Home /News /explained /

DO YOU KNOW WHY VIP PRISONERS IN INDIA WILL ASK FOOD FROM HOME AK GH

మన జైళ్లలో ఎలాంటి భోజనం పెడతారు ?.. వీఐపీలు జైల్లో ఉన్నప్పుడు ఇంటి భోజనం తెప్పించుకునే ఛాన్స్ ఉందా ?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

డ్రగ్స్‌ కేసులో ప్రముఖ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ అరెస్టు తర్వాత జైళ్లలో అందించే ఆహారం వార్తల్లో ప్రముఖంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో జైళ్లలో అందించే ఆహారం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

మనీలాండరింగ్‌ కేసులో అరెస్టైన మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ప్రస్తుతం జైల్లో జుడిషియల్‌ కస్టడీలో ఉన్నారు. ఇంటి నుంచి భోజనం తెప్పించేందుకు అనుమతించాలన్న ఆయన విజ్ఞప్తిని ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. జైలు భోజనాన్ని తీసుకోవాలని సూచించింది. దేశ్‌ముఖ్‌కు ఎసిడిటీ సమస్య ఉందని, ఆ కారణంగా ఇంటి భోజనానికి అనుమతించాలని ఆయన తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని పీఎంఎల్‌ఎ కోర్టు తిరస్కరించింది. ఇంటి భోజనం కూడా ఎసిడిటీకి కారణం కావచ్చని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ‘ప్రస్తుతానికి ఆయన్ను జైల్లో ఉండనివ్వండి. ఆరోగ్య సమస్యలు ఏమైనా తలెత్తితే వాటిని బట్టి తగిన ఆదేశాలు జారీ చేస్తాం’ అని కోర్టు స్పష్టం చేసింది.

డ్రగ్స్‌ కేసులో ప్రముఖ నటుడు షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ అరెస్టు తర్వాత జైళ్లలో అందించే ఆహారం ఇటీవల కాలంలో వార్తల్లో నిలుస్తోంది. ఈ నేపథ్యంలో జైళ్లలో అందించే ఆహారం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

* భారతీయ జైళ్లలో ఉండే వారికి ఏ ఆహారం ఇవ్వాలన్నది ఎవరు నిర్ణయిస్తారు?
శాంతిభద్రతలు, జైళ్లు అనేవి రాష్ట్ర ప్రభుత్వ జాబితాలో ఉన్నాయి. కాబట్టి జైళ్లలో ఉండేవారి ఆహార బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. ఖైదీలకు అందించే ఆహారం విషయంలో ఆదర్శ మార్గదర్శకాలు ఉన్నాయి. తాజాగా 2016లో వీటిని బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ జారీ చేసింది.

భారతీయ వైద్య పరిశోధనా మండలి (ICMR) జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఖైదీలకు ఆహారం అందించాలని మోడల్ ప్రిజన్ మాన్యువల్- 2016 (Model Prison Manual) నిబంధనలు చెబుతున్నాయి. స్థానిక సంప్రదాయాలు, ఆహార అలవాట్లలో మార్పులు ఉన్నా వీలైనంత వరకు నిర్దేశిత ప్రమాణాలను అనుసరించాలని సూచిస్తోంది. అవసరాలు, అలవాట్లు, ఖైదీలు నివసించే విధానం, ఆ ప్రాంతంలోని వాతావరణ పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలని తెలియజేస్తోంది. అంతే కాదు అవసరాన్ని బట్టి అందించే ఆహారపు పరిమాణంలో రాష్ట్ర ప్రభుత్వాలు మార్పులు చేయవచ్చని వివరిస్తోంది.

ఆరోగ్యం, శక్తి పదిలంగా ఉంచుకునేందుకు తగిన ప్రామాణిక ఆహారం అందించాలని ప్రస్తుత విధానం చెబుతున్నా, జైళ్లలో విస్తృతంగా ఉండే అవినీతి కారణంగా ఎంత మొత్తం ఆహారం ఖైదీలకు చేరుతుందనేది ఊహకందని విషయం. జైలు కమిటీలు సిఫార్సులు, కోర్టుల సూచనలు అనేక ఉన్నా ఆహార నాణ్యత, పరిమాణం, ఆహార తయారీ ఏర్పాట్లు, కిచెన్‌ నిర్వహణ, ఆహారాన్ని పంపిణీ చేసే ప్రదేశాలు ఏ మాత్రం సంతృప్తికరంగా లేవని అధ్యయనాల్లో స్పష్టమైంది.

* ఖైదీల ఆహారంలో ఏమేం ఉంటాయి?
ఖైదీలకు ఇచ్చే ఆహారంలో 600 గ్రాముల ధాన్యం, 100 గ్రాముల పప్పు, 250 గ్రాముల కూరగాయలు ఉండాలనే నిబంధనలు ఉన్నాయి. అంతేకాదు వారానికి ప్రతి ఒక్కరికీ 100 గ్రాముల మాంసం లేదా చేపలు.. కుదరని పక్షంలో 500 మి.లీ పాలు, నెయ్యి (15 గ్రాములు), వేరుశనగ (100 గ్రాములు) అందించాలని తెలియజేస్తోంది. ఆహార ప్రణాళికలో ప్రతి ఖైదీకి నూనె నుంచి చక్కెర వరకు ఎంత అవసరమో స్పష్టంగా పేర్కొంది. పోషక అవసరాలు, భారతీయులకు సిఫార్సు చేసిన ఆహార అలవెన్సులను బట్టి పురుష ఖైదీకి అయితే రోజు 2,320-2,730 k/cal, మహిళా ఖైదీకి అయితే రోజు 1900/2,230 k/cal ఉండాలని నిర్దేశిస్తోంది.

గర్భిణులు, పాలిచ్చే తల్లులకు ప్రత్యేక ఆహారం అందించాలని.. అందులో పాలు, చేపలు లేదా మాంసం లేదా పెరుగు అందించాలని సూచిస్తోంది. వీరికి మెడికల్‌ ఆఫీసర్‌ సూచించిన మేరకు తాజా పండ్లు కూడా అందించాల్సి ఉంటుంది. మోడల్ ప్రిజన్ మాన్యువల్ మార్గదర్శకాల ప్రకారం ఆహార అవసరాలను నిర్దేశించిన మొత్తాన్ని మూడు పూటలా అందించాలి. ఉదయం పూట తేలికపాటి ఆహారం అందించాలి. మధ్యాహ్నం, సాయంత్రం తిరిగి వారికి గదుల్లోకి పంపించే ముందు ఆహారం అందించాలి.

నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో (NRCB) రూపొందించిన 2019 సమాచారం ప్రకారం ఖైదీల ఖర్చు విషయంలో దాదాపు సగం మొత్తం (47.9శాతం) ఆహారానికే వెళ్తోంది. ఆర్థిక సంవత్సరం 2019-20లో రూ.175 కోట్లతో ఉత్తరప్రదేశ్‌లో అత్యధిక ఆహార ఖర్చు ఉంది. ఆ తర్వాతి స్థానంలో బిహార్‌ (రూ.145.8 కోట్లు), మధ్యప్రదేశ్‌ (రూ.72.7 కోట్లు) ఉన్నాయి. 1 లక్షకు పై ఖైదీలతో ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో మధ్యప్రదేశ్‌ (సుమారు 44 వేలు), బిహార్‌ (సుమారు 39 వేలు) ఉన్నాయి.

2015 నాటి NCRB డేటాను పరిశీలిస్తే ఖైదీలకు ఆహారం అందించేందుకు రాష్ట్రాలు సగటున ఒక్కొక్కరికి రూ.52.4 ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈశాన్య రాష్ట్రాలు, దక్షిణాది రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్‌, జమ్మూ & కశ్మీర్‌లో ఖైదీలకు మాంసాహారం ఉచితంగా అందజేయరు. 2015 సంవత్సరంలో ఢిల్లీ, గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌ ఖైదీల ఆహారం కోసం అతి తక్కువ ఖర్చు చేశారు. ఇది వరుసగా రూ.31.3, రూ.32.8, రూ.34.2, రూ.35.4గా ఉన్నాయి. నాగాలాండ్‌ రాష్ట్రం మాత్రం ఖైదీల ఆహారం కోసం సగటున ప్రతి ఒక్కరిపై రూ.139.2 ఖర్చు చేస్తోంది. 2013 లెక్కల ప్రకారం గ్రామీణ భారతదేశంలో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారి రోజువారీ ఆహారఖర్చు రూ.32 మాత్రమే కావడం గమనార్హం.

* ప్రత్యేక కేసుల్లో మినహాయింపులు ఉంటాయా?
పండుగలు, ఆధ్యాత్మికంగా ఉపవాసాలు చేసే ఖైదీలకు అందించే ఆహారంలో మినహాయింపులు, మార్పులను మోడల్ ప్రిజన్ మాన్యువల్ సూచిస్తోంది. నిర్దేశిత ఆహారం, పరిమాణం విషయంలో ఎటువంటి తగ్గింపు లేదా మార్పు అన్నది చేయకూడదని మ్యానువల్ చెబుతోంది. అలా మార్చాల్సిన ప్రత్యేక సందర్భం ఏర్పడితే దానికి ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (IG) నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని మ్యానువల్‌ పేర్కొంటోంది.

మెడికల్‌ ఆఫీసర్‌ సిఫార్సు చేసినప్పుడు, సదరు వ్యక్తి ఆరోగ్యం లేదా వారి ప్రత్యేక జీవన విధానం కారణంగా ఇస్తున్న ఆహారం సరైనది, తగినది కాదని జైలు సూపరింటెండెంట్‌ భావించిన పక్షంలో ప్రత్యేక భోజనం కోసం వారు ఆదేశించవచ్చు. ఆ ఆదేశం లిఖితపూర్వకంగా ఉండాలి. IG ఆమోదానికి అది లోబడి ఉంటుందని మ్యానువల్‌ వివరిస్తోంది.

* ఖైదీలు ఇంటి భోజనం తీసుకోవచ్చా?
పౌర ఖైదీ లేదా శిక్షపడని నేరస్తులకు తగిన సమయంలో ప్రైవేట్‌ వనరుల నుంచి ఆహారం, దుస్తులు, పడక లేదా ఇతర అవసరాలు కొనుగోలు చేసేందుకు లేదా అందుకోవచ్చని ఖైదీల చట్టం- 1894, ఆర్టికల్‌ 31 చెబుతున్నాయి. అయితే ఆ సదుపాయం IG ఆమోదానికి లోబడి ఉంటుంది.

ముంబయిలోని ప్రఖ్యాత ఆర్థర్‌ రోడ్‌ జైలుకు సంబంధించిన 2011 నాటి ఒక నివేదిక ప్రకారం.. ఇంటి భోజనాన్ని ఖైదీలకు అందించడాన్ని అప్పటి ఐజీ (జైళ్లు) సురేంద్ర కుమార్‌ నిషేధించారు. బయటి నుంచి వచ్చే ఆహారాన్ని అనేక విధాలుగా దుర్వినియోగం చేయవచ్చని, ఆహారంలో విషం కూడా కలపవచ్చని ఆయన పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఆహారం తెచ్చే వ్యక్తి ఖైదీలకు మెసేంజర్‌గా వ్యవహరించే అవకాశం ఉందని ఆయన అన్నారు.

Revanth Reddy: హైకమాండ్ ముఖ్యనేత ప్రశ్న.. రేవంత్ రెడ్డి నిర్ణయాలు మారనున్నాయా ?

K Chandrashekar Rao: వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి.. కేసీఆర్ లెక్కేంటి ?

షారూఖ్ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ డ్రగ్స్‌ కేసులో అరెస్టు అయిన ఆర్థర్‌ రోడ్డు జైల్లో ఉన్నప్పుడు జైల్లో అతని అవసరం కోసం రూ.4500 మనీ ఆర్డర్‌ అందుకున్నట్టు తెలుస్తోంది. ఆర్థర్‌ రోడ్డు జైలు క్యాంటిన్‌లో బ్రెడ్‌, స్నాక్స్, వడపావ్‌, బాజీపావ్‌, సమోసా, చికెన్‌, ఎగ్‌ తాలి, జ్యూస్‌ వంటివన్నీ అందుబాటులో ఉంటాయని సమాచారం. జైల్లో ఉన్న ఖైదీకి గరిష్ఠంగా రూ.4,500 పంపవచ్చు.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Jails

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు