EXPLAINED ARE YOU TURNING 50 7 STEPS TOWARDS A SECURE FINANCIAL FUTURE GH VB
Explained: మీ వయసు 50 ఏళ్లకు చేరువ అవుతోందా..? ఆర్థిక భవిష్యత్తును సుస్థిరం చేసుకునేందుకు ఈ 7 పద్ధతులు మీ కోసం..
ప్రతీకాత్మక చిత్రం
మీరు 50ల్లోకి అడుగు పెడుతుంటే.. మీ రిటైర్మెంట్ జీవితంగా సాఫీగా, సంతోషంగా సాగాలంటే కొన్ని విషయాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా పెట్టుబడుల పోర్టుఫోలియోను సమీక్షించాలి. ఇందుకు పరిగణనలోకి తీసుకోవాల్సిన ఆర్థిక అంశాల గురించి తెలుసుకుందాం.
వయసు మీద పడుతున్నా కొద్దీ చాలా మంది రిటైర్మెంట్(Retirement) తరువాత వచ్చే నిధుల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఇన్నాళ్లుగా తాము దాచుకున్న నిధులపైనే చాలామంది దృష్టి పెడతారు. ఈ క్రమంలో తమ పెట్టుబడులను(Investments) సమీక్షించుకోరు. రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా ఎలా పదిలంగా ఉండాలనేది పట్టించుకోరు. అలాంటి చర్యల కారణంగా వారు జీవితాంతం చేసిన పెట్టుబడులు, పొదుపు(Saving) నిరర్థకంగా మారిపోతాయి. రిటైర్మెంట్కు కొన్ని సంవత్సరాల ముందు(Years ago) మీ పెట్టుబడుల నిర్వహణలో చురుగ్గా పాల్గొనడం చాలా అవసరం. మీరు 50ల్లోకి అడుగు పెడుతుంటే.. మీ రిటైర్మెంట్ జీవితంగా సాఫీగా, సంతోషంగా సాగాలంటే కొన్ని విషయాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ముఖ్యంగా పెట్టుబడుల పోర్టుఫోలియోను సమీక్షించాలి. ఇందుకు పరిగణనలోకి తీసుకోవాల్సిన ఆర్థిక అంశాల గురించి తెలుసుకుందాం.
మీ రిస్క్ తత్వాన్ని సమీక్షించుకోండి
అన్నింటి కంటే ముందు మీ ఆస్తులు, ఖర్చులకు సంబంధించిన పూర్తి వివరాలు నోట్ చేసుకోండి. ఈ రెండు విషయాలు పరిశీలించిన తర్వాత రిస్క్ తీసుకోగలిగే మీ సామర్ధ్యాన్ని మీరు అంచనా వేసుకోవచ్చు. ఈ ఆర్థిక లెక్కల పరిశీలనతో రెండు ప్రయోజనాలు ఉంటాయి. మీ ఫైనాన్షియల్ హెల్త్ గురించి మీకు తెలుస్తుంది కాబట్టి నిశ్చింతగా ఉండవచ్చు. మీ ఆర్థిక సామర్థ్యం ఏ మేరకు ఉందో మీకు తెలుసు కాబట్టి రిటైర్మెంట్కు ముందు మిగిలిన సంవత్సరాల్లో ఏం చేస్తే బాగుంటుందో ఒక అంచనాకు రావచ్చు.
ఈక్విటీ పెట్టుబడులను క్రమబద్ధీకరించుకోండి
రిస్క్ ఏమైనా ఉంటే అవి తగ్గించుకునే దృష్టితో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్‌లో పెట్టుబడులను విస్తరించాలి. ఉదాహరణకు మీకు ఒకే రకమైన ఫండ్స్ చాలా ఉంటే అలాంటి వాటిని తగ్గించుకొని వాటిని ఇతర ఆధారపడదగిన స్కీమ్స్‌లోకి మళ్లించడం మంచిది. అలాగే మీరు నేరుగా పెట్టుబడులు కలిగిన కంపెనీలను పరిశీలించి లార్జ్ క్యాప్స్‌లో పెట్టుబడులు కొనసాగించవచ్చు. దీని కోసం అవసరమైతే నిపుణులైన ఇన్వెస్ట్మెంట్ సలహాదారుల సాయం తీసుకోవాలి.
ఈక్విటీ ఎక్స్పోజర్ తగ్గించుకోండి
మీ మొత్తం పోర్టుఫోలియో కేటాయింపుల్లో ఈక్విటీ వాటాను 40-50% తగ్గించుకునే అంశాన్ని పరిశీలించండి. మీరు 50 మధ్యల్లోకి వచ్చేటప్పటికీ డెట్ ఇన్‌స్ట్రూమెంట్స్‌పై ఎక్స్పోజర్ పెంచుకోండి. మీ ఈక్విటీ ఆధారిత పెట్టుబడుల కోసం మీరు బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ వంటి డైనమిక్ అసెట్ అలకేషన్ ఫండ్స్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు.
డెట్ పెట్టుబడులను క్రమబద్ధీకరించుకోండి
బ్యాంకుల్లో కొత్తగా FD లేదా RDలు సరికాకపోవచ్చు. దాని బదులు మీ FD, RDల్లోని పెట్టుబడలును డెట్ ఆధారిత హైబ్రిడ్ ఫండ్స్‌లోకి మళ్లించండి. దీని వల్ల మీకు మంచి రాబడి అందుతుంది. అంతేకాదు మీకు డబ్బు ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. మీకు డబ్బు అవసరం ఉన్నప్పుడు FDల తరహాలో వీటిని పూర్తిగా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉండదు.
ఎమర్జెన్సీ ఫండ్ మెయింటెయిన్ చేయండి
ఒక బలమైన ఎమర్జెన్సీ నిధి ఏర్పాటు చేసుకునేందుకు మీరు కృషి చేయాలి. మీరు రిటైర్ అయిన తర్వాత హఠాత్తుగా చోటుచేసుకునే ఆర్థిక సంక్షోభంలో మీకు ఈ నిధి చేదోడు, వాదోడుగా ఉంటుంది. మీ ఎమర్జెన్సీ నిధిని పెంచుకునేందుకు మీ పొదుపు మొత్తంలో కొంత భాగాన్ని లిక్విడ్ ఫండ్స్‌లోకి మళ్లించవచ్చు. లిక్విడ్ ఫండ్స్ మీ పెట్టుబడులపై ఒకింత మెరుగైన రాబడిని అందిస్తాయి.
సావరిన్ గోల్డ్ బాండ్స్ వైపు చూడండి (SGBs)
మీరు ఇప్పటికే సావరిన్ గోల్డ్ బాండ్స్‌లో పెట్టుబడి పెట్టి ఉంటే ఆ కేటాయింపులను పెంచుకునేందుకు ఆలోచన చేయండి. ఒకవేళ మీ పెట్టుబడి పోర్టుఫోలియోలో బంగారం భాగంగా లేకపోతే మీరు మీ మొత్తం పోర్టుఫోలియోలో 10% మొత్తాన్ని బంగారం ఆధారిత పెట్టుబడులు అంటే SGBల్లోకి మళ్లించే విషయాన్ని పరిశీలించండి. బంగారంలో పెట్టుబడులు ద్రవ్యోల్బణం నుంచి రక్షణ కల్పించడంతో పాటు అవి మీ పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని తీసుకొస్తాయి. అంతే కాదు, అనిశ్చిత సమయాల్లో ఇవి సహాయకారిగా నిలుస్తాయి. కాని, మీ మొత్తం పోర్టుఫోలియోలో బంగారంపై పెట్టుబడి 10-15% దాటకూడదు.
మెడికల్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు పెంచుకోవడం
మీరు 50ల్లోకి వస్తున్నప్పుడు మీ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలను ఒకసారి పరిశీలించండి. మీ ఆరోగ్య పరిస్థితిని చూసుకొని వాటిల్లో అధిక ప్రయోజనాలు, ఫీచర్లు పెంచుకోవడంతో పాటు బీమా మొత్తాన్ని పెంచుకునే అంశాన్ని పరిగణనలోకి తీసుకోండి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.