DO YOU KNOW HOW THE WORD GANAPATI BAPPA MORIYA ORIGINATED IN HISTORY PRV
Vinayaka chavithi: గణేశోత్సవాల్లో గణపతి బప్పా మోరియా అంటారు కదా.. ఆ పదం ఎలా పుట్టిందో తెలుసా..
గణపతి
వినాయక చవితి (Vinayaka Chavithi) ఉత్సవాలకు దేశమంతా సిద్ధమైంది. గణనాథుడిని స్మరించడానికి భక్తజనం ఊగిపోతున్నారు. గణపతి బప్ప మోరియా (Ganapathi Bappa Morea) .. నినాదాలు మారుమోగే సమయం వచ్చేసింది. అయితే ఈ గణపతి బప్పా మోరియో (Morea) పదానికి వెనుక ఉన్న కథ తెలుసా
వినాయక చవితి (Vinayaka Chavithi) ఉత్సవాలకు దేశమంతా సిద్ధమైంది. గణనాథుడిని స్మరించడానికి భక్తజనం ఊగిపోతున్నారు. గణపతి బప్ప మోరియా (Ganapathi Bappa Moriya) .. నినాదాలు మారుమోగే సమయం వచ్చేసింది. అయితే ఈ గణపతి బప్పా మోరియా (Moriya) పదానికి వెనుక ఉన్న కథ తెలుసా.. మోరియా (Moriya) అని ఎందుకంటారు? దీని కథేంటి ఓ సారి తెలుసుకుందాం.. పూర్వం గండకిని పరిపాలించే రాక్షస రాజు సింధురాసురుడు (Sindhurasurudu). 2000 ఏళ్లు తపస్సు చేసి సూర్యుని నుంచి అమృతం పొందాడు. అమృతం అతని ఉదరంలో ఉన్నంతకాలం, అతనికి మృత్యు భయం ఉండదు. ఈ ధైర్యంతో సింధురాసురుడు తన పరాక్రమంతో ముల్లోకాలను జయించాలని సంకల్పించాడు. ముందు దేవతలను జయించి వారిని కారాగారంలో బంధించాడు. తరువాత కైలాసం, వైకుంఠాలపై దండెత్తాడు. పార్వతీ పరమేశ్వరులు కూడ సింధురాసుని బాధలు పడలేక కైలాసాన్ని వదిలి మేరుపర్వతంలో ఉన్నారు.
సింధురాసురుడు శ్రీ మహావిష్ణువును తన గండకి రాజ్యంలో ఉండమని ఆజ్ఞాపించాడు. ఈ పరిస్థితులలో దేవ గురువైన బృహస్పతి.. సింహారూఢుడు, పది చేతులు కలవాడు అయిన వినాయకుని ప్రార్ధించి, ఆయనను శరణు వేడుకోండి అని దేవతలకు సలహా ఇచ్చాడు. వారు అలాగే చేశారు. వారి ప్రార్థనలను(prayers) మన్నించి, గణపతి సాక్షాత్కరించి, తాను పార్వతీదేవికి కుమారుడిగా జన్మించి, సింధురాసురుని చంపేస్తానని మాట ఇచ్చాడు. మాట ప్రకారం పార్వతీ (Parvathi) తనయుడిగా జన్మించాడు. కొంతకాలానికి సింధురాసురుని మిత్రుడయిన కమలాసురుడు శివునిపై యుద్ధానికి (war) వెళ్లాడు. అప్పడు పార్వతి కుమారుడైన గణపతి నెమలి వాహనారూఢుడై కమలాసురునితో ఘోర యుద్ధం చేశాడు.
చిన్న రూపంలో బాణం వదిలిన గణపతి..
గణపతి కమలాసురుని ఎదుర్కొని తన శిరస్సును ఖండించాడు. ఆ శిరస్సు(head) మోర్గాం (Morgam) క్షేత్రంలో పడింది. తరువాత గణపతి పార్వతీ పరమేశ్వరులతో కలిసి గండకికి వెళ్ళి, దేవతలను చెరసాల నుంచి విడిపించమని సింధురాసురుని ఆదేశించారు. అతడు పాటించనందుకు, 3 రోజులు గణపతి (Ganapathi) యుద్ధం చేశాడు. చివరకు సింధురాసురుడు ఖడ్గం ధరించి గణపతి వైపు పరిగెత్తాడు. అప్పడు గణపతి చిన్న రూపాన్ని ధరించి, నెమలి వాహనాన్ని వీడి, క్రింద నుంచి సింధురాసురుని ఉదరంపై (Aim to Stomach) ఒక బాణం (Arrow) వేశాడు. అది అతని ఉదరాన్ని చీల్చి వేసింది. వెంటనే ఉదరంలో ఉన్న అమృతమంతా బయటకు వచ్చింది. దానితో సింధు రాసురుడు మరణించాడు. దేవతలు ఆనందించి, గణపతిని పూజించి కొనియాడారు. అప్పడు మోర్గాం క్షేత్రంలో దేవాలయాన్ని(Temple) నిర్మించి, గణపతి విగ్రహాన్ని(Ganapathi Statue) ప్రతిష్టించారు. ఈ విధంగా మోర్గాం, మోరేశ్వర్ గణపతి పుణ్య క్షేత్రమైంది. గణపతి మయూర వాహనంపై వచ్చినందుకు, ఆయనకు మయూరేశ్వర్ (Mayureshwar) అను పేరు కూడ వచ్చింది.
మరాఠీ భాషలో మోర్ అంటే నెమలి. ఆ ప్రదేశంలో నెమళ్లు (peacocks) ఎక్కువగా ఉండటం చేత, ఆ గ్రామానికి మోర్గాం అనే పేరు వచ్చింది. నెమలిని వాహనం చేసుకున్నందుకు గాను, గణపతి మోరేశ్వర్ (Moreshwar) అయ్యాడు. అందుకే ‘గణపతి బప్పా మోరియా (Ganapathi Bappa Moriya)’ అని భక్తులు అంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.