Fish: వారానికి రెండు సార్లు చేపలు తింటే చాలు.. ఈ జబ్బులన్నీ పరార్

గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉన్న వ్యక్తులు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే చేపలను తిన్నప్పుడు.. CVD నుంచి ఒక మాదిరి సంరక్షణ లభిస్తుందని తెలిపారు

గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉన్న వ్యక్తులు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే చేపలను తిన్నప్పుడు.. CVD నుంచి ఒక మాదిరి సంరక్షణ లభిస్తుందని తెలిపారు

  • Share this:
మన ఆరోగ్యం.. మనం తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుందని ఎన్నో అధ్యయనాల్లో కనుగొన్నారు. అన్ని రకాల పోషకాలు ఉండే సమతులాహారం తీసుకుంటే వ్యాధుల బారిన పడే ప్రమాదం తగ్గుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం అంటే అన్ని రకాల పోషకాలు నిండిన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనం మన ఆహారంలో చేపలను పెంచాలని చెబుతోంది.క్రమం తప్పకుండా చేపలను ఆహారంలో తీసుకునే వారు గుండె జబ్బులకు దూరంగా ఉంటారని ఈ అధ్యయనం వెల్లడించింది. వారానికి కనీసం రెండుసార్లు చేపలు తినడం వల్ల హార్ట్ స్ట్రోక్ ముప్పు ఉన్న వారు ప్రమాదకరమైన గుండె జబ్బులకు (cardiovascular disease-CVD) దూరంగా ఉండవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. చేపల్లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఈ వ్యాధులను నిరోధిస్తాయని తెలిపారు.

ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడుతున్నవారు చేపలను ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయని మెక్ మాస్టర్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్, అధ్యయన బృంద సభ్యుడు ఆండ్రూ మెంటే తెలిపారు. వీరు కొవ్వు, నూనెలు ఎక్కువగా ఉండే చేపలను తినాలని మెంటీ సూచిస్తున్నారు. సుమారు 1,92,000 మందిపై ఈ పరిశోధన చేశారు. వీరిలో 52,000 మంది CVDతో బాధపడుతున్నారు. PHRI సంస్థ గత 25 సంవత్సరాలుగా నిర్వహించిన అనేక అధ్యయనాల నుంచి డేటా సేకరించి విశ్లేషించారు. మొత్తం నాలుగు దశల్లో అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ అధ్యయనాన్ని JAMA ఇంటర్నల్ మెడిసిన్ అనే జర్నల్‌లో ప్రచురించారు.


గుండె జబ్బులు, స్ట్రోక్ లేని వారు చేపలను తీసుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనాలు ఉండవని పరిశోధకులు చెబుతున్నారు. గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉన్న వ్యక్తులు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే చేపలను తిన్నప్పుడు.. CVD నుంచి ఒక మాదిరి సంరక్షణ లభిస్తుందని తెలిపారు. కానీ హై రిస్క్ సీవీడీ ఉన్నవారితో పోలిస్తే.. మీడియం రిస్క్ ఉన్నవారికి ఆరోగ్య ప్రయోజనాలు తక్కువగా ఉన్నాయని కనుగొన్నారు. అయితే మిగిలిన ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగానే ఉంటాయి కాబట్టి తరచూ వీటిని తీసుకోవడం మంచిది. కానీ CVD ప్రమాదం ఎక్కువగా ఉన్నవారు మాత్రం ముందు జాగ్రత్త చర్యగా చేపలను తినాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published: