప్లికేషన్‌ జరుగుతుంది. అంటే వైరస్‌ సోకిన వ్యక్తిలో ఈ వైరస్‌ విస్తరిస్తూ ఉంటుంది. దాని RNAలో దాని మాతృకలు వచ్చేలా ఈ ఔషధం చూసి అది మ్యుటేషన్లన్నింటినీ ఒక చోటకు చేర్చి ఇక అది పునరుత్పత్తి చేయలేకుండా చూస్తుంది. శరీరంలో వైరస్‌ స్థాయిని తక్కువ ఉండేలా ఈ ఔషధం చేస్తుంది కాబట్టి, వ్యాధి తీవ్రతను ఇది తగ్గించగలుగుతుందని UK డ్రగ్స్‌ రెగ్యులేటర్‌ తెలిపారు.
భారతదేశంలో మొదట గుర్తించిన అత్యంత సాధారణమైన Sars-CoV-2 రకమైన డెల్టా, మూ, గామా వంటి వైరసులపై మోల్నుపిరావిర్‌ చురుగ్గా పనిచేస్తున్నట్టు ప్రీ-క్లినికల్‌, క్లినికల్‌ డేటాలో గుర్తించామని మెర్క్‌ తెలిపింది.

ఈ ట్రయల్స్‌లో పాల్గొన్నవారిలో ల్యాబ్‌ ద్వారా స్వల్ప నుంచి మధ్యస్థాయి కొవిడ్‌-19 నిర్థారించినట్టు, అంతే కాకుండా వారిలో ఒక వ్యాధికి ఒక రిస్క్‌ కూడా ఉందని మెర్క్‌ తెలిపింది. అలాంటి వారిలో ఆస్పత్రిలో చేరడం, మరణం వంటి ముప్పు తగ్గిందని వెల్లడించింది.
Published by:Veera Babu
First published:

Tags: Corona, Covid -19 pandemic

తదుపరి వార్తలు