EDUCATION LOAN FAQS LIST OF EXPENCES COVERED UNDER STUDENT LOAN BA
Education Loan: ఎడ్యుకేషన్ లోన్‌లో ఏమేం ఖర్చులు కలుస్తాయి? విమాన టికెట్లకు కూడా డబ్బులిస్తారా?
ప్రతీకాత్మక చిత్రం
Education Loan for Abroad FAQs | విదేశాల్లో చదువుకోవాలనుకునే వారు గమనించాల్సిన చాలా అంశాల్లో విద్యారుణాలు (Education Loan Rate of Interest) కూడా ముఖ్యమైనవి. ఎడ్యుకేషన్ లోన్ తీసుకునేటప్పుడు అందులో ఏయే ఖర్చులు కవర్ (expences covered under Education Loan) అవుతాయో లేదో కూడా తెలుసుకోవాలి. ఆ వివరాలన్నీ ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు.
దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థలతో పాటు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే వారు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా విదేశాల్లో చదువుకోవాలనుకునే (Education Abroad) వారు అక్కడి కాస్ట్- ఆఫ్ లివింగ్, ఇతర ఖర్చుల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఈ ఖర్చులన్నింటినీ కలిపి లోన్‌గా అందించే సంస్థల నుంచే విద్యార్థులు ఎడ్యుకేషన్ లోన్ (Education Loan) తీసుకోవడం మంచిది. సాధారణంగా చాలామంది విద్యార్థులు విదేశాల్లో విద్య కోసం విద్యా రుణాలు (Student Loans) తీసుకుంటారు. కానీ చాలా సందర్భాల్లో రుణం కింద కవర్ అయ్యే ఖర్చులను పట్టించుకోరు. దిగువ, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఇది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది. రుణ మొత్తంలో స్వల్ప మార్పు కూడా వీరి మొత్తం ఆర్థిక వ్యవస్థలో పెద్ద మార్పుకు కారణం కావచ్చు. అందువల్ల ఎడ్యుకేషన్ లోన్‌లో ఎలాంటి ఖర్చులు కవర్ అవుతాయో ముందుగానే తెలుసుకోవాలి.
ఎడ్యుకేషన్ లోన్‌లో కవర్ అయ్యే సాధారణ ఖర్చులు
విద్యా సంస్థలకు చెల్లించాల్సిన ఫీజు
పరీక్ష/లైబ్రరీ/ల్యాబొరేటరీ ఫీజు
విదేశాల్లో చదువుకోవడానికి ప్రయాణ ఖర్చులు/పాసేజ్ మనీ
విద్యార్థులకు వర్తించే ఇన్సూరెన్స్ ప్రీమియం
కాషన్ డిపాజిట్, బిల్డింగ్ ఫండ్/ఇన్స్టిట్యూషన్ బిల్లులు, రసీదులతో అందించే రిఫండబుల్ డిపాజిట్ (మొత్తం ఖర్చు లోన్ మొత్తంలో 10% మించకూడదు)
విదేశీ విద్యకు రుణం తీసుకుంటే..
మీరు విదేశాల్లో చదువుకోవడానికి భారతదేశంలో విద్యా రుణం తీసుకోవాలనుకుంటే.. విదేశీ విద్యా రుణ పథకాలు కవర్ చేసే వివిధ రకాల ఖర్చుల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. విదేశాల్లో చదువుకోవాలనుకునే చాలా మంది విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్ కింద కవర్ అయ్యే ఖర్చుల గురించి పెద్దగా అవగాహన ఉండదు. ఎడ్యుకేషన్ లోన్ అనేది.. రుణ గ్రహీతల అన్ని ఆర్థిక అవసరాలను నిర్ణీత గడువులోపు నెరవేరేలా చేస్తుంది. ఈ నేపథ్యంలో విదేశీ విద్య కోసం రుణాలు తీసుకునేవారు ఎలాంటి అంశాలపై దృష్టి పెట్టాలో చూద్దాం.
విదేశాల్లో విద్యకు అయ్యే అన్ని రకాల ఖర్చులను విద్యా రుణాలు కవర్ చేయవని చాలామంది భావిస్తారు. అయితే ఇది నిజం కాదు. ప్రభుత్వ బ్యాంకుల నుంచి తీసుకునే సురక్షితమైన (secured Education Loans) విద్యా రుణాలు లేదా NBFCల నుంచి తీసుకునే అన్- సెక్యూర్డ్ ఎడ్యుకేషన్ లోన్లలో వివిధ ఖర్చులు కవర్ అవుతాయి. ఈ జాబితాలో ట్యూషన్ ఫీజు నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ వరకు ఉన్నాయి.
ట్యూషన్ ఫీజు
విదేశాల్లోని యూనివర్సిటీలు కోట్ చేసిన ట్యూషన్ ఫీజులను ఎడ్యుకేషన్ లోన్లు ప్రధానంగా కవర్ చేస్తాయి. వాస్తవానికి విదేశాల్లో చదువుకోవడానికి విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించే విద్యార్థులకు ట్యూషన్ ఫీజులు చెల్లించడమే ఎడ్యుకేషన్ లోన్ ప్రాథమిక లక్ష్యం. భారతదేశంలో అందించే అన్ని విదేశీ విద్యా రుణాలు ట్యూషన్ ఫీజులను కచ్చితంగా కవర్ చేస్తాయి. మొత్తం విద్యా రుణాన్ని నిర్ణయించడంలో ట్యూషన్ ఫీజులకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు.
జీవన వ్యయాలు (Living Expenses)
ఈ ఖర్చుల విభాగంలో చాలా అంశాలను చేర్చవచ్చు. విద్యార్థి జీవన వ్యయాల్లో ప్రధానంగా వారి వసతి ఖర్చు, ఆహారం, ఇతర రోజువారీ కార్యకలాపాలకు సంబంధించిన ఖర్చులు ఉంటాయి. ఉదాహరణకు మీ ఇంటి నుంచి యూనివర్సిటీకి రవాణా, వసతి కోసం చేసే మనీ డిపాజిట్ వంటివన్నీ ఇందులో భాగంగా ఉంటాయి. విదేశీ విద్య కోసం ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నవారు కోర్సుకు సంబంధించిన మొత్తం ఖర్చులను లెక్కించేటప్పుడు ఈ ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
ఆరోగ్య బీమా (Healt Insurance)
విదేశాల్లోని చాలా యూనివర్సిటీలు తమ సంస్థల్లో చదివే అంతర్జాతీయ విద్యార్థులు ఆరోగ్య బీమా తప్పనిసరిగా తీసుకోవాలనే నిబంధన విధిస్తాయి. విదేశీ విద్యా రుణాలు ఈ ప్రత్యేక వ్యయాన్ని కచ్చితంగా కవర్ చేస్తాయి. ఎందుకంటే ఇది చాలా మంది విద్యార్థులకు విదేశాల్లో చదువుకోవడానికి ప్రాథమిక అవసరం.
ప్రయాణ టిక్కెట్లు (Flight Charges)
మీరు ఎంచుకున్న గమ్యస్థానానికి విమాన టిక్కెట్ ధరలను సైతం విదేశీ విద్యా రుణాలు కవర్ చేస్తాయి. మీ బ్యాంక్‌కు రుణ మొత్తాన్ని కోట్ చేస్తున్నప్పుడు ఎడ్యుకేషన్ లోన్ అమౌంట్ మొత్తంలో వీటిని కూడా చేర్చవచ్చు.
ఇతర ఖర్చులు
కోర్సు వ్యవధిలో చేపట్టే ఫీల్డ్ ట్రిప్‌లు, ఇతర కార్యకలాపాలకు అయ్యే ఖర్చులను సైతం మీరే భరించాలని విదేశీ యూనివర్సిటీ మీకు పంపించే ఆఫర్ లెటర్లో పేర్కొందా? అయితే ఈ ఖర్చులన్నింటినీ విదేశీ విద్య కోసం తీసుకునే లోన్లు కవర్ చేస్తాయి. సెక్యూర్డ్, అన్-సెక్యూర్డ్ ఎడ్యుకేషన్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే భారతీయ విద్యార్థులు.. పుస్తకాలు, ల్యాప్‌టాప్‌లు, స్టడీ మెటీరియల్ వంటి వాటికి అయ్యే ఖర్చులను కూడా ఎడ్యుకేషన్ లోన్ మొత్తంలో పేర్కొనవచ్చు.
ఈ అంశాలపై దృష్టి పెట్టాలి
ఎడ్యుకేషన్ లోన్‌లో కవర్ అయ్యే ఖర్చులను లెక్కించే ముందు విద్యార్థులు పరిగణించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే..
ఏదైనా దేశంలో వసతి ఖర్చు, జీవన వ్యయాలను తగ్గించుకోవడానికి ఇతరులతో కలిసి నివసించడం మంచిది.
యూనివర్సిటీ ఉన్న నగరంలో ఆహారానికి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంటే.. సొంతంగా వంట చేసుకోవడం ద్వారా ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చు.
విద్యార్థులు కేవలం క్యాంపస్ విద్యకు మాత్రమే పరిమితం కాదు కాబట్టి.. భోజన ఖర్చులు లేదా స్థానిక ప్రయాణ ఖర్చులు సైతం మొత్తం ఖర్చులో భాగంగా ఉంటాయి.
అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కార్లు, ఇంధన ధరలు తక్కువగా ఉంటాయి. ఐర్లాండ్ వంటి దేశాల్లో విద్యార్థులకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లపై డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. వీటన్నింటిని ముందుగా పరిశోధించాలి. తక్కువ డబ్బు ఖర్చయ్యే మార్గాన్ని ఎంచుకోవాలి.
యూనివర్సిటీ ఉన్న నగరంలో పార్ట్ టైమ్ ఉద్యోగానికి అవకాశాలు ఉంటే ఉపయోగించుకోవాలి. చాలా దేశాలు మంచి వేతనాలతో ఆకర్షణీయమైన పార్ట్-టైమ్ ఉద్యోగాలను ఆఫర్ చేస్తున్నాయి. ఇలా ఉద్యోగాలను ఎంచుకోవడం ద్వారా జీవన వ్యయాలను గణనీయంగా కవర్ చేసుకోవచ్చు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.