DRONES ATTACK IN SOME PARTS OF JAMMU AND KASHMIR WHAT IS INDIA STRENGTH TO COUNTER IT AK GH
Drone Attack: డ్రోన్ దాడులను భారత్ ఎదుర్కోగలదా ? ఈ అంశంలో మన బలమెంత ?
ప్రతీకాత్మక చిత్రం
Drone Attack ఆయుధాలతో డ్రోన్లు దేశంలోకి వస్తున్న ఘటనను తొలుత జమ్ముకశ్మీర్‌లో ఇటీవల గమనించారు. విదేశాల్లోనూ కొన్ని డ్రోన్ దాడులు జరగడంతో డిఫెన్స్ సంస్థలు యాంటీ డ్రోన్ డిఫెన్స్ గురించి పరిశోధనలు , చర్చలు చేస్తున్నాయి.
మన దేశంపై దాడి చేయడానికి ఎక్కడ, ఎప్పుడు, ఎలా అవకాశం దొరుకుతుందా అని దాయాది దేశం పాకిస్థాన్ ఎదురుచూస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఇటీవల జమ్ములోని భారత ఆర్మీ బేస్ మీద డ్రోన్లతో దాడి చేసింది. అంతర్జాతీయ సరిహద్దుకు 14 కిలో మీటర్ల దూరంలో ఈ దాడి జరిగింది. దీంతో డ్రోన్ల నిరోధానికి పటిష్ఠమైన విధానం, ప్రణాళిక అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో యాంటీ డ్రోన్ సిస్టమ్ పనితీరు గురించి తెలుసుకుందాం.
ఆయుధాలతో డ్రోన్లు దేశంలోకి వస్తున్న ఘటనను తొలుత జమ్ముకశ్మీర్‌లో ఇటీవల గమనించారు. విదేశాల్లోనూ కొన్ని డ్రోన్ దాడులు జరగడంతో డిఫెన్స్ సంస్థలు యాంటీ డ్రోన్ డిఫెన్స్ గురించి పరిశోధనలు , చర్చలు చేస్తున్నాయి. ఇజ్రాయిల్, యూఎస్, చైనా లాంటి దేశాలు రాడార్లు, ఫ్రీక్వెన్సీ జామర్స్, ఆప్టిక్, థర్మల్సెన్సర్లతో డ్రోన్ల దాడి జరగకుండా చేయొచ్చని భావించారు. అయితే రాత్రి సమయాల్లో డ్రోన్లను గమనించడం లాంటి విషయాల్లో ఇబ్బందులు ఉన్నాయి.
యుద్ధ విమానాలను తయారు చేసే రఫేల్ సంస్థ... డ్రోన్ దాడి నుంచి బయటపడటానికి ఐరన్ డోమ్ మిసైల్ సిస్టమ్‌ను రూపొందించింది. దాని పేరు డ్రోన్ డోమ్. మిస్సైల్స్ లాంటి వాటిని గుర్తించే డోమ్‌ను ఐరన్ డోమ్ అంటారు. డ్రోన్ డోమ్... డ్రోన్లను గుర్తిస్తుందట. స్టాటిక్ రాడార్లు, రేడియో ఫ్రీక్వెన్సీ సెన్సర్లు, కెమెరాల సాయంతో 360 డిగ్రీల్లో ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి ఈ డ్రోన్ డోమ్ అందిస్తుంది. అప్పుడు లేజర్ బీమ్స్ ద్వారా ఆ డ్రోన్ పనిపట్టొచ్చు. యూఎస్‌కు చెందిన ఫోర్టెమ్ టెక్నాలజీ కూడా ఇలాంటి ఓ సర్వీసును సిద్ధం చేసింది. అయితే ఇది ఇంటర్‌సెప్టర్ డ్రోన్. దీనినే డ్రోన్ హంటర్ అని కూడా అంటారు. శత్రుదేశ డ్రోన్ కనిపించనప్పుడు నెట్ గన్ ద్వారా పేల్చేస్తుంది.
వీటతోపాటు ఆస్ట్రేలియాకు చెందిన డ్రోన్ షీల్డ్ అనే సంస్థ డ్రోన్ గన్ను తయారు చేసింది. దీని ద్వారా డ్రోన్ల రేడియో ఫ్రీక్వెన్సీని అడ్డగించొచ్చు. దాని వల్ల డ్రోన్ల నుండి వీడియో ఫీల్డ్ అవతలి వైపు వెళ్లదు. అలాగే ఆ డ్రోన్ ఆపరేటర్ వద్ద ఆటోమేటిక్‌గా ల్యాండ్ అయ్యేలా చేయొచ్చట. అయితే ఈ మొత్తం డివైజ్‌లు/రక్షణ వ్యవస్థలకు సంబంధించి ధరల విషయంలో ఎలాంటి స్పష్టత లేదు. చైనాకు చెందిన ఓ సంస్థ అయితే ఎటాకింగ్ డ్రోన్ ఒకటి 3,40,000 డాలర్లు ఉండొచ్చని తెలిపింది. దీనికి 44,000 డాలర్లు వార్షిక మెయింటనెన్స్ ఫీజ్ ఉంటుందని చెప్పింది. ఇక మన దేశంలో కూడా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (డీఆర్డీవో) యాంటీ డ్రోన్ సిస్టమ్‌ను డెవలప్ చేస్తోంది.
డీఆర్డీవో రూపొందిస్తున్న యాంటీ డ్రోన్ సిస్టమ్‌ను అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన దేశ పర్యటనకు వచ్చినప్పుడు రక్షణకు వినియోగించారు. అహ్మదాబాద్‌లోని 22 కిమీ రోడ్ షోలో దీన్ని సెక్యూరిటీ కోసం వాడారు. దాంతోపాటు స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్ర కోట మీద ప్రసంగం చేస్తున్నప్పుడు కూడా ఈ డీఆర్డీవో యాంటీ డ్రోన్ సిస్టమ్‌ను మోహరించారు. ఈ యాంటీ డ్రోన్ సిస్టమ్ మూడు కిలో మీటర్ల పరిధిలో డ్రోన్స్ వస్తే అడ్డగించగలదు. అలాగే కిలోమీటర్ నుంచి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను లేజర్ గన్‌తో పేల్చేయగలదు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.