Dogecoin అంటే ఏంటి...బిట్ కాయన్‌కు ఇది ఎందుకు పోటీ ఇస్తోంది...

(ప్రతీకాత్మక చిత్రం)

డాగీ కాయిన్ మొదటి నుంచి అంత సీరియస్ తీసుకోలేదు. అందరూ ఓ జోక్ గా పరిగణించారు. అయితే ఆనతి కాలంలోనే ఇది ఆకర్షణీయంగా మారింది.

  • Share this:
    దశాబ్దకాలంగా ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ కరెన్సీ అయిన క్రిప్టో కరెన్సీకి మద్దతు పెరుగుతోంది. ముఖ్యంగా బిట్ కాయిన్స్, డాగీ కాయిన్స్(Dogecoin ) లావాదేవీల కోసం వాడుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో డాగీ కాయిన్స్ విలువ అమాంతం పెరిగిపోతోంది.అసలు ఈ డాగీ కాయిన్ అంటే ఏంటి? ప్రస్తుతం ఎందుకింత ప్రాచుర్యం పొందింది లాంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

    డాగీ కాయిన్ అంటే ఏంటి?
    దీని విలువ పెరగడానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి ముందు దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవాలి. ఈ డాగీ కాయిన్ ను సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తోన్న బిల్లి మార్కస్, జాక్సన్ పామర్ కనిపెట్టారు. క్రిప్టో కరెన్సీలో ఇది మరో రకం. బ్యాంకింగ్ ఫీజులు లేకుండా తక్షణ చెల్లింపులు చెల్లించేందుకు గాను ఓ వ్యవస్థను సృష్టించాలని ఈ టెక్కీలు అనుకున్నారు. అప్పటికి షిబా ఇను అనే శునకం ఎంతో పాపులర్ సంపాదించింది. అందుకే ఆ కుక్క లోగోను ఈ కాయిన్ కు ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. ఈ విధంగా డాగీ కాయిన్ సృష్టించబడింది.

    ఏదేఏమైనప్పటికీ డాగీ కాయిన్ మొదటి నుంచి అంత సీరియస్ తీసుకోలేదు. అందరూ ఓ జోక్ గా పరిగణించారు. అయితే ఆనతి కాలంలోనే ఇది ఆకర్షణీయంగా మారింది. దీని గురించి రాయడం ప్రారంభించారు. ప్రస్తుతం ఈ డాగీ కాయిన్ కు మంచి విలువ ఉంది. 2018లో ఈ కాయిన్ ధర రెంటు సెంట్లు(Cents). మిగిలిన క్రిప్టో కరెన్సీతో క్రాష్ కావడానికే ముందే 2019 ప్రారంభంలో దాని విలువను 90 శాతం కోల్పోయింది. గత వారం వరకు పైసా కంటే తక్కువ విలువకే చెలామణి అయిందని నివేదికలు సూచిస్తున్నాయి.

    ప్రస్తుతం డాగీ కాయిన్ పాపులర్ అవడానికి కారణం..
    డాగీ కాయిన్ విలువ పెరగుదల వాల్ స్ట్రీట్ బెట్స్ దృగ్విషయంతో ముడిపడి ఉంది. ఇది సబ్ రెడ్డిట్ ప్లాట్ ఫాం. వాల్ స్ట్రీట్ బెట్స్ అనేక ఆన్ లైన్ కదలికలకు కేంద్రబిందువుగా ఉంది. ఇది గేమ్ స్టాప్ విలువను పెంచుతుంది. గత వారం రోజులుగా గేమ్ స్టాప్ విలువ ఐదు రెట్లు పెరిగడం ఇక్కడ గమనించదగ్గ విషయం. డాగీ కాయిన్ తిరిగి పుంజుకోవడం, డబ్ల్యూఎస్ ఛైర్మెన్ డాగీ కాయిన్ గురించి ట్విట్టర్లో స్పందించడం వల్ల ఈ కాయిన్ గురించి సర్వత్రా చర్చనీయాంశమైంది. క్రిప్టోకరెన్సీ ప్రపంచంలో వాల్ స్ట్రీట్ బెట్స్ కమ్యునిటీకి డాగీ కాయిన్ సరైన ప్రేరణగా ఉంది.

    వాల్ స్ట్రీట్ బెట్స్ క్రేజ్ వల్ల ప్రభావం చూపిన మొదటి క్రిప్టో కరెన్సీగా డాగీ కాయిన్ గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియా ప్రభావం వల్ల విలువ పెంచుకున్నవాటిలో డాగీ కాయిన్ మొదటిది ప్రస్తుతానికి ఇది విలువైన ఆస్తిగా మారుతోంది.
    Published by:Krishna Adithya
    First published: