Youtube చానెల్ సంపాదనకు Income Tax కట్టాలా...రూల్స్ ఏం చెప్తున్నాయి...

సహజంగా ఎన్నికలు వచ్చాయంటే నేతలు ఓటర్లను ప్రలోభ పెట్టడానికి రకరకాల తాయిలాలు ప్రకటిస్తూ ఉంటారు. మేనిఫెస్టోలో చెప్పిన వాటి సంగతి పక్కన పెడితే పోలింగ్ డే రోజు వారి ఓట్లు తమకే దక్కేలా రకరకాలుగా ప్రలోభాలు పెడతారు. (ప్రతీకాత్మక చిత్రం)

  • Share this:
    కరోనా తరువాత చిన్నపాటి ఉద్యోగాలపై ఆధారపడేవారు ఇతర ఆదాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ రోజుల్లో నైపుణ్యాలను పెట్టుబడిగా పెట్టి సంపాదించే ఎన్నో మార్గాలు మనకు అందుబాటులోకి వచ్చాయి. ఆసక్తి, అభిరుచులకు పదును పెట్టుకుంటూ సులభంగా డబ్బు సంపాదించే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ అందరికీ అందుబాటులోకి వచ్చిన తరువాత ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు కూడా వ్యాపార మార్గాలుగా మారాయి. ప్రకటనల ద్వారా వీటి నుంచి వచ్చే ఆదాయం ట్యాక్స్ పరిధిలోకి వస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఐటీఆర్‌లో దీని గురించి కచ్చితగా పేర్కోవాలి. ఈ నేపథ్యంలో మన దేశంలో సోషల్‌మీడియా ప్లాట్ ఫామ్ ద్వారా వచ్చే ఆదాయం ఏవిధంగా ట్యాక్స్‌ పరిధిలోకి వస్తుందో తెలుసుకోవాలి.

    వివిధ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాంల ద్వారా సంపాదించే ఆదాయం మొత్తం ట్యాక్స్‌ పరిధిలోకి వస్తుంది. కానీ బ్లాగింగ్ ద్వారా వచ్చే ఇలాంటి ఆదాయాన్ని ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం వర్గీకరించలేదు. చట్ట ప్రకారం ఉన్న ఐదు ట్యాక్స్ హెడ్స్‌ కిందకు ఈ ఆదాయం రాదు. కానీ ఇది బిజినెస్ లేదా ప్రొఫెషనల్ ఇన్‌కమ్‌ కిందకు వస్తుంది. దీనికి అనుగుణంగానే ఈ ఆదాయంపై ట్యాక్స్ వర్తిస్తుంది.

    రెగ్యులర్ ఇన్‌కమ్‌తో పాటు, సోషల్ మీడియా ద్వారా వచ్చే నికర ఆదాయాన్ని కూడా ITRలో చూపించాల్సి ఉంటుంది. నెట్‌ యాన్యువల్ టర్నోవర్‌లో ఈ ఆదాయం రూ.50 లక్షల కంటే ఎక్కువగా ఉంటే, ఆర్థిక సంవత్సరం చివరినాటికి ట్యాక్స్ ఆడిట్ కూడా జరుగుతుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల నెట్ ఇన్‌కమ్ డిక్లరేషన్ చేసేటప్పుడు, దీని నుంచి వార్షిక ఖర్చులను తీసివేయాలి.

    సోషల్ మీడియా ద్వారా వచ్చే ఆదాయం సర్వీస్ సెక్టార్ పరిధిలోకి వస్తుంది. అందువల్ల నెట్ యాన్యువల్ టర్నోవర్ రూ.50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఇన్‌కమ్ ట్యాక్స్ ఆడిట్ తప్పనిసరి అవుతుంది. కానీ ఈ రూ.50 లక్షలపై ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియా ద్వారా వచ్చే నికర ఆదాయాన్ని లెక్కించేటప్పుడు, ఆదాయం నుంచి ఖర్చులను మినహాయించాలి. ఇంటర్నెట్ ఖర్చులు, ప్రైవేట్ వీడియో షూట్, ఫోటో షూట్, సోషల్ మీడియా నిపుణులకు చెల్లించే మొత్తం... వంటి ఖర్చులను నెట్‌ ఇన్‌కమ్‌ నుంచి తీసివేయాలి. ఐటీఆర్ ఫైలింగ్ చేసేటప్పుడు యాన్యువల్ టర్నోవర్ నుంచి ఇలాంటి సాధారణ ఖర్చులను తీసివేయాల్సి ఉంటుంది. ఆ తరువాత మిగిలే ఆదాయంపైనే చట్ట ప్రకారం ట్యాక్స్ చెల్లించాలి.
    Published by:Krishna Adithya
    First published: