• HOME
  • »
  • NEWS
  • »
  • EXPLAINED
  • »
  • EPIGRAPH SOFTWARE SHOWS PROMISE OF VACCINE AGAINST INFLUENZA POSSIBLY CORONAVIRUS TOO SRD GH

Epigraph software: కొత్త టెక్నాలజీతో అన్ని వైరస్ లకి ఒకటే మందు.. కరోనాకి కూడా..

Epigraph software: కొత్త టెక్నాలజీతో అన్ని వైరస్ లకి ఒకటే మందు.. కరోనాకి కూడా..

ప్రతీకాత్మక చిత్రం

Epigraph software: ఇన్ ఫ్లూయెంజా వైరస్ కి వ్యాక్సీన్ ని కనిపెట్టి స్వైన్ ఫ్లూని తరిమేందుకు ఉపయోగించిన ఓ కొత్త కంప్యూటర్ ఆల్గరిథమ్ ని తాజాగా కరోనా వైరస్ కి వ్యాక్సీన్ అందించేందుకు కూడా ఉపయోగిస్తున్నారు.

  • Share this:
ఇన్ ఫ్లూయెంజా వైరస్ కి వ్యాక్సీన్ ని కనిపెట్టి స్వైన్ ఫ్లూని తరిమేందుకు ఉపయోగించిన ఓ కొత్త కంప్యూటర్ ఆల్గరిథమ్ ని తాజాగా కరోనా వైరస్ కి వ్యాక్సీన్ అందించేందుకు కూడా ఉపయోగిస్తున్నారు. నేచర్ కమ్యూనికేషన్స్ లో ప్రచురితమైన కొత్త అధ్యయనం ప్రకారం ఈ పాన్ ఇన్ ఫ్లూయెంజా వైరస్ వ్యాక్సీన్ కరోనా వైరస్ కి కూడా పని చేస్తుందట. ఎపిగ్రాఫ్ అనే ఈ ఆల్గోరిథమ్ ని ఎబోలా, మార్ బర్గ్ వంటి వైరస్ లకు వ్యతిరేకంగా ఉపయోగించి ఫలితం సాధించారు. హెచ్ ఐవీ పేషంట్లలోనూ ఫలితాలు కనిపించినట్లు నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ ఎపిగ్రాఫ్ డిజైన్డ్ వ్యాక్సినేషన్ వల్ల ఎలుకల్లో చాలా బలమైన యాంటీ బాడీలు ఉత్పత్తి అయ్యాయని.. పందుల్లోనూ టి సెల్ రెస్పాన్స్ లు, క్రాస్ రియాక్టివ్ యాంటీ బాడీలు ఎక్కువగా ఉన్నట్లు తేలిందట.నెబ్రాస్కా యూనివర్సిటీకి చెందిన నెబ్రాస్కా సెంటర్ ఫర్ వైరాలజీ, సెయింట్ జూడ్స్ ఛిల్డ్రన్స్ రీసర్చ్ హాస్పిటల్, లాస్ అలమాస్ నేషనల్ లాబొరేటరీ లకు చెందిన నిపుణులు అందరూ కలిసి ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనం అమెరికా ఎనర్జీ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో కొనసాగింది. ఈ అధ్యయనం గురించి లాస్ అలమోస్ కంప్యుటేషనల్ బయాలజిస్ట్ బెట్టె కొర్బర్ మాట్లాడుతూ

"మేం ఎపిగ్రాఫ్ స్ట్రాటజీని ఈ తరహా సమస్యల కోసం తయారుచేశాం. దీన్ని ఒకటి, రెండూ కాదు.. ఎన్నో రకాల వ్యాధులు కలిగించే వైరస్, బ్యాక్టీరియాలపై ప్రయోగించవచ్చు. ఈ టూల్ వ్యాక్సీన్ యాంటీజెన్లన్నింటినీ కలిపి ఒక కాక్ టెయిల్ లా తయారుచేస్తుంది. ఇది వివిధ రకాల జాతుల ప్రజల్లో కూడా ప్రభావవంతంగా పనిచేయగలుగుతుంది. ఇది పాన్ స్వైన్ ఫ్లూ వ్యాక్సీన్ ని తయారుచేయడం లో మరో అడుగు ముందుకేసేలా చేసింది. ఇది అన్ని రకాల స్వైన్ ఫ్లూ జాతులపై పని చేసేలా తయారుచేస్తున్నాం. మరోసారి మరో వేరియంట్ తో స్వైన్ ఫ్లూ ఎపిడమిక్ వచ్చే సమయానికి మేం వ్యాక్సీన్ తో సిద్ధంగా ఉంటాం. ఇది కేవలం మనుషులకు మాత్రమే కాదు.. జంతువులకు కూడా పని చేస్తుంది. వివిధ రకాల వైరస్ వేరియంట్లను ఉపయోగించి చేసిన ఈ వ్యాక్సీన్ కి రోగ నిరోధక శక్తి చాలా బాగా ప్రతిస్పందిస్తోంది. ఇకపై ఇవే బేసిక్ ప్రతిపాదనలు ఉపయోగించి కరోనా పాన్ కరోనా వైరస్ వ్యాక్సీన్ ని కూడా తయారు చేస్తాం. దీనివల్ల ఒకవేళ భవిష్యత్తులో కరోనా వైరస్ తమ వేరియంట్ ని మార్చుకున్నా (మ్యూటేషన్ చెందినా) ఇది దాన్ని చంపేందుకు తగిన శక్తిని కలిగి ఉంటుంది." అని చెప్పుకొచ్చారు. కొర్బర్, ఆమె భర్త ఇద్దరూ ఈ అధ్యయన బృందంలో ఉండడం విశేషం.

పక్షులు, పందులు, మనుషుల్లో ఉండే మూడు రకాల స్వైన్ ఫ్లూ వైరస్ రకాలు పందుల్లో కనిపిస్తాయి. అందుకే ఒకవేళ వాటిలో మ్యూటేషన్ జరిగితే అలా మ్యూటేట్ అయిన వైరస్ మనుషుల్లోకి ప్రవేశిస్తే మరోసారి కరోనా వైరస్ లాంటి పాండమిక్ వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయని ఈ అధ్యయనం తేల్చి చెబుతోంది. 2009 లో వచ్చిన H1N1 స్వైన్ ఫ్లూ కంటే ఇది మరింత శక్తివంతంగా ఉంటుందని వారు వెల్లడిస్తున్నారు. ఈ రీసర్చ్ కి అమెరికాకి చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సహకారం అందిస్తోంది.
Published by:Sridhar Reddy
First published:

అగ్ర కథనాలు