హోమ్ /వార్తలు /Explained /

Expalined: చైనాలో కుప్పకూలిన ఈస్ట్రన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం.. ప్రమాదానికి గల కారణం ఏమిటి..? పూర్తి వివరాలిలా..

Expalined: చైనాలో కుప్పకూలిన ఈస్ట్రన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం.. ప్రమాదానికి గల కారణం ఏమిటి..? పూర్తి వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

చైనాలో ప్రయాణికులతో వెళ్తున్న బోయింగ్ 737-800 విమానం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఘటనలో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం సంభవించింది. పర్వతాన్ని విమానం ఢీకొట్టిన సమయంలో అంతరిక్షం నుంచి కూడా కనిపించే అంతటి పెద్ద మంటలు చెలరేగినట్లు సమాచారం.

ఇంకా చదవండి ...

చైనాలో(China) ప్రయాణికులతో వెళ్తున్న బోయింగ్ 737-800 విమానం ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఘటనలో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం సంభవించింది. పర్వతాన్ని విమానం ఢీకొట్టిన సమయంలో అంతరిక్షం(Space) నుంచి కూడా కనిపించే అంతటి పెద్ద మంటలు చెలరేగినట్లు సమాచారం. వెంటనే పర్వతప్రాంతాల్లో సంబంధిత అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. చైనా ఈస్ట్రన్‌ ఎయిర్‌లైన్స్‌కి(China Eastern Airlines) చెందిన విమానం(Flight) ప్రమాదానికి గురైన ఘటనకు సంబంధించి.. చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది.

విమాన ప్రమాదానికి కారణాలు ఏంటి?

విమానం ప్రమాదానికి గురవడానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. బోయింగ్‌ 737-800 విమానం చైనాలో గుయాంగ్జి ప్రాంతంలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో విమానంలో 123 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉన్నారు. స్థానిక కాలమానం ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం 1.11 గంటల ప్రాంతంలో కున్నింగ్‌ నగరం నుంచి గుయాంగ్‌ఝౌ నగరానికి విమానం బయలుదేరింది. 2.22 గంటల సమయంలో రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. అప్పుడు విమానం 29,000 అడుగులు(8,800 మీటర్లు) ఎత్తులో ప్రయాణిస్తున్నట్లు ఫ్లైట్‌ ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌ FlightRadar24.com వద్ద సమాచారం ఉంది. విమానం పడిపోవడం ప్రారంభించిన 96 సెకన్ల తర్వాత డేటా ప్రసారం చేయడం ఆగిపోయింది.

Plane Crash: ఘోర విమాన ప్రమాదం.. 133 మంది ప్రయాణికులతో పర్వతాల్లో కుప్పకూలిన బోయింగ్ .. బూడిదేనా?


ప్రమాదానికి ముందు ఏదైనా ఇబ్బంది తలెత్తినట్లు పైలట్‌ సమాచారం ఇచ్చాడా? లేదా? అనేదానిపై చైనా మీడియా , చైనా అధికారులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. ఈ అంశంపై స్పష్టత వస్తే ప్రమాదానికి సంబంధించిన కారణాలు తెలుసుకొనే అవకాశం ఉంటుంది. సహాయక చర్యల్లో పాల్గొన్న అధికారులు విమానం బ్లాక్ బాక్స్ కోసం వెతుకుతున్నారు. ఇందులో ఇన్‌స్ట్రుమెంట్స్‌, కాక్‌పిట్‌ సౌండ్‌ రికార్డు అయి ఉండే అవకాశం ఉంది.

తీవ్రంగా దెబ్బతిన్న శిథిలాలను సేకరించి, ప్రత్యేక సాంకేతిక అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందని, కూలిపోవడానికి గల కారణాలు తెలుసుకొనేందుకు కొన్నిసార్లు నెలలు లేదా సంవత్సరాలు పట్టవచ్చని గతంలో జరిగిన ఇలాంటి విమాన ప్రమాదాలను పరిశీలించిన ఇన్వెస్టిగేటర్స్‌ చెబుతున్నారు.

విమానంలో ఎంత మంది ఉన్నారు? ఎవరైనా సురక్షితంగా బయటపడ్డారా?

కున్నింగ్‌ నగరం నుంచి గుయాంగ్‌ఝౌ నగరానికి బయలుదేరిన విమానంలో 123 మంది ప్రయాణికులు, 9 మంది సిబ్బంది ఉన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఎవరూ ప్రాణాలతో కనిపించలేదని సహాయక చర్యల్లో పాల్గొన్న సిబ్బంది తెలిపారు. గుయాంగ్‌ఝౌ విమానాశ్రయంలో ప్రమాద మృతుల కుటుంబాలు గుమిగూడాయి. వారికి కరోనా నియంత్రణ నిబంధనలు పాటిస్తూ ఉద్యోగులు సాయం చేశారు. 700 గదులు కలిగిన ఐదు హోటళ్లను కుటుంబ సభ్యుల కోసం క్రాష్ సైట్‌కు దగ్గరగా సిద్ధం చేసినట్లు కొన్ని చైనా వార్తా సంస్థలు తెలిపాయి.

* ఈ విమానం గతంలో ప్రమాదానికి గురైన బోయింగ్‌ మోడల్‌కు చెందినదేనా?

ప్రమాదానికి గురైన విమానం ఆ మోడల్‌కు చెందిన విమానం కాదు. కూలిపోయింది బోయింగ్ 737-800 విమానం. గతంలో ప్రమాదానికి గురైన విమానం బోయింగ్ 737 మ్యాక్స్. దీనిపై 2018, 2019లో జరిగిన రెండు పెను ప్రమాదాల తర్వాత ప్రపంచ వ్యాప్తంగా తాత్కాలిక నిషేధం విధించారు. బోయింగ్ 737-800 విమానాలు 1998 నుంచి సేవలు అందిస్తున్నాయి. ఈ తరహా విమానాలను 5,100 కంటే ఎక్కువగా విక్రయించారు. ఈ విమానాలు ఇప్పటికి 22 ప్రమాదాలలో చిక్కుకోగా.. మరమ్మతు చేయలేని విధంగా దెబ్బతిన్నాయి. 612 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని యునైటెడ్ స్టేట్స్‌లోని ఫ్లైట్ సేఫ్టీ ఫౌండేషన్‌కు చెందిన ఏవియేషన్ సేఫ్టీ నెట్‌వర్క్ తెలిపింది.

PAN Aadhaar Link: పాన్ ఆధార్ లింక్ చేయలేకపోతున్నారా? వివరాలు ఇలా సరిదిద్దుకోండి

చైనా ఈస్టర్న్ క్రాష్ తర్వాత 737-800లను నిలిపివేసినట్లు చైనా రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇండోనేషియా, ఇథియోపియాలో క్రాష్‌ల తర్వాత బోయింగ్ 737 మ్యాక్స్‌ను ఆపేశారు. ఆ ప్రమాదాల్లో కంప్యూటర్‌ సిస్టమ్‌ తప్పిదాలు జరిగాయని, పైలట్లు సరి చేయలేని సమస్యలు ఎదురయ్యాయని వివరించారు. యునైటెడ్ స్టేట్స్, యూరప్, చైనా, మధ్యప్రాచ్య దేశాల నియంత్రణాధికారుల సూచనల అనంతరం బోయింగ్ సిస్టమ్‌ను పునఃరూపకల్పన చేసిన తర్వాత 737 మ్యాక్స్‌ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి.

First published:

Tags: China, Explained, Flight

ఉత్తమ కథలు