హోమ్ /వార్తలు /Explained /

Full Flight Capacity: ఫుల్ ఫ్లైట్‌ కెపాసిటీ అంటే ఏంటి? ప్ర‌యాణికుల‌కు దీని వ‌ల్ల ఏంటి ఉప‌యోగం? వాళ్ల‌కు అద‌నంగా వ‌చ్చే ఫెసిలిటీస్ ఏంటి?

Full Flight Capacity: ఫుల్ ఫ్లైట్‌ కెపాసిటీ అంటే ఏంటి? ప్ర‌యాణికుల‌కు దీని వ‌ల్ల ఏంటి ఉప‌యోగం? వాళ్ల‌కు అద‌నంగా వ‌చ్చే ఫెసిలిటీస్ ఏంటి?

ఫుల్ ఫ్లైట్‌ కెపాసిటీ అంటే ఏంటి? ప్ర‌యాణికుల‌కు దీని వ‌ల్ల ఏంటి ఉప‌యోగం? వాళ్ల‌కు అద‌నంగా వ‌చ్చే ఫెసిలిటీస్ ఏంటి?

ఫుల్ ఫ్లైట్‌ కెపాసిటీ అంటే ఏంటి? ప్ర‌యాణికుల‌కు దీని వ‌ల్ల ఏంటి ఉప‌యోగం? వాళ్ల‌కు అద‌నంగా వ‌చ్చే ఫెసిలిటీస్ ఏంటి?

అక్టోబ‌ర్ 10న ఒక్క‌రోజే దేశీయంగా విమానాల్లో ప్ర‌యాణించిన వారి సంఖ్య 3 ల‌క్ష‌లు దాటింది. ఈసంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రి 28 నుంచి చూసుకుంటే.. 3 ల‌క్ష‌లు దాట‌డం ఇదే మొద‌టిసారి.

కరోనా (Corona) తరువాత విమాన ప్రయాణాలపై (Flight Journeys) కేంద్రం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొనడంతో ఈ ఆంక్షలను తొలగిస్తున్నట్లు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇది ఫెస్టివ‌ల్ సీజ‌న్ (Festival Season) కావ‌డంతో ప్ర‌యాణికుల (Passengers) ర‌ద్దీని దృష్టిలో పెట్టుకొని దేశీయ విమాన (Domestic Airlines) ప్ర‌యాణాలపై ఆంక్ష‌ల‌ను తొల‌గించింది. దేశీయంగా తిరిగే ఏ విమాన‌మైనా 100 శాతం అక్యుపెన్సీతో అంటే ఫుల్ కెపాసిటీతో తిరొగొచ్చ‌ని తాజాగా స్ప‌ష్టం చేసింది.

* ప్ర‌భుత్వం ఎందుకు కెపాసిటీ ఆంక్ష‌ల‌ను స‌డ‌లించింది?

ప్ర‌స్తుతం దేశీయంగా విమాన ప్ర‌యాణానికి చాలా డిమాండ్ ఉంది. అందులోనూ ఇది పండుగ‌ల సీజ‌న్. దీంతో ప్ర‌యాణికుల సౌక‌ర్యం కోసం తాజా నిర్ణయాన్ని కేంద్రం ప్రకటించింది. ‘విమాన ప్రయాణాల‌కు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈనెల 18 నుంచి 100 శాతం ప్ర‌యాణికుల‌తో దేశీయ విమానాలు న‌డుపుకోవ‌చ్చు. కాక‌పోతే.. ప్ర‌తి విమాన‌యాన సంస్థ కోవిడ్ నిబంధ‌న‌లు త‌ప్ప‌కుండా పాటించాల్సి ఉంటుంది. ప్ర‌యాణ స‌మ‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి’ అని ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.

క‌రోనా మెద‌టి వేవ్ త‌ర్వాత రెండు నెల‌ల లాక్ డౌన్ అనంతరం.. 2020 మేలో దేశీయ విమానాలు ప్రారంభం అయ్యాయి. అది కూడా 33 శాతం ఆక్యుపెన్సీతోనే విమానాలు న‌డిచాయి. ఆ త‌ర్వాత 80 శాతం అక్యుపెన్సీతో న‌డిచాయి. క‌రోనా సెకండ్ వేవ్ కారణంగా మ‌ళ్లీ ఈ లిమిట్‌ను 50 శాతానికి త‌గ్గించింది ప్ర‌భుత్వం. ఆ త‌ర్వాత 60 శాతం ఆక్యుపెన్సీ, 72.5 శాతం ఆక్యుపెన్సీ, 85 శాతం ఆక్యుపెన్సీతో విమానాలను న‌డిపిస్తున్నారు. తాజాగా ఉన్న అన్ని ఆంక్ష‌ల‌ను ప్ర‌భుత్వం ఎత్తివేస్తూ ఈ నిర్ణ‌యం తీసుకుంది.

* భార‌త్‌లో ఎయిర్ ట్రాఫిక్ డిమాండ్ ఎలా ఉంది?

అక్టోబ‌ర్ 10న ఒక్క‌రోజే దేశీయంగా విమానాల్లో ప్ర‌యాణించిన వారి సంఖ్య 3 ల‌క్ష‌లు దాటింది. ఈసంవ‌త్స‌రం ఫిబ్ర‌వ‌రి 28 నుంచి చూసుకుంటే.. 3 ల‌క్ష‌లు దాట‌డం ఇదే మొద‌టిసారి. ఫిబ్ర‌వ‌రి 28న 3.14 ల‌క్ష‌ల ప్ర‌యాణికులు డొమెస్టిక్ విమానాల్లో ప్ర‌యాణించ‌గా.. గ‌త అక్టోబ‌ర్ 10న 3.04 ల‌క్ష‌ల మంది ప్యాసింజ‌ర్స్ ప్ర‌యాణం చేశారు. పండుగ‌ల సీజ‌న్ ప్రారంభం కావ‌డం.. దేశంలోని అతి పెద్ద ఎయిర్‌పోర్ట్స్ అయిన డిల్లీ, ముంబై ఎయిర్‌పోర్ట్స్‌లో ఎయిర్ ట్రాఫిక్ పెర‌గ‌డంతో ప్ర‌భుత్వం కూడా 100 శాతం ఆక్యుపెన్సీకి అనుమ‌తిని ఇచ్చేసింది.

అక్టోబ‌ర్ 31 నుంచి డిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోని టెర్మిన‌ల్ 1ను పునఃప్రారంభించ‌నున్నారు. క‌రోనా వ‌ల్ల ఆ టెర్మిన‌ల్‌ను 18 నెల‌లుగా మూసి ఉంచారు. అక్టోబ‌ర్ 20 నుంచి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న టెర్మిన‌ల్ 1 ను పునఃప్రారంభించాల్సి ఉన్నా.. ప్ర‌యాణికుల ర‌ద్దీ వ‌ల్ల దాన్ని ఈరోజే ఓపెన్ చేయ‌నున్నారు.

First published:

Tags: Airlines, Flight

ఉత్తమ కథలు