NPS: కార్పొరేట్ నేషనల్ ఫెన్షన్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది?.. ఎలాంటి అదనపు పన్ను ప్రయోజనాలను అందిస్తాయి?

ప్రతీకాత్మక చిత్రం

కార్పొరేట్ నేషనల్ పెన్షన్ స్కీమ్ (కార్పొరేట్ NPS)ను యాజమాన్య సంస్థ (ఎంప్లాయర్) అందిస్తుంది. ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, సూపర్‌ యాన్యుయేషన్, ఇతర పెన్షన్ స్కీమ్‌తో పాటు ఉద్యోగి ప్రయోజనంగా యజమానులు ఈ ప్రయోజనాలు అందించవచ్చు.

  • Share this:
భవిష్యత్తు ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు ఉద్యోగులు అనేక పథకాల్లో పెట్టుబడి పెడుతూ ఉంటారు. కొన్ని పథకాల్లో పన్ను రాయితీలు కూడా లభిస్తాయి. వీటిలో జాతీయ పెన్షన్ సిస్టమ్ (National Pension System) పెట్టుబడులు ప్రధానమైనవి. ఈ రిటైర్మెంట్ పథకం ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. 2021-22 ఆర్థిక సంవత్సరం ఆగస్టు వరకు ప్రభుత్వేతర రంగం నుంచి 2.4 లక్షల మంది చందాదారులు ఈ స్కీమ్‌లో చేరారు. గత ఏడాది ఇదే సమయానికి కొత్తగా 1.6 లక్షల మంది చందాదారులు ఈ పథకంలో కొత్తగా చేరారు. ఈ స్కీమ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

కార్పొరేట్ నేషనల్ పెన్షన్ స్కీమ్ (కార్పొరేట్ NPS)ను యాజమాన్య సంస్థ (ఎంప్లాయర్) అందిస్తుంది. ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, సూపర్‌ యాన్యుయేషన్, ఇతర పెన్షన్ స్కీమ్‌తో పాటు ఉద్యోగి ప్రయోజనంగా యజమానులు ఈ ప్రయోజనాలు అందించవచ్చు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులకు కార్పొరేట్ NPS మోడల్ అందుబాటులో ఉంది.

* యజమాని ఎన్‌పీఎస్ ఇస్తే, ఉద్యోగులకు అదనపు పన్ను మినహాయింపు లభిస్తుందా?
ఆల్ సిటిజన్స్ మోడల్ కింద ఎన్‌పీఎస్ తీసుకుంటే, ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సి ద్వారా రూ.1,50,000 వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. ఉద్యోగిగా మీ కంట్రిబ్యూషన్స్ మొత్తంపై కూడా పన్ను ప్రయోజనం లభిస్తుంది. సెక్షన్ 80సిసిడి (1B) కింద రూ.50,000 అదనపు పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. ఉద్యోగులకు యజమాని NPS చెల్లిస్తే.. జీతంలో (బేసిక్, డీఏ కలిపి) పది శాతం వరకు తగ్గింపునకు అర్హత పొందుతారు. మీరు ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగి అయితే 14 శాతం వరకు తగ్గింపు ఉంటుంది. సొంతంగా జమచేస్తే సెక్షన్ 80సిసిడి (1), 80సిసిడి (1B) కింద మినహాయింపు కొనసాగుతుంది.

ఈ తగ్గింపులన్నీ పన్ను మినహాయింపుల విధానంతో అందుబాటులో ఉన్నాయి. అయితే యజమాని చెల్లించే NPS మొత్తంపై మినహాయింపు, కొత్త విధానంలో అలాగే ఉంచారు. మీ ఖాతాకు సొంతంగా మీరు జమ చేస్తే సెక్షన్ 80సి, 80సిసిడి (2) కింద పన్ను మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. 2021 కేంద్ర బడ్జెట్ తర్వాత రూ.2.5 లక్షల కన్నా ఎక్కువ మొత్తంపై వచ్చే వడ్డీలపై పన్ను విధిస్తున్నారు. ఉద్యోగులు తమ వద్ద ఉన్న అదనపు నిధులను జాతీయ పెన్షన్ పథకంలో పెట్టుబడి పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

* కార్పొరేట్ NPS ద్వారా ఈపీఎఫ్ తగ్గింపుల కంటే ఎక్కువ ఆదాయ పన్ను ప్రయోజనాలు పొందవచ్చా?
ఉద్యోగుల భవిష్య నిధి కంటే ఎక్కువగా కూడా మీ యజమాని జాతీయ పెన్షన్ పథకంలో జమ చేయవచ్చు. యజమాని ఉద్యోగి ఇద్దరూ సమానంగా నిధులు జమచేయాల్సిన అవసరం లేదు. ఎవరు ఎంతైనా ఇందులో జమచేయవచ్చు. ఇందులో సెక్షన్ 80సిసిడి(2) కింద పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. ఉద్యోగం మారితే పాన్ నెంబరు (Permanent Account Number )ను ట్యాగ్ చేసుకోవడం ద్వారా కొత్త యజమానికి బదిలీ చేయవచ్చు. దీనికి ప్రత్యామ్నాయంగా ఆల్ సిటిజన్ మోడల్ ద్వారా పెట్టుబడి కొనసాగించవచ్చు. యజమాని పాలసీని బట్టి, NPS పెట్టుబడి నిర్వహణ ఛార్జీలు, కస్టోడియన్ ఫీజులు, లావాదేవీల ఛార్జీలను యజమాని లేదా ఖాతాదారుడు భరించాల్సి ఉంటుంది.

జనవరి 1, 2004 తరువాత ఉద్యోగంలో చేరిన సైనికులు మినహా, కేంద్ర ప్రభుత్వోద్యోగులందరికీ NPS తప్పనిసరి చేశారు. దీన్ని చాలా రాష్ట్రాలు కూడా ఆమోదించాయి. కార్పొరేట్ మోడల్ కింద ప్రైవేటు సంస్థలకు కూడా అనుమతించారు. ఉద్యోగుల జీతంలో 10 శాతం వరకు యజమానుల సహకార వ్యయంగా పరిగణిస్తారు. వారి లాభం లేదా నష్టాల ఖాతా నుంచి పన్ను మినహాయింపు పొందవచ్చు.

Lizards: బల్లులతో ప్రమాదం.. వాటిని ఇంట్లో నుంచి తరిమేయండి ఇలా..

Walking: వాకింగ్ చేయడం ఆరోగ్యానికి ఎంతో మేలు.. అదే సమయంలో ఈ విషయాలు గుర్తుంచుకోండి

కీలక పదవి ఆ ముగ్గురిలో ఎవరికి ? KCR మనసులో ఉన్నదెవరు..? ట్విస్ట్ ఉంటుందా ?

Banana: అరటిపండ్లు తినడం వల్ల బరువు పెరుగుతాయా ?.. ఇందులో నిజమెంత ?

NPS ఉపసంహరణ నియమాల్లో మార్పులేదు. 60 సంవత్సరాల వయసులో కార్పస్ ఫండ్‌లో 60 శాతం మొత్తం తీసుకోవచ్చు. మిగిలిన 40 శాతం మొత్తాన్ని యాన్యుటీలుగా మార్చాలి. పదవీ విరమణ తరువాత ఖాతాదారులకు ఫెన్షన్ ఇచ్చేందుకు ఉపయోగపడుతుంది. కొన్ని తీవ్రమైన అనారోగ్యాలు, ఆస్తుల కొనుగోలు చేయడం, పిల్లల చదువుల ఖర్చులకు పథకంలో చేరిన మూడు సంవత్సరాల తరువాత సొంత కంట్రిబ్యూషన్‌లో 25 శాతం పాక్షికంగా ఉపసంహరించుకోవచ్చు. యజమానులు లేదా ఉద్యోగులు కేంద్రం అనుమతించిన ఎనిమిది పెన్షన్ ఫండ్ మేనేజర్లలో ఎవరినైనా ఎంచుకోవచ్చు. మీ యజమాని 2018 తర్వాత ఈ వ్యవస్థలో చేరి, పెన్షన్ ఫండ్ మేనేజర్‌ను ఎంచుకుంటే, ఒక సంవత్సరం అనంతరం మాత్రమే మీరు మరొక ఫండ్ మేనేజర్‌కు మారవచ్చు.

* కంపెనీలన్నీ కార్పొరేట్ ఎన్‌పీఎస్ ప్రయోజనాలు అందిస్తున్నాయా?
కంపెనీస్ యాక్ట్- 2013 కింద నమోదైన సంస్థలు లేదా సహకార సంఘాల ఉద్యోగులకు NPS చెల్లించవచ్చు. ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ సంస్థలు కూడా కార్పొరేట్ నమూనా అనుసరించవచ్చు. నమోదైన భాగస్వామ్య సంస్థలు, యాజమాన్య సంస్థలు, విదేశీ కంపెనీలు కూడా NPS అందించవచ్చు.
Published by:Kishore Akkaladevi
First published: