DELHI COVID RESTRICTIONS DECODING YELLOW AMBER ORANGE AND RED ALERTS GH VB
Delhi Covid Restrictions: ఢిల్లీలో ఎల్లో అలర్ట్ విధించిన ప్రభుత్వం.. ఈ అలర్ట్‌లు ఎన్ని రకాలుగా ఉంటాయంటే..
ప్రతీకాత్మక చిత్రం
గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) కింద తాజాగా ఢిల్లీలో ఎల్లో అలర్ట్ ప్రకటించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఈ నేపథ్యంలో ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం.
దేశంలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్(Omicron Varient) కారణంగా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ ఎక్కువ అవుతోంది. ఢిల్లీలో ఊహించని విధంగా పాజిటివ్ కేసుల(Positive Cases) వృద్ధి కనిపించడంతో అక్కడి ప్రభుత్వం ఆంక్షలను విధించింది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) కింద తాజాగా ఢిల్లీ(Delhi)లో ఎల్లో అలర్ట్(Yello Alert) ప్రకటించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Chief Minister Aravind). ఈ నేపథ్యంలో ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్(Red Alert) అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం కోవిడ్ కేసుల పెరుగుదల నేపథ్యంలో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (DDMA) మార్గదర్శకాలను జారీ చేసింది. కేసుల తీవ్రత ఆధారంగా వివిధ స్థాయిలలో హెచ్చరికలు విధించేందుకు సిద్ధమైంది. ఢిల్లీలో కరోనా కేసులు ఎక్కువగా నమోదైతే పరిస్థితి దిగజారే అవకాశం ఉందని ప్రభుత్వం భావించింది.
దీంతో ప్రస్తుతానికి లెవల్-1 ఆంక్షల కింద ఎల్లో అలర్ట్ రిస్ట్రిక్షన్స్ విధించింది. కోవిడ్ కేసులు 1 శాతాన్ని మించితే లెవల్ 2 అలర్ట్ లేదా అంబర్ అలర్ట్ విధిస్తారు. పాజిటివిటీ రేటు 2% మించితే లెవల్-3 కింద ఆరెంజ్ అలర్ట్, 5% కంటే ఎక్కువగా నమోదైతే లెవల్ 4 కింద రెడ్ అలర్ట్ జారీ చేస్తారు.
ఈ రిస్ట్రిక్షన్స్ మొత్తం నాలుగు స్థాయిల్లో ఉంటాయి. అవేంటంటే..
1. ఎల్లో అలర్ట్
ఎల్లో అలర్ట్ రిస్ట్రిక్షన్స్ ప్రకారం నిత్యావసర వస్తువులు, సేవల దుకాణాలు, సంస్థలు, మాల్స్ వంటివన్నీ బేసి-సరి సూత్రం ఆధారంగా ఓపెన్ అవుతాయి. ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు వీటిని ఓపెన్ చేసుకోవచ్చు. పెళ్లి, అంత్యక్రియలకు 20 మంది హాజరు కావచ్చు. అయితే సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన సమావేశాలపై నిషేధం ఉంటుంది. అలాగే ఢిల్లీ మెట్రో కూడా 50% సీటింగ్ కెపాసిటీతో నడుస్తుంది. ఆటో-రిక్షాలు, క్యాబ్‌లలో ఇద్దరు ప్రయాణికులు మాత్రమే వెళ్లాలి. బస్సుల్లో కూడా సీటింగ్ కెపాసిటీ 50% మించకూడదు.
2. అంబర్ అలర్ట్
ఈ లెవల్లో నాన్-ఎసెన్షియల్ వస్తువులు, సేవల దుకాణాలు, సంస్థలు, మాల్స్ అన్నీ బేసి-సరి ఫార్ములా ఆధారంగా, ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓపెన్ అవుతాయి. రెస్టారెంట్లు, బార్లు మూసివేసి ఉంచాలి. అయితే హోమ్ డెలివరీ లేదా టేక్అవే సదుపాయాలు కొనసాగుతాయి. ప్రైవేట్ ఆఫీస్‌లు 50% సిబ్బందితో, ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేయవచ్చు.
అంబర్ అలర్ట్ ఆంక్షల ప్రకారం పాఠశాలలు, కళాశాలలు, క్రీడా సముదాయాలు, సినిమా హాళ్లు, స్పాలు, ఫంక్షన్ హాళ్లు.. వంటి వాటిని మూసివేస్తారు. ఢిల్లీ మెట్రో 30% సీటింగ్ కెపాసిటీతో నడుస్తుంది. అయితే ఆటో-రిక్షాలు, క్యాబ్‌లు ఇద్దరు ప్రయాణికులను తీసుకెళ్లవచ్చు. మినహాయింపు పొందిన కేటగిరీ ప్రయాణికులతో 50% సామర్థ్యంతో బస్సులు తిరుగుతాయి.
3. ఆరెంజ్ అలర్ట్
ఆరెంజ్ అలర్ట్ సమయంలో కార్మికులు ఆన్సైట్లో నివసించే సందర్భాల్లో మాత్రమే కన్స్ట్రక్షన్ యాక్టివిటీలకు అనుమతి ఉంటుంది. దుకాణాలు, సంస్థలను మూసివేస్తారు. అయితే రెసిడెన్షియల్ ఏరియాల్లో దుకాణాలకు ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అనుమతి ఉంటుంది. వివాహాలు, అంత్యక్రియలకు 15 మంది హాజరు కావచ్చు. సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలు, సమావేశాలపై నిషేధం ఉంటుంది.
మాల్స్, వీక్లీ మార్కెట్లు, రెస్టారెంట్లు, బార్లు, సినిమా హాళ్లు, పాఠశాలలు, కళాశాలలు, క్రీడా సముదాయాలు అన్నింటినీ మూసివేస్తారు. ఎసెన్షియల్ కేటగిరీ కిందకు వచ్చే ప్రైవేట్ ఆఫీస్‌లు ఓపెన్ చేసుకోవచ్చు. ఢిల్లీ మెట్రోను మూసివేస్తారు. అయితే ఆటో-రిక్షాలు, క్యాబ్‌లు ఇద్దరు ప్రయాణికులను తీసుకెళ్లవచ్చు. మినహాయింపు పొందిన కేటగిరీ ప్రయాణికులతో 50% సామర్థ్యంతో బస్సులు తిరుగుతాయి.
4. రెడ్ అలర్ట్
ఇది అన్ని హెచ్చరికలలో అత్యంత కఠినమైనది. రెడ్ అలర్డ్ విధించినప్పుడు కార్మికులు ఆన్సైట్లో నివసించే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్‌కు మాత్రమే అనుమతి ఉంటుంది. అవసరమైన వస్తువుల తయారీకి అనుమతి ఉంటుంది. నివాస ప్రాంతాలతో సహా అన్ని దుకాణాలను మూసి ఉంచాలి. మాల్స్, పాఠశాలలు, కళాశాలలు, క్రీడా సముదాయాలు, పార్కులు, సినిమా హాళ్లు, స్పాలు, ఫంక్షన్ హాళ్లను మూసివేస్తారు.
రెస్టారెంట్లు, బార్ల నుంచి టేక్అవే అనుమతి ఉంటుంది. వివాహాలు, అంత్యక్రియలకు 15 మంది హాజరు కావచ్చు. సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన సమావేశాలపై నిషేధం కొనసాగుతుంది. ఢిల్లీ మెట్రోను మూసివేస్తారు. అయితే ఆటో-రిక్షాలు, క్యాబ్‌లలో ఇద్దరు ప్రయాణికులు ప్రయాణించవచ్చు. మినహాయింపు పొందిన కేటగిరీ ప్రయాణికులతో 50% సామర్థ్యంతో బస్సులు తిరుగుతాయి.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.