హోమ్ /వార్తలు /Explained /

Delhi University: ఢిల్లీ యూనివర్సిటీ కీలక నిర్ణయం.. నేషనల్​ ఎడ్యుకేషన్​ పాలసీకి అనుగుణంగా కొత్త కోర్సులు, సీట్ల పెంపు

Delhi University: ఢిల్లీ యూనివర్సిటీ కీలక నిర్ణయం.. నేషనల్​ ఎడ్యుకేషన్​ పాలసీకి అనుగుణంగా కొత్త కోర్సులు, సీట్ల పెంపు

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

తాజాగా ప్రతిష్టాత్మక ఢిల్లీ యూనివర్సిటీ అండర్ గ్రాడ్యుయేట్(యూజీ), పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) ప్రోగ్రామ్స్​లో కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP)–2020కి అనుగుణంగా ఈ కొత్త కోర్సులను ప్రారంభించింది.

ఇంకా చదవండి ...

మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఇండస్ట్రీ అవసరాలను దృష్టిలో పెట్టుకొని విద్యా సంస్థలు కొత్త కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నాయి. తాజాగా ప్రతిష్టాత్మక ఢిల్లీ యూనివర్సిటీ (Delhi University) అండర్ గ్రాడ్యుయేట్(UG), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG) ప్రోగ్రామ్స్​లో కొత్త కోర్సులను ప్రవేశపెట్టింది. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (NEP)–2020కి అనుగుణంగా ఈ కొత్త కోర్సులను ప్రారంభించింది. అంతేకాదు, ఈ కోర్సుల ద్వారా వర్సిటీలో సీట్ల సంఖ్యను పెంచి మరింత మంది విద్యార్థులకు వసతి కల్పించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా ఢిల్లీ వర్సిటీకి అనుబంధంగా ఉన్న హన్సరాజ్ కళాశాల బీఏ కోర్సు సీట్లను 50 నుంచి 80 సీట్లకు పెంచనుంది.

ఈ కాలేజీ బీఏ (ఆనర్స్) జర్నలిజం అండ్​ మాస్ కమ్యూనికేషన్, BA (ఆనర్స్) మ్యూజిక్‌లో 30 సీట్ల చొప్పున రెండు కొత్త కోర్సులను కూడా ప్రవేశపెట్టనుంది. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన జాకీర్ హుస్సేన్ కళాశాల కూడా పలు కోర్సుల్లో 15 నుంచి 40 సీట్లను పెంచనుంది. ఇలా అన్ని కోర్సులకు కలిపి 600 సీట్లు పెంచడం ద్వారా ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని మొత్తం సీట్ల సంఖ్య 69,554 కు పెరిగే అవకాశం ఉంది.

దయాళ్ సింగ్ కాలేజ్, శ్యామ్ లాల్ కాలేజ్, జానకీ దేవి మెమోరియల్ కాలేజ్, భారతి కాలేజ్ వంటివి కూడా 2021–22 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సు ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్నాయి. రామానుజన్ కాలేజ్ ఆపరేషనల్ రీసెర్చ్ కోర్సులో బీఎస్సీని ప్రారంభించాలని యోచిస్తోంది. దేశబంధు కళాశాల, భారతి కళాశాల, అదితి మహా విద్యాలయం ఒక్కొక్కటి 40 సీట్లతో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సులను ప్రవేశపెట్టనున్నాయి. వివేకానంద కళాశాల 12 సీట్లతో ఎంఏ ఇంగ్లీష్‌ కోర్సుని ప్రారంబించింది. పీజీడీఏవీ కళాశాల బీఏ ఇంగ్లీష్​లో 40, ఎంఏ హిందీలో 16 సీట్లను కొత్తగా ప్రారంభించనుంది.

కొత్త సీట్లకు స్టాండింగ్​ కమిటీ ఆమోదం..

ఈ కొత్త కోర్సులు, సీట్లను ఇప్పటికే ఢిల్లీ యూనివర్సిటీ స్టాండింగ్ కమిటీ ఆమోదించింది. అయితే యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నుంచి ఆమోదం రావాల్సి ఉంది. ప్రస్తుతం డీయూకి అనుబంధంగా మొత్తం 63 కళాశాలలు ఉన్నాయి. వీటిలో యూజీ కోర్సులకు మొత్తం 70 వేల సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది యూజీ ప్రవేశాలకు మొత్తం 4,38,696 మంది అభ్యర్థులు రిజిస్ట్రేషన్​ చేసుకున్నారు. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 31తో ముగిసింది. మొదటి మెరిట్ జాబితా అక్టోబర్ 1 నాటికి విడుదల కానుంది.

First published:

Tags: Students

ఉత్తమ కథలు