Andhra Pradesh: పొలిటికల్ పార్టీలకు గంటా శ్రీనివాసరావు షాక్: తిరుపతిలో పోటీకి నిర్ణయం? ఎందుకో తెలుసా?

గంటా శ్రీనివాసరావు (ఫైల్ ఫోటో)

ఒకే దెబ్బకు మూడు పిట్టలు అన్నట్టు గంటా ఆలోచిస్తున్నారు. ప్రధాన మూడు రాజకీయ పార్టీలకు షాక్ ఇవ్వాలని భావిస్తున్నారు? ఇంతకీ గంటా ఏం చేయాలి అనుకుంటున్నారో తెలుసా?

 • Share this:
  గంటా శ్రీనివాసరావు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నారు. ఆయన వ్యూహాలు ఎవరికీ అందడం లేదు. మొన్నటి వరకు రాజకీయాలకు దూరంగా.. మౌనం వహించిన ఆయన.. ఇప్పుడు ప్రధాన పార్టీలకు అందకుండా వ్యూహాలు రచిస్తున్నారు. విశాఖ ఉక్కు ఉద్యమం కోసం ఎవరూ ఊహించని రీతిలో అందరికంటే ముందే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. బడ్జెట్ సమావేశాల్లో తన రాజీనామా ఆమోదించాలని స్పీకర్ ను కోరారు కూడా.. ఇప్పుడు మరో నిర్ణయంతో అందరికీ షాక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు.

  ప్రస్తుతం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై ఏపీ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం మాత్రం కనికరం చూపడం లేదు. రోజుకో బాంబ్ పేల్చుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ తప్పదేని తేల్చి చెప్పేస్తోంది. దీంతో మరోసారి మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కేంద్రం తీరుపై ధ్వజమెత్తారు. లక్షలాది మంది జీవితాలతో ముడిపడి ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను కేంద్రం తక్షణమే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

  విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను జీర్ణించుకోలేకే.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. అయినా తన రాజీనామాను కూడా కొందరు రాజకీయం చేయడం సరికాదన్నారు. పార్టీలకతీతంగా అందరూ ఉద్యమించి ప్రైవేటీకరణను అడ్డుకోవాలని కోరారు. విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన చారిత్రక అవసరం ఉందని.. లేదంటే చరిత్ర హీనులుగా నిలిచిపోతామని అభిప్రాయపడుతున్నారు.

  తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక విశాఖ ఉక్కు అని, అమ్మేస్తాం లేదా మూసేస్తాం అన్నట్లు కేంద్ర వైఖరి ఉందని మండిపడ్డారు. రాష్ట్ట్రాన్ని సంప్రదించాము అని నిర్మలా సీతారామన్ చెప్పారన్నారు. అందుకే విశాఖ ఉక్కు బాధ్యతను సీఎం జగన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ చొరవ తీసుకుంటే కలిసి నడుస్తానని చంద్రబాబు స్పష్టం చేశారని గుర్తు చేశారు. రాజీనామా చేస్తే ఎలా పోరాడతాం అని వైసీపీ మంత్రులు అంటున్నారని.. అయితే చివరి అస్త్రం రాజీనామాలు సంధించే సమయం ఆసన్నమైందన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు రాజీనామా చేసి విశాఖ ఉక్కు కోసం పోరాడాలని డిమాండ్ చేశారు. మంత్రులు, ఎంపీలు రాజీనామా ఏస్తే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందని చెప్పారు. వైసీపీ మంత్రులు, ఎంపీలు రాజీనామా చేసిన స్థానాల్లో మళ్లీ టీడీపీ అభ్యర్థులను పెట్టబోమని గతంలో చంద్రబాబు చెప్పారని గుర్తు చేశారు. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉద్యమంలో నేరుగా పాల్గొంటే ప్రభావం ఎక్కువ ఉంటుందని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

  అయితే రాజకీయ విమర్శలకు మాత్రమే ఆయన పరిమితం అవ్వలేదు. తిరుపతి ఉప ఎన్నిక ద్వారా విశాఖ ఉక్కు ఉద్యమ తీవ్రతను కేంద్రానికి తెలియజేయాలి అంటున్నారు. ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి బరిలో దిగుతున్నారు. దీంతో బీజేపీ అభ్యర్థిని చిత్తుగా ఓడించడమే లక్ష్యంగా సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తున్నాు.

  తిరుపతి ఉప ఎన్నిక ద్వారా స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ ను బీజేపీ పెద్దలకు తెలిసేలా చేయాలని గంటా భావిస్తున్నారు. తిరుపతి ఉపఎన్నికల్లో ఉద్యమం తరపున ఎంపీ అభ్యర్థిని నిలబెట్టే అంశంపై అఖిలపక్షంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. విశాఖ ఉక్కు ఉద్యమానికి శ్రీవారి ఆశీస్సుల కోసం తిరుపతి వచ్చామన్న ఆయన.. విశాఖ గుండె చప్పుడు ఒక ప్రైవేట్ వ్యక్తికి ఇచ్చేస్తుండటం అనే ఆలోచనే బాధాకరమని.. శరీరం నుంచి ఓ భాగం వేరు అయినట్లు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ, జనసేన, వామపక్షాలు అన్నీ విశాఖ ఉక్కు కోసం నిలబడ్డాయని చెప్పుకొచ్చారు. గంటా ప్రతిపాధనకు ఉక్కు పరిరక్షణ సమితి ఒప్పుకుంటే ఏపీలో కొత్త రాజకీయానికి తెరలేపినట్టే అవుతుంది. ఒక్కసారిగా సమీకరణలు మారిపోయే అవకాశం ఉంది.

  ఒకే దెబ్బకు మూడు పిట్టలు అన్నట్టు గంటా ఆలోచిస్తున్నారు. ఒక వేళ విశాఖ ఉక్కు ఉద్యమం తరపున నిజంగా అభ్యర్థిని నిలబెడితే అతడికి టీడీపీ, వైసీపీలు మద్దతు ఇచ్చే పరిస్థితి లేదు. రెండు పార్టీలు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అప్పుడు రెండు పార్టీలు విశాఖ ఉక్కు ఉద్యమానికి వ్యతిరేకమనే భావన ప్రజల్లో తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో ఇటు సొంత పార్టీతో పాటు.. తాను చేరాలని భావించినా కొర్రీలు పెడుతున్న వైసీపీ, బీజేపీలకు కూడా చెక్ పెట్టొచ్చని గంటా వ్యూహ రచన చేస్తున్నట్టు తెలుస్తోంది.
  Published by:Nagesh Paina
  First published: