Kerala Floods: కేరళలో భారీ వరదలకు కారణం ఇదే.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

Kerala Floods: నైరుతి రుతుపవనాల వల్ల దేశమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తాయి.ప్రతి ఏటా మొదటగా కేరళను తాకి అనంతరం దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు ఈ రుతుపవనాలువ్యాపిస్తాయి. అనంతరం తిరుగుముఖం పడతాయి. అయితే, ఈ ఏడాది రుతుపవనాలుఆలస్యంగా తిరోగమించిన కారణంగా కేరళరాష్ట్రంలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దీనికి గల కారణవ వెల్లడించిన వాతావరణ శాఖ..

  • Share this:
భారత్(Bharath) లో వర్షపాతం ఎక్కువగా రుతుపవనాల మూలంగానే సంభవిస్తుంది. ముఖ్యంగా నైరుతి రుతుపవనాల వల్ల దేశమంతటా విస్తారంగా వర్షాలు(Rains) కురుస్తాయి.ప్రతి ఏటా మొదటగా కేరళ(Kerala)ను తాకి అనంతరం దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు ఈ రుతుపవనాలువ్యాపిస్తాయి. అనంతరం తిరుగుముఖం పడతాయి. అయితే, ఈ ఏడాది రుతుపవనాలుఆలస్యంగా తిరోగమించిన కారణంగా కేరళరాష్ట్రంలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. ఆ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు ఉప్పొంగుతున్నాయి.

Explained: ప్రేమ పెళ్లి కంటే.. పెద్దలు కుదిర్చిన పెళ్లి ఎక్కువ కాలం నిలబడటానికి కారణం ఏంటి.. దీని వెనుక రహస్యం ఇదే..


పలు చోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. సహాయక చర్యలు చేపట్టడానికి కూడా అధికారులు సైతం జంకుతున్నారంటే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.తాజాగా నైరుతి రుతుపవనాలు తిరోగమించడంప్రారంభించాయని, పరిస్థితులు త్వరలోనే ఆశాజనకంగా మారుతాయని వాతావరణ నిపుణులుఅంచనా వేస్తున్నారు.

వాతావరణ శాఖ ఏం చెబుతోంది?
భారత వాతావరణ శాఖ(IMD) అక్టోబరు 10న విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. తూర్పు మధ్య అరేబియా సముద్రంలో తుఫాను కారణంగా అక్టోబరు 12 నుంచి 14 తేదీల్లో కేరళ, మాహేల్లో భారీగా వర్షాలు పడతాయని పేర్కొంది. ఇదే సమయంలో నైరుతి రుతుపవనాలు దేశంలోని వాయువ్య ప్రాంతాల నుంచి తిరుగుముఖం పట్టాయని తెలిపింది. ఫలితంగా కేరళలో ఆరు జిల్లాలకు ప్రమదా హెచ్చరికలు జారీ చేసింది. పతనంతిట్ట, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి, పాలక్కాడ్, త్రిస్సూర్, దక్షిణ, మధ్య కేరళ ప్రాంతం వర్షంతో దెబ్బతిన్నాయి.

Kerala Floods: వర్షాలతో తల్లడిల్లుతున్న కేరళ.. వరద బీభత్సాన్ని కళ్లకు గట్టే దృశ్యాలు..


కొట్టాయం, ఇడుక్కి ప్రాంతాలు ఈ సమస్య తీవ్రంగా ఉంది.అక్టోబరు 17న ఐఎండీ బులెటిన్ ప్రకారం, అరేబియా సముద్రం, కేరళపై అల్పపీడన ప్రభావం తక్కువగా ఉందని గుర్తించింది. అయితే ఉత్తర కేరళ, కర్ణాటక తీర ప్రాంతాల్లో తూర్పు, మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడన ప్రభావం ఉంటుందని పేర్కొంది. రాబోయే 24 గంటల్లో కేరళలో మాత్రమే భారీ వర్షాలు కురిసే అవకాశముందని, అనంతరం తగ్గుముఖం పడతాయని పేర్కొంది. అనేక చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని స్పష్టం చేసింది.

ఫ్లాష్ ఫ్లడ్ అలెర్ట్ అంటే ఏంటి?
యూఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకారం తక్కువ వ్యవధిలో భారీ లేదా అధిక వర్షపాతం వల్ల అకస్మాత్తుగా నీటి ప్రవాహం పెరగడాన్ని ఫ్లాష్ ఫ్లడ్ అలెర్ట్ గా హెచ్చరికలు జారీ చేస్తారు. సాధారణంగా ఈ వ్యవధి 6 గంటలు ఉంటుంది. ఈ సందర్భంలో అధిక వర్షపాతం కారణంగా కొన్ని నిమిషాల్లోనే నీటి ప్రవాహం పెరుగుతోంది. నదులు, పర్వత లోయల్లో గుండా ప్రవహించే నీరు పట్టణాల వీధులను జలమయం చేస్తాయి. ఆదివారం నాడు ప్రకటించిన వాతావరణ బులెటిన్ లో కేరళ, మాహే ప్రాంతంలో సంభవించిన వరదలను మధ్యస్థమైన ముప్పుగా గుర్తించింది. కేరళలోని కొన్ని వాటర్ షెడ్లు, పరిసరాల్లో గత 24 గంటల్లో 270 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైందని స్పష్టం చేసింది.

అతడికి వివాహం జరిగి నాలుగు నెలలు.. ఆ ఒక్క మాట పేపర్ పై రాసి భార్య బ్యాగులో వేశాడు.. చివరకు ఏం జరిగిందంటే..


నైరుతి రుతుపవనాల తిరుగుముఖానికి దీనికి సంబంధముందా?
నైరుతి రుతుపవనాలు ఈ సంవత్సరం ఆలస్యంగా తిరోగమనం చెందుతున్నాయని ఐఎండీ గత వారం స్పష్టం చేసింది. భారత భూభాగం నుంచి అక్టోబరు 6న రుతుపవనాలు తిరోగమనం ప్రారంభమైందని, సాధారణంగా సెప్టెంబరు 17నే తిరుగుముఖం పట్టాల్సి ఉందని పేర్కొంది. దీనర్థం రుతుపవనాల వల్ల మేఘాలు చాలా చురుకుగా ఉంటాయని వాతావరణ శాస్త్రవేత్త ఒకరు తెలిపారు.

అల్పపీడనం వల్ల కేరళ, తమిళనాడు, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో వర్షాలకు కారణమైందని, ఫలితంగా రుతుపవనాల తిరోగమనానికి ఆలస్యమైందని చెప్పారు. నైరుతి రుతుపవనాలు తిరుగుముఖం పట్టాయంటే ఈశాన్య రుతుపవనాలు ప్రారంభమవుతాయని అర్థం చేసుకోవాలి. ఇవి తమిళనాడు మొత్తానికి, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాలకు వర్షాన్ని తీసుకొస్తాయి.

2021లో నైరుతి రుతుపవనాలు ఎలా పనిచేశాయి..
వ్యవసాయానికి ఈ రుతుపవనాలు కీలక పాత్ర పోషిస్తాయి. భారత్ లో 60 శాతం మంది రైతులు నైరుతి రుతుపవనాల ద్వారా సంభవించే వర్షాలపై ఆధారపడే పొలం పనులు ప్రారంభిస్తారు. గత సంవత్సరాలతో పోలిస్తే 2021లో ఈ రుతుపవనాల ప్రదర్శన భిన్నంగా ఉంది. నివేదికల ప్రకారం 2021 సీజన్ అకస్మాత్తుగా ఆగిపోవడం, వర్షపాతం అకస్మాత్తుగా పెరగడం, లోటు వర్షపాతం భయంతో కొద్దిసేపు మిగులు జల్లులు నమోదయ్యే పరిస్థితి ఏర్పడింది.

Shirt Buttons: చొక్కా గుండీలు పురుషులకు కుడి వైపున.. మహిళలకు ఎడమవైపున ఉంటాయి.. ఎందుకో తెలుసా..


జూన్ నుంచి సెప్టెంబరు వరకు నైరుతి రుతుపవనాల వర్షపాతం సాధారణంగా ఉంది. లాంగ్ పీరియడ్ యావరేజ్(LPA) ప్రకారం ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబరు మధ్య కాలంలో దాదాపు 87 సెంటిమీటర్ల వర్షం నమోదైంది. వాయువ్య భారత్ లో 96 శాతం, మధ్య భారతదేశంలో 104 శాతం వర్షపాతం నమోదైంది. తూర్పు, ఈశాన్య భారత్​లో88 శాతం నమోదవ్వగా.. దక్షిణ ద్వీపకల్ప భారత్​లో 111 శాతం నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
Published by:Veera Babu
First published: