హోమ్ /వార్తలు /Explained /

Voter ID Address Change: ఓటర్ ఐడీ కార్డులో అడ్రస్ మార్చాలా? ప్రాసెస్ ఇదే

Voter ID Address Change: ఓటర్ ఐడీ కార్డులో అడ్రస్ మార్చాలా? ప్రాసెస్ ఇదే

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Voter ID Address Change | ఓటర్ ఐడీ కార్డులో అడ్రస్ మార్చాలంటే ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేయొచ్చు. ఆ ప్రాసెస్ తెలుసుకోండి.

  మీ ఓటర్ ఐడీ కార్డుపై అడ్రస్ మార్చాలనుకుంటున్నారా? ఒక అడ్రస్ నుంచి మరో అడ్రస్‌కు మారారా? సులువుగా ఓటర్ ఐడీ కార్డుపై అడ్రస్ మార్చొచ్చు. ఓటర్ ఐడీ కార్డును ఐడీ ప్రూఫ్‌గా, అడ్రస్ ప్రూఫ్‌గా ఉపయోగించడం మామూలే. అందుకే ఓటర్ ఐడీ కార్డులోని వివరాలన్నీ అప్‌డేట్‌గా ఉండటం అవసరం. అడ్రస్ మారినప్పుడు ఓటర్ ఐడీ కార్డులో అడ్రస్ కూడా మార్చొచ్చు. లేదా అదే అడ్రస్‌లో ఉంటే ఎన్నికల సమయంలో ఓటు సేమ్ అడ్రస్‌లో వస్తుంది. అక్కడే ఓటు వేయాల్సి వస్తుంది. ఒకవేళ అడ్రస్ మార్చాలనుకుంటే మాత్రం అందుకోసం దరఖాస్తు చేయాలి. ఆఫ్‌లైన్‌తో పాటు ఆన్‌లైన్‌లో కూడా అడ్రస్ మార్చడానికి దరఖాస్తు చేయొచ్చు. మరి ఆన్‌లైన్‌లో ఓటర్ ఐడీ కార్డ్ అడ్రస్ ఎలా మార్చాలో తెలుసుకోండి.

  Voter ID Address Change: ఆన్‌లైన్‌లో ఓటర్ ఐడీ కార్డ్ అడ్రస్ మార్చండి ఇలా


  ముందుగా నేషనల్ వోటర్స్ సర్వీస్ పోర్టల్-NVSP వెబ్‌సైట్ https://www.nvsp.in/ ఓపెన్ కావాలి.

  అందులో మీ వివరాలతో లాగిన్ కావాలి.

  ఆ తర్వాత Forms పైన క్లిక్ చేయాలి.

  వేర్వేరు ఫామ్స్ ఓపెన్ అవుతాయి. అందులో Form 6 పైన క్లిక్ చేయాలి.

  ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మీ ఓటు మార్చేందుకు, ఓటర్ ఐడీ కార్డులో అడ్రస్ మార్చేందుకు ఈ ఫామ్ ఉపయోగపడుతుంది.

  ఒకవేళ మీరు ఒకే నియోజకవర్గంలో వేరే ప్రాంతానికి మారినట్టైతే Form 8A పైన క్లిక్ చేయాలి.

  ఆ తర్వాత పేరు, పుట్టిన తేదీ, రాష్ట్రం, నియోజకవర్గం, ప్రస్తుత అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ లాంటి వివరాలన్నీ ఎంటర్ చేయాలి.

  మీ ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ కూడా వెల్లడించాలి.

  ఆ తర్వాత ఫోటో, అడ్రస్ ప్రూఫ్, వయస్సు ధృవీకరణ పత్రం లాంటి డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.

  ఆ తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి.

  Indian Railways: సరిగ్గా ఇదే రోజు పరుగులు తీసిన మొదటి రైలు... ఏ రూట్‌లో తెలుసా?

  SBI: ఎస్‌బీఐలో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఉందా? ఛార్జీలపై క్లారిటీ ఇచ్చిన బ్యాంకు

  Voter ID Address Change: ఆఫ్‌లైన్‌లో ఓటర్ ఐడీ కార్డ్ అడ్రస్ మార్చండి ఇలా


  ముందుగా నేషనల్ వోటర్స్ సర్వీస్ పోర్టల్-NVSP వెబ్‌సైట్ https://www.nvsp.in/ ఓపెన్ కావాలి.

  అందులో మీ వివరాలతో లాగిన్ కావాలి.

  ఆ తర్వాత Forms పైన క్లిక్ చేయాలి.

  వేరే నియోజకవర్గంలోకి అడ్రస్ మార్చాలనుకుంటే Form 6, ఒకే నియోజకవర్గంలో అడ్రస్ మారితే Form 8A డౌన్‌లోడ్ చేయాలి.

  ఫామ్ పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి దగ్గర్లోని ఎన్నికల అధికారి కార్యాలయంలో ఇవ్వాలి.

  RTGS Services: అలర్ట్... 14 గంటలపాటు ఆ‌ర్‌టీజీఎస్ సేవలు బంద్... ఎప్పుడో తెలుసుకోండి

  Money Transfer: పొరపాటున డబ్బులు వేరే అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేశారా? ఇలా చేయండి

  Voter ID Address Change: అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోండి ఇలా


  ఓటర్ ఐడీ అడ్రస్ మార్చేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసినట్టైతే https://www.nvsp.in/ వెబ్‌సైట్ ఓపెన్ కావాలి.

  హోమ్ పేజీలో Track Application Status పైన క్లిక్ చేయాలి.

  ఆ తర్వాత రిఫరెన్స్ ఐడీ ఎంటర్ చేయాలి.

  Track Status పైన క్లిక్ చేయాలి.

  మీ దరఖాస్తు స్టేటస్ తెలుస్తుంది.

  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Election Commission of India

  ఉత్తమ కథలు