Family Health Insurence: కుటుంబం మొత్తానికి ఒకే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ.. వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

Family Health Insurence: హెల్త్ ఇన్సూరెన్స్​(Health Insurence) లో ఫ్యామిలీ ఫ్లోటర్స్​ ప్రత్యేకంగా ఉంటాయి. వ్యక్తిగత ఇన్సూరెన్స్​కు ఇవి ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి. ఒకే ఇన్సూరెన్స్​ కవర్ కుటుంబం మొత్తానికి వర్తించడమే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ ప్రత్యేకత. ఒక ఇన్సూరెన్స్ కవర్​కు పాలసీ చెల్లిస్తే కుటుంబం మొత్తానికి హెల్త్​ బీమా వర్తిస్తుంది.

  • Share this:
హెల్త్ ఇన్సూరెన్స్​(Health Insurence) లో ఫ్యామిలీ ఫ్లోటర్స్​ ప్రత్యేకంగా ఉంటాయి. వ్యక్తిగత ఇన్సూరెన్స్​కు ఇవి ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి. ఒకే ఇన్సూరెన్స్​ కవర్ కుటుంబం మొత్తానికి వర్తించడమే ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ ప్రత్యేకత. ఒక ఇన్సూరెన్స్ కవర్​కు పాలసీ చెల్లిస్తే కుటుంబం మొత్తానికి హెల్త్​ బీమా వర్తిస్తుంది. ఫ్యామిలీలోని అందరికీ సమానంగా ఇన్సూరెన్స్​ లాభాలు వర్తించడం ఫ్యామిలీ ఫ్లోటర్స్ స్పెషాలిటీ. అయితే ఇంత సదుపాయం ఉన్న ఫ్యామిలీ ఫ్లోటర్స్ ప్లాన్స్‌తో లాభాలతో పాటు కొన్ని ప్రతికూలతలు సైతం ఉన్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం.

Life and Health Insurence: లైఫ్​, హెల్త్​ను కవర్‌ చేసే వినూత్న టర్మ్ పాలసీ.. పూర్తి వివరాలివే..


కుటుంబం మొత్తానికి ఒకే పాలసీ ఉంటే, కవరేజీ కోసం చెల్లించాల్సిన ప్రీమియం తగ్గుతుంది. ఒకవేళ ఒక్కక్కరు వ్యక్తిగతంగా ఇన్సూరెన్స్​లు తీసుకుంటే డబ్బు అధికంగా ఖర్చువుతుంది. అలాగే ఫ్యామిలీ మొత్తానికి ఒకేపాలసీ ఉంటే ట్రాక్​ చేయడం కూడా సులభంగా ఉంటుంది.

ఒక్క ఇన్సూరెన్స్ కుటుంబం మొత్తానికి..
ఫ్యామిలీ ఫ్లోటర్స్​లో ప్రధాన అంశం.. కుటుంబం మొత్తానికి వర్తించే విధంగా ఒకే ఇన్సూరెన్స్ పాలసీ. వ్యక్తిగత ఇన్సూరెన్స్ అయితే బీమా పొందిన వ్యక్తికి మాత్రమే లాభాలు వర్తిస్తాయి. అదే ఫ్యామిలీ ఫ్లోటర్స్​లో కుటుంబం మొత్తం ఇన్సూరెన్స్ లబ్ధి పొందవచ్చు. దీంతో కుటుంబంలోని ఏ వ్యక్తి ఆసుపత్రిలో చేరినా.. ఒకరి కంటే ఎక్కువ మందికి చికిత్స అవసరమైనా మొత్తం ఒకే ఇన్సూరెన్స్ పాలసీ కిందికి వస్తుంది. అలాగే ఒక్కొక్కరికి వ్యక్తిగత ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటే ఎక్కువ ఖర్చవుతుంది. అదే ఫ్యామిలీ ఫ్లోటర్ అయితే కట్టాల్సిన ప్రీమియం తగ్గుతుంది.

Hyderabad News: మీకు రూ.30 వేలు కావాలా.. అయితే ఈ పని చేసిపెట్టండి..


సులువైన మెయింటెనెన్స్
కుటుంబం మొత్తానికి ఒకే పాలసీ ఉండడం వల్ల.. ఒక్కొక్కరికి వేర్వేరుగా పాలసీలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. డ్యూ డేట్లు, టర్మ్​ చెల్లింపులను ఎక్కువగా సార్లు చెక్​ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీని పరిశీలిస్తే సరిపోతుంది. అందరికీ ఒకేసారి ప్రీమియం చెల్లించడంతో ఆ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. దీంతో ఇన్సూరెన్స్ మెయింటెనెన్స్​ సులభంగా ఉంటుంది. అయితే ఫ్యామిలీ ఫ్లోటర్స్ వల్ల కొన్ని ప్రతికూలతలు కూడా ఉంటాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవేంటంటే..

పరిధి దాటిపోయే అవకాశం
కుటుంబంలో ఒకే వ్యక్తికి ఇన్సూరెన్స్​లో ఎక్కువ మొత్తం అవసరమైతే.. మిగిలిన వారికి ఇబ్బందిగా మారుతుంది. ఒకే వ్యక్తికి తీవ్ర అనారోగ్యం వచ్చి పాలసీ కవరేజీ పరిమితి దాటితే కష్టంగా మారుతుంది. అలాంటి సమయంలో మరో వ్యక్తి ఆసుపత్రిలో చేరాల్సి వస్తే సొంత డబ్బు ఖర్చు చేయాల్సి రావొచ్చు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.

Height Growth Tips: పొట్టిగా ఉన్నారని బాధపడుతున్నారా.. అయితే వీటిని పాటిస్తూ ఎత్తు పెరగండి..


ఒక్కరి వివరాలు తప్పుగా ఇచ్చినా..
ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్లను తీసుకునే సమయంలో కుటుంబ సభ్యులందరి వివరాలను చాలా జాగ్రత్తగా సమర్పించాలి. వైద్య వివరాలను క్షుణ్ణంగా తెలియజేయాలి. ఒక్కరి వివరాలు తప్పుగా సమర్పించినా.. కుటుంబం మొత్తానికి ఇన్సూరెన్స్ లాభాలు అందకుండా పోయే అవకాశాలు ఉన్నాయి.

ఫ్యామిలీ ఫ్లోటర్ కింద ఎవరు ఉండవచ్చు..
ఒక సింగిల్ ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ కింద.. మీరు, మీరు జీవిత భాగస్వామి, నలుగురు డిపెండెంట్ పిల్లలు (25 సంవత్సరాల లోపు), తల్లిదండ్రులు ఇద్దరూ లేదా అత్తామామలను చేర్చవచ్చు. అయితే మీ కుటుంబానికి సరిపోయే ఫ్యామిలీ ఫ్లోటింగ్ ప్లాన్​ను ఎంచుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ముఖ్యంగా కుటుంబం మొత్తానికి కనీసం రూ.40లక్షల వరకు పాలసీ తీసుకోవడం మంచిది.
Published by:Veera Babu
First published: