Home /News /explained /

DETAILED ANALYSIS ON PM MODI MEETING WITH JAMMU AND KASHMIR ISSUE WITH ALL PARTY LEADERS GH SSR

Explained: Jammu and Kashmir: కశ్మీర్‌కు, ఢిల్లీకి మధ్య దూరం తరిగేనా? ప్రస్తుత పరిస్థితులు ఏం చెబుతున్నాయి?

జమ్మూకశ్మీర్ నేతలతో ప్రధాని మోదీ

జమ్మూకశ్మీర్ నేతలతో ప్రధాని మోదీ

భారత్‌లో జమ్మూ కశ్మీర్ అంశం మరోసారి వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆ ప్రాంత నేతలతో ప్రధాని మోదీ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. అందులో నియోజక వర్గాల పునర్విభజన, శాసన సభ ఎన్నికల నిర్వహణపై చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే చివరిసారిగా ఒక భారత ప్రధాని ఇలా జమ్మూ కశ్మీర్ నేతలతో సమావేశం నిర్వహించి ఒకటిన్నర దశాబ్ధం దాటింది.

ఇంకా చదవండి ...
భారత్‌లో జమ్మూ కశ్మీర్ అంశం మరోసారి వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆ ప్రాంత నేతలతో ప్రధాని మోదీ సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. అందులో నియోజక వర్గాల పునర్విభజన, శాసన సభ ఎన్నికల నిర్వహణపై చర్చలు ఒక కొలిక్కి వచ్చినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే చివరిసారిగా ఒక భారత ప్రధాని ఇలా జమ్మూ కశ్మీర్ నేతలతో సమావేశం నిర్వహించి ఒకటిన్నర దశాబ్ధం దాటింది. గతంలో జనవరి 23, 2004న ఎన్‌డీఏ ప్రభుత్వానికి నాయకత్వం వహించిన అటల్ బిహారీ వాజ్‌పేయి.. కశ్మీరీ వేర్పాటువాద నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేశారు. అంతకు తొమ్మిది నెలల ముందు, వాజ్‌పేయి శ్రీనగర్‌లో తన చారిత్రక ‘ఇన్సానియత్ (హ్యూమనిజం), జమ్‌హూ-రియాత్ (ప్రజాస్వామ్యం), కశ్మీరియత్ (హిందూ-ముస్లిం ఐక్యత)’ ప్రసంగంతో ఆకట్టుకున్నారు.

అయితే గతంలో వాజ్‌పేయీ నిర్వహించిన సమావేశానికి, ప్రస్తుత ప్రధానమంత్రి మోదీ నిర్వహించిన సమావేశానికి తేడా ఉంది. 2019, ఆగస్టు 5న కేంద్రం ఆర్టికల్ 370ను రద్దు చేసి, జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. అనంతరం ఆ ప్రాంత నేతలతో జరిగిన మొదటి రాజకీయ సమావేశం ఇదే కావడం గమనార్హం. ప్రస్తుతానికైతే మోదీ 14 మంది నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశం ఫలప్రదమేనని ఇరు వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జమ్ము కశ్మీర్ రాజకీయాల్లో ఈ సమావేశం ఒక మైలురాయిగా నిలిచిపోయే అవకాశాలు స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది.

* కశ్మీరీ నాయకుల మాట ఏంటి?
రాష్ట్ర విభజన తరువాత.. పూర్వ జమ్మూ కశ్మీర్‌కు ముఖ్యమంత్రులుగా పనిచేసిన ముగ్గురు నేతలను సుమారు 221 రోజుల నుంచి 436 రోజుల వరకు నిర్బంధంలో ఉంచారు. దీంతో స్థానిక అంశాలపై విస్తృత స్థాయిలో స్పందించే అవకాశాన్ని వారు కోల్పోయారు. ఆ తరువాత క్రమంగా వారిపై ఆంక్షలను ఎత్తివేశారు. దీంతో ప్రస్తుత సమావేశం వారికి తమ నియోజకవర్గాల్లో ప్రభావం చూపే అవకాశాన్ని కల్పిస్తుందని కశ్మీరీ పార్టీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఆ ప్రాంత భవిష్యత్తు రాజకీయ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి.. అక్కడి రాజకీయ పార్టీలన్నీ కేంద్రంతో కలిసి పని చేయాల్సి ఉంటుంది.

తాజా సమావేశంలో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా, జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోబాల్ వంటి ప్రముఖులతో జమ్మూ కశ్మీర్ నాయకులు పాల్గొన్నారు. మీటింగ్‌లో వీరందరూ వివిధ డిమాండ్లను ప్రధాని ముందుంచారు. అయితే పరోక్షంగా అందరూ ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ గురించి ప్రస్తావించారు. అయితే ఇప్పటికే రద్దు చేసిన ప్రత్యేక హోదాను, ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వం మళ్లీ పునరుద్ధరించడం అసంభవమని వారికి తెలియంది కాదు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై అక్కడి నేతల స్పందన కూడా మారినట్లు తెలుస్తోంది.

జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2019 రాజ్యాంగ ప్రామాణికతపై సుప్రీంకోర్టులో వాదనలు నడుస్తున్నాయి. అందువల్ల ఆర్టికల్ 370ను పునరుద్ధరించాలని డిమాండ్ చేయడం కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని అభిప్రాయపడ్డారు పీడీపీ మాజీ నాయకుడు ముజాఫర్ బీగ్. ఆర్టికల్ 370ని తిరిగి పునరుద్ధరిస్తారని వాగ్దానం చేయడం రాజకీయ వంచన అవుతుందని తెలిపారు సమావేశంలో పాల్గొన్న మరో నేత. ప్రత్యేక ప్రతిపత్తిని బీజేపీ ప్రభుత్వం తిరిగి ఇస్తుందని ఆశించట్లేదన్నారు. అయితే ఈ విషయంపై సుప్రీంకోర్టులో పోరాడుతామని చెప్పారు. సమావేశంలో పాల్గొన్న వారు చెప్పేవన్నీ ప్రధాని విన్నారని, ఎవరూ ఎవరితో విభేదించలేదని వార్తలు వస్తున్నాయి. ముందు డీలిమిటేషన్, ఆ తరువాత ఎన్నికల నిర్వహణకు ప్రధాని హామీ ఇవ్వడంతో.. కశ్మీర్ భవిష్యత్తుకు, అభివృద్ధికి ముందడుగు పడిందచి తెలిపారు మరో నాయకుడు.

* పునర్విభజనకు ఏకాభిప్రాయం వస్తుందా?
డీలిమిటేషన్ ప్రక్రియను ప్రశ్నిస్తున్నారు జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. దేశవ్యాప్తంగా ఒకేసారి చేయాల్సిన నియోజకవర్గాల పునర్విభజనను.. ప్రస్తుతం కేవలం జమ్మూ కశ్మీర్ కోసం ఒంటరిగా చేపట్టడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. డీలిమిటేషన్ కమిషన్‌ ఫిబ్రవరి 18న నిర్వహించిన సమావేశానికి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నుంచి ఎవరూ హాజరు కాలేదు. ఈ విషయంపై పార్టీ అధినేత ఫరూక్ అబ్దుల్లా సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటారని అప్పట్లో ఒమర్ ప్రకటించారు. ప్రస్తుతం చర్చలు ఫలప్రదంగా జరిగినందువల్ల.. ఈ కమిషన్ త్వరలో అన్ని పార్టీలతో విస్తృత సంప్రదింపులు జరిపి, అభిప్రాయాలను తెలుసుకుంటుందని భావిస్తున్నారు. పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయకుడు సాజాద్ లోన్ సైతం సమావేశం అనంతరం సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరం కలిసి కశ్మీర్ భవిష్యత్తుకు ఉపయోగపడే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని సాజిద్ తెలిపారు.

* భవిష్యత్తు ఏంటి?
ప్రస్తుత సమావేశంతో కేంద్రం పైచేయి సాధినట్లు కనిపిస్తోంది. ఇది దేశీయ, అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. అయితే లోయలోని ప్రధాన రాజకీయ పార్టీలు ఆశతో, కొంత ఓదార్పుతో తిరిగి వెళ్లాయి. ఈ నేపథ్యంలో కేంద్రం వారితో బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. నియోజక వర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభమైన తర్వాత.. కేంద్రం తీసుకునే నిర్ణయాలు, ఎన్నికలపై విధి విధానాలను బట్టి కశ్మీర్ పార్టీలు స్పందించే అవకాశం ఉంది. అందువల్ల కశ్మీర్ విషయంలో అన్ని వ్యవహారాలకు డీలిమిటేషన్ ప్రక్రియ మొదటి పరీక్షగా నిలిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Published by:Sambasiva Reddy
First published:

Tags: Article 370, Jammu and Kashmir, Pm modi, Srinagar

తదుపరి వార్తలు