Gujarat cm Resigns: గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విజయ్​ రూపానీ చరిత్ర తెలుసా?

విజయ్ రూపానీ(ఫైల్ ఫొటో)

ఎన్నికలకు మరో ఏడాదే గడువు ఉండగా గుజరాత్​ సీఎం విజయ్​ రూపానీ సడెన్​గా రాజీనామా చేయడం వెనుక ఎన్నికల వ్యూహంలో భాగమని విశ్లేషకులు చెబుతున్నారు. పటేల్ (Patel) సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చే దిశలో కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విజయ్​ రూపానీ కుటుంబ నేపథ్యం (family background) ఏమిటి?.. రాజకీయ జీవితం (Political history).. ఆయన సాధించిన విజయాలు ఒకసారి తెలుసుకుందాం

  • Share this:
    విజయ్​ రూపానీ (Vijay rupani). గుజరాత్ (Gujarat)​కు గత ఐదేళ్లు ముఖ్యమంత్రి (Chief Ministers)గా పనిచేసిన నాయకుడు. అయితే అకస్మాత్తుగా సీఎం పదవికి రాజీనామా (Resign) చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో దేశ రాజకీయాల్లో సంచలనం రేకెత్తించింది. అయితే అధిష్టానం ఆదేశాల మేరకే విజయ్​ రాజీనామా చేసినట్లు రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, ఎన్నికలకు మరో ఏడాదే గడువు ఉండగా సడెన్​గా రాజీనామా చేయడం వెనుక ఎన్నికల వ్యూహంలో భాగమని విశ్లేషకులు చెబుతున్నారు. పటేల్ (Patel) సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చే దిశలో కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విజయ్​ రూపానీ కుటుంబ నేపథ్యం (family background) ఏమిటి?.. రాజకీయ జీవితం (Political history).. ఆయన సాధించిన విజయాలు ఒకసారి తెలుసుకుందాం..

    రాజ్​కోట్​ వెస్ట్​కు..

    విజయ్ రామ్నిక్ లాల్ రూపానీ జననం 1956 ఆగస్టు 2. మయ బెన్ రామ్నిక్ లాల్ రూపానీ దంపతులకు ఏడో సంతానంగా విజయ్​ జన్మించాడు. వీరు మయన్మార్‌లోని యాంగోన్లో బనియా కుటుంబానికి చెందిన వారు. బర్మాలో రాజకీయ అస్థిరత కారణంగా అతని కుటుంబం(Family) 1960 లో రాజ్‌ కోట్‌కు వెళ్లింది. విజయ్ రూపానీ ధర్మేంద్ర సింగ్ జి ఆర్ట్స్ కాలేజీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, సౌరాష్ట్ర విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్​బి చదువును పూర్తి చేశారు. విజయ్ రూపానీ తన తండ్రి స్థాపించిన రసిక్ లాల్ & సన్స్ అనే వాణిజ్య సంస్థలో భాగస్వామిగా ఉన్నాడు. ఆ తరువాత అతను స్టాక్ బ్రోకర్‌గా కూడా పనిచేశాడు.

    ABVP నుంచి..

    విజయ్ రూపానీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) లో విద్యార్థి (Student) కార్యకర్తగా ఉన్నాడు. అలాగే అతను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) లో చేరాడు. ఆ తరువాత 1971 లో జనసంఘ్ లో సభ్యునిగా చేరాడు. భారతీయ జనతా పార్టీ స్థాపించిన నాటి నుంచి పార్టీతో సఖ్యత కలిగి ఉన్నాడు. ఈయన 1978 నుంచి 1981 వరకు ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్ గా ఉన్నాడు. 1987 లో రాజ్‌కోట్ మునిసిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యాడు.

    రూపానీ 1988 నుంచి 1996 వరకు ఆర్‌ఎంసి స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ గా భాద్యతలు నిర్వహించాడు. 1995 లో మళ్లీ ఆర్‌ఎంసికి ఎన్నికయ్యాడు. 1996 నుంచి 1997 వరకు రాజ్‌కోట్ మేయర్‌గా పనిచేశాడు. 1998 లో బీజేపీ గుజరాత్ యూనిట్ ప్రధాన కార్యదర్శి అయ్యాడు. అలాగే చైర్మన్‌గా కూడా పనిచేశాడు. అనంతరం రూపానీ 2006 లో గుజరాత్ టూరిజం ఛైర్మన్‌గా నియమితుడయ్యాడు. 2006 నుంచి 2012 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు 2013 లో బిజెపి గుజరాత్ యూనిట్ ప్రధాన కార్యదర్శిగా, గుజరాత్ మునిసిపల్ ఫైనాన్స్ బోర్డు ఛైర్మన్‌గా పనిచేశారు.

    నవంబర్ 2014 లో ముఖ్యమంత్రి ఆనందీబెన్ పటేల్ (Anandi ben patel) మొదటి క్యాబినెట్ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి లభించింది. ఈయన రవాణా, నీటి సరఫరా, కార్మిక ఇంకా ఉపాధి మంత్రిత్వ శాఖను నిర్వహించారు. 19 ఫిబ్రవరి 2016 న, ఆర్. సి. ఫాల్డు స్థానంలో రూపానీ గుజరాత్ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడయ్యారు. ఫిబ్రవరి 2016 నుంచి ఆగస్టు 2016 వరకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆనందీ బెన్ పటేల్ తరువాత 2016 ఆగస్టు 7 న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు విజయ్​ రూపానీ. అనంతరం 2017లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఇంద్రాణిల్ రాజయగురును ఓడించి రాజకోట్ పశ్చిమ (West Rajkot) నియోజకవర్గం గెలుపొందారు. 2017 డిసెంబర్ 22 న శాసనసభ పార్టీ నాయకుడిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి పదవికి నామినేట్ అయ్యాడు. నాలుగేళ్లు సీఎంగా బాధ్యతలు నిర్వర్తించి అధిష్టానం ఆదేశాల మేరకు సెప్టెంబర్​ 11న రాజీనామా (Resign) చేశారు. మొత్తంగా 2016 ఆగస్టు 7 నుంచి  2021 సెప్టెంబర్​ 11 వరకు గుజరాత్ ముఖ్యమంత్రి (Gujarat Chief Minister)గా పనిచేశాడు.
    Published by:Prabhakar Vaddi
    First published: