Explained: ఇండియాలో కరోనా వ్యాక్సిన్లు మంచివేనా? ఎంత మంది చనిపోయారు?

ఇండియాలో కరోనా వ్యాక్సిన్లు మంచివేనా? ఎంత మంది చనిపోయారు? (ప్రతీకాత్మక చిత్రం)

Explained: కరోనా వ్యాక్సిన్లు... ఆ వైరస్‌ని అడ్డుకోగలుగుతున్నాయా?... వాటిలో నిజంగానే అంత ఎఫికసీ ఉందా... వాటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్టులూ రావట్లేదా... వాస్తవం ఏంటి?

  • Share this:
    ఇండియాలో యాడ్వెర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ ఇమ్యునైజేష్ (AEFI) కమిటీ కరోనా వ్యాక్సిన్ల సైడ్ ఎఫెక్టులను పరిశీలిస్తోంది. ఈ కమిటీ ప్రకారం... మార్చి 29 నాటికి కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో 180 మంది చనిపోయారు. వారంతా వ్యాక్సిన్ వల్లే చనిపోయారు అని కచ్చితంగా చెప్పలేమని AEFI తెలిపింది. జనవరి 16న దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకూ... 11 కోట్ల 99 లక్షల 37వేల 641 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. వీరిలో కోటి మందికి పైగా... రెండేసి డోసులు పొందారు. ఇండియాలో ప్రస్తుతానికి కోవిషీల్డ్ (Covishield) లేదా కోవాగ్జిన్ (Covaxin) వేస్తున్నారు. AEFI నుంచి తాజా డేటా లేదు. కానీ... కేంద్ర ప్రభుత్వంలోని ఓ సీనియర్ ప్రభుత్వాధికారి ప్రకారం... వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో 20,000 మందికి పైగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయి. రెండు వ్యాక్సిన్లలో ఏది తీసుకున్నా ఈ సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయట. వాటిని ఇప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిసింది. ఐతే... వాటిలో 97 శాతం సైడ్ ఎఫెక్టులు... చాలా చిన్నవేనట. అందువల్ల ఆస్పత్రికి కూడా వెళ్లాల్సిన అవసరం రాలేదని తేల్చారు. ఐతే... కొంత మందికి సీరియస్ సైడ్ ఎఫెక్టులు (SAE) వచ్చినా... దాదాపు నెల నుంచి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి సమాచారం ఏదీ బయటపెట్టట్లేదు.

    తాజాగా నేషనల్ AEFIకి AEFI సెక్రటేరియట్ ఇచ్చిన ప్రజంటేషన్‌తో కొన్ని విషయాలు బయటికొచ్చాయి. మార్చి 31 నాటికి దేశంలో వ్యాక్సిన్ పొందిన వారిలో 617 మందికి సీరియస్ సైడ్ ఎఫెక్టులు వచ్చాయి. 180 మంది చనిపోయినట్లు తెలిసింది. అలాగే 305 మందికి చిన్న సైడ్ ఎఫెక్టులు వచ్చనా... వారిని ఆస్పత్రుల్లో చేర్చాల్సి వచ్చింది. అలాగే... వ్యాక్సిన్ వేసిన మూడు రోజుల లోపే... 276 మంది ఆస్పత్రి పాలయ్యారు. చనిపోయిన వారిలో 124 మంది... వ్యాక్సిన్ వేయించుకున్న 3 రోజుల్లోనే చనిపోయారు. ఈ మరణాల సంఖ్య పెరుగుతున్నా... తాజా డేటా బయటకు రావట్లేదని తెలుస్తోంది.

    ఎలాంటి మరణాలు?
    AEFI డేటా ఆధారంగా... ఎక్యూట్ కరొనరీ సిండ్రోమ్ లేదా మయోకార్డియల్ ఇన్‌ఫ్రాక్షన్‌తో 63 మంది చనిపోగా... సెరెబ్రోవస్క్యులర్ యాక్సిడెంట్ కారణంగా 14 మంది చనిపోయారు. 10 మంది సడెన్ డెత్ కింద చనిపోయారు. శ్వాస సంబంధిత సమస్యతో 5గురు చనిపోగా... తెలియని కారణాలతో 14 మంది చనిపోయారు.

    వ్యాక్సిన్లు మంచివా? కాదా?
    కరోనా వ్యాక్సిన్ల వల్ల... సైడ్ ఎఫెక్టులు వస్తున్న మాట నిజం. ఇది ఇండియాలోనే కాదు... ప్రపంచంలోని చాలా దేశాల్లో కనిపిస్తోంది. ఐతే... ఇండియాలో వాడుతున్న వ్యాక్సిన్లు మంచివి కావు అనేందుకు సరైన ఆధారాలు లేవు. ప్రపంచ దేశాలు కూడా ఇండియా నుంచి వచ్చిన వ్యాక్సిన్లను మంచివి కావు అని చెప్పలేదు. ప్రపంచవ్యాప్తంగా రకరకాల కమిటీలు ఈ వ్యాక్సిన్లు మంచివా కావా అనే అంశాన్ని సమీక్షిస్తున్నాయి. ఇండియాలో AEFI ఈ పని చేస్తోంది. ఇప్పటివరకూ కేంద్ర ప్రభుత్వం కోవిషీల్డ్, కోవాగ్జిన్ రెండూ మంచివేననీ, అనుమతి ఉన్న అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరింది.

    ఇది కూడా చదవండి: Watermelon Seeds: పుచ్చకాయ గింజలు తింటే ప్రమాదమా? పొట్టలో మొక్కలు మొలుస్తాయా?

    మరణాలను ఎలా నిర్ధారిస్తారు?
    వ్యాక్సిన్ వేయించుకున్న వారిలో చనిపోయిన వారు, తీవ్రమైన సైడ్ ఎఫెక్టులు ఉన్నవారిని AEFI పరిశీలించనుంది. వాళ్ల మెడికల్ హిస్టరీ, పోస్ట్‌మార్టం రిపోర్టులు, వెర్బల్ అటాప్సీ, హాస్పిటల్ రిపోర్టులు, దర్యాప్తు డాక్యుమెంట్లు, ఇమ్యునైజేషన్ సైట్ వంటి అన్ని అంశాల్నీ లెక్కలోకి తీసుకొని... ఎందుకు చనిపోయారో, ఎందుకు తీవ్రమైన సైడ్ ఎఫెక్టులు వచ్చాయో తెలుసుకోనుంది. ఆ తర్వాత గానీ వ్యాక్సిన్ల వల్ల సైడ్ ఎఫెక్టులు ఏ స్థాయిలో ఉన్నదీ బయటకు రాదు.
    Published by:Krishna Kumar N
    First published: