ప్రస్తుతం భారత్ లో ప్రధాన సమస్య కోవిడ్-19. ఇది కాకుండా ఇంధన ధరల పెరుగుదల సామాన్యుడిపై గుదిబండగా మారింది. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరల వల్ల మధ్యతరగతి కుటుంబంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బుధవారం నాడు బ్రెంట్ ముడి చమురు బ్యారెల్(దాదాపు 159 లీటర్లు) ధర 71 డాలర్లతో రెండేళ్ల గరిష్ఠానికి చేరింది. 2019 మే తర్వాత ఈ స్థాయిలో బ్యారెల్ ధర పెరగడం ఇదే అత్యధికం. ఇదే సమయంలో పెట్రోలియం ఉత్పత్తి చేసే దేశాలు కూడా ముడి చమురు ఉత్పత్తిని క్రమంగా పెంచే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ప్రకటించాయి.
ధరల పెరుగుదలకు కారణం ఏంటి?
2021 ప్రారంభం నుంచి ఇంధన ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. బ్రెంట్ చమురు బ్యారెల్ ధర 52 డాలర్లు ఉన్నప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక పునరుద్ధరణులు, ఓపెక్ దేశాల చమురు సరఫరా కోతల కారణంగా డిమాండ్ పెరిగింది. పెట్రోలియం ఎగుమతి చేసే దేశాలు(ఓపెక్) 2020లో సరఫరా కోతను పొడిగించినప్పుడు 2021 మొదటి ఐదు నెలల్లో బ్యారెల్ ధర 19 డాలర్ల కంటే తక్కువగా ఉంటుదని ఊహించారు. అంతేకాకుండా ఫిబ్రవరి, ఏప్రిల్ మధ్య కాలంలో రోజుకు మిలియన్ బ్యారెళ్లు ఉత్పత్తి చేసిన సౌదీ అరేబియా.. అనంతరం స్వచ్ఛందంగా కోత విధించింది. ఫలితంగా మే నెలలో రోజుకు 250,000 బ్యారెళ్లు, జూన్, జులైలో రోజుకు 750,000 బ్యారెళ్ల ఉత్పత్తి చేయాలని నిర్దేశించింది. సౌదీ అరేబియానే కాకుండా ఓపెక్ దేశాలు కూడా జూన్ లో రోజుకు 350,000 బ్యారెళ్లు, జులైలో 441,000 బ్యారెళ్లు ఉత్పత్తి చేయాలని సంకల్పించాయి.
క్రమంగా పెట్రోలియం ఉత్పత్తిపై కోతలు ఉపసహంరించుకోవడం వల్ల ధరల పెంపుపై ప్రభావం పడదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా పెట్రోలియం ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్ వల్ల ఆర్థిక కార్యకలపాల కూడా వృద్ధి చెందుతున్నాయని అంటున్నారు. ఇరాన్ చమురుపై అంతర్జాతీయ ఆంక్షలు తొలగించిన కారణంగా ఆ దేశంతో నూతన అణు ఒప్పందం కోసం చేసే ప్రయత్నాల్లో పురోగతి ఉంటుందని ఓపెక్ అభిప్రాయపడింది. ఇది చమురు ధరలపై ప్రభావాన్ని చూపదని, ఇరాన్ చమరు ఉత్పత్తిలో క్రమంగా పెరుగుదల జరిగిందని తెలిపారు.
భారత్ లో చమురు ధరలు ప్రభావం..
పెరుగుతున్న ముడి చమురు ధరలు.. భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరగడానికి దోహదపడ్డాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి పెట్రోల్ ధర లీటరుకు రూ.10.8లు పెంచగా.. ఇదే సమయంలో డీజిల్ ధరను రూ.11.5లు పెంచారు. అయితే అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా రిఫైనర్లు వసూలు చేస్తున్న ఛార్జీలు కంటే ప్రస్తుత ధరలు తక్కువగానే ఉన్నాయని కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. ఆటో ఫ్యూయల్స్ లెవీలపై కోత విధించడం లేదా చమురు ధరల తగ్గడం మినహా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గవని తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు, సుంకాల బాదుడు..
అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడమే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేస్తున్న పన్నులు, సుంకాలు కూడా ఇంధన ధరలు పెరగడానికి కారణమయ్యాయి. దేశ రాజధాని అయిన దిల్లీలో బుధవారం నాడు పెట్రోల్ ధరలో 58 శాతం, డీజిల్ ధరలో 52 శాతం వాటాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుగా వసూలు చేశాయి. కరోనా కారణంగా ఆర్థిక కార్యకలాపాలు క్షీణించడంతో కేంద్ర ప్రభుత్వం 2020లో కేంద్ర ఎక్సైజ్ సుంకాలను పెట్రోల్ పై లీటరుకు 13 రూపాయలు, డీజిల్ పై 16 రూపాయలు పెంచింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Oil prices