D2-Dengue: ప్రమాదకరంగా మారుతున్న డీ2 డెంగ్యూ స్ట్రెయిన్‌.. విజృంభిస్తోన్న జ్వరాలు.. లక్షణాలివే..

ప్రతీకాత్మక చిత్రం

D2-Dengue: కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో ఎంతో మంది ప్రాణాలను బలిగొంది. మూడో వేవ్ కూడా త్వరలోనే ప్రారంభమవుతుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వైరస్ సంక్షోభంతో అతలాకుతలం అవుతున్న భారత్‌లో తాజాగా డెంగ్యూ వైరస్ విజృంభిస్తోంది.

  • Share this:
కరోనా(Corona) మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో ఎంతో మంది ప్రాణాలను బలిగొంది. మూడో వేవ్ (Third Wave) కూడా త్వరలోనే ప్రారంభమవుతుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వైరస్ సంక్షోభంతో అతలాకుతలం అవుతున్న భారత్‌లో తాజాగా డెంగ్యూ వైరస్ (Dengue Virus) విజృంభిస్తోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో(North India) పలుచోట్ల డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. ఉత్తరప్రదేశ్ పశ్చిమ ప్రాంతంలో ఈ వ్యాధి ప్రమాదకరంగా విజృంభిస్తోంది. మరణాలు కూడా సంభవించాయి. ఇందుకు కారణం D2 డెంగ్యూ స్ట్రెయిన్ అని అధికారులు చెబుతున్నారు. డెంగ్యూ వైరస్‌లో ఉన్న నాలుగు విభిన్న స్ట్రెయిన్స్‌లో ఇది కూడా ఒకటి.

Womens: కరోనా వ్యాక్సిన్​ వల్ల మహిళల్లో పీరియడ్స్‌పై ప్రభావం పడుతుందా..? పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..


D2 డెంగ్యూ అంటే?
భారత్‌లో డెంగ్యూ అనగానే దోమల ద్వారా వచ్చే జ్వరం అని అందరూ భావిస్తారు. వాస్తవానికి డెంగ్యూ వైరస్‌ను దోమలు వ్యాపింపజేస్తాయి. నేషనల్ డిసీజ్ కంట్రోల్ (NDC), ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా విడుదల చేసిన వ్యాధి నివారణ, నియంత్రణ మార్గదర్శకాలు దీని గురించి వివరించాయి. ఇది అత్యంత ముఖ్యమైన, ప్రమాదకరమైన వైరల్ వ్యాధి అని, ఈ ఇన్‌ఫెక్షన్‌ అంతర్జాతీయ ప్రజారోగ్య సమస్య అని వర్ణించాయి. ఈ వ్యాధి ఎక్కువగా ఉష్ణ మండల వాతావరణంలో కనిపిస్తుంది. పట్టణ, సెమీ-అర్బన్ ప్రాంతాల్లో అధికంగా ఉంటుంది. "డెంగ్యూ వైరస్ అనేక అంటురోగాలకు కారణమవుతుంది. బాధితుల్లో చాలా వరకు తేలికపాటి లక్షణాలు మాత్రమే కనిపిస్తాయి. తీవ్రమైతే డెంగ్యూ ప్రాణాంతక సమస్యగా మారుతుంది" అని డబ్ల్యూహెచ్ఓ స్పష్టం చేసింది.

Children Fight Covid-19: పిల్లలపై కరోనాప్రభావం ఎందుకు తక్కువ?.. మిస్టరీని చేధించిన పరిశోధకులు..


డెంగ్యూ వైరస్‌ను డెన్వీ(DENV)గా పిలుస్తారు. వాస్తవానికి ఇది నాలుగు రూపాల్లో ఉంటుంది. డెన్వీ-1, డెన్వీ-2, డెన్వీ-3, డెన్వీ-4 అనే నాలుగు రూపాల్లో వ్యక్తికి సంక్రమిస్తుంది. వ్యాధి తీవ్రతను బట్టి డెంగ్యూను ఇలా వర్గీకరించారు. ఒకసారి ఒక స్ట్రెయిన్ సోకిన వారికి, మరోసారి వేరే స్ట్రెయిన్ సోకే అవకాశం సైతం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో నమోదవుతున్న డెంగ్యూ కేసులు డెన్వీ-2 లేదా డీ2 వేరియంట్ ద్వారా వస్తున్నాయి. ఇది వ్యాధి తీవ్రతకు, మరణాల పెరుగుదలకు కారణమైంది. ఈ స్ట్రెయిన్ కారణంగా జులైలో ఒడిషాలో కూడా కేసులు పెరిగాయి.

డీ2 డెంగ్యూ ప్రమాదకరమా?
డెంగ్యూ పరిధిని విస్తృతంగా ఉంటుంది. కొన్నిసార్లు తీవ్రమైన ఫ్లూ లాంటి లక్షణాలు బారిన పడినట్లు కూడా ప్రజలకు తెలియకపోవచ్చు. కొంతమందికి తీవ్రమైన డెంగ్యూ వచ్చే అవకాశముంది. అయితే అలాంటి సందర్భాలు చాలా తక్కువ. తీవ్రమైన డెంగ్యూ ఇన్‌ఫెక్షన్‌ను 1950ల్లో ఫిలిప్పైన్స్, థాయ్ లాండ్ దేశాల్లో గుర్తించారు. అప్పుడు మరణాల శాతం ఎక్కువగా నమోదైంది. సరైన చికిత్స అందించకపోతే బాధితులు చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం తీవ్రమైన డెంగ్యూ కేసులు దాదాపు అన్ని ఆసియా, లాటిన్ అమెరికా దేశాల్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పిల్లలు, పెద్దల్లో మరణ ప్రమాదాలను పెంచింది. డీ2 స్ట్రెయిన్‌ కూడా తీవ్రమైన డెంగ్యూ వ్యాధికి కారణమవుతోంది.

Ig Nobel Prizes: సెక్స్ చేస్తే ముక్కు ఉపశమనంగా ఉంటుందని కనుక్కున్నారు.. నోబెల్ ప్రైజ్ కొట్టేశారు..


డీ2 డెంగ్యూ లక్షణాలు ఏంటి?
డెంగ్యూలో ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇవి 2 నుంచి 7 రోజుల పాటు కొనసాగుతాయని డబ్ల్యూహెచ్ఓ చెప్పింది. అయితే సాధారణంగా వైరస్ ఇంక్యుబేషన్ పిరియడ్ 4 నుంచి 10 రోజులు ఉంటుంది. క్లాసిక్ డెంగ్యూ జ్వరం సోకిన వారికి తలనొప్పి, వికారం, వాంతులు, వాపు, గ్రంథులు, కండరాల నొప్పులు, దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. డీ2 వంటి తీవ్రమైన డెంగ్యూ లక్షణాల దగ్గరకొస్తే.. బాధితులు కొంతకాలం తర్వాత కోలుకుంటున్నట్లు కనిపిస్తాడు. కానీ 3 నుంచి 7 రోజుల తర్వాత పరిస్థితి క్లిష్టంగా మారుతుంది. శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. చిగుళ్ల నుంచి రక్తస్రావం, రక్తం వాంతులు, వేగవంతమైన శ్వాస, అలసట లాంటి లక్షణాలు వీరిలో ప్రమాదకరంగా మారుతాయి. అంతేకాకుండా ప్లాస్మా లీకేజ్, తీవ్రమైన రక్తస్రావం ఏర్పడి పరిస్థితి చేజారిపోయే దశకు చేరుకుంటారు.

Protect From Dengue: డెంగీ మీ దాకా రాకుండా ఉండాలంటే ఇలా చేయండి చాలు.. మీరు సేఫ్..


దీనికి చికిత్స ఉందా?
డెంగ్యూకు వ్యాక్సిన్లు లేదా నిర్దిష్ట చికిత్సలు లేవు. రోగుల లక్షణాలపై చికిత్స ఆధారపడి ఉంటుంది. అందువల్ల లక్షణాలు కనిపించిన వెంటనే బాధితులు వైద్యుల సలహా తీసుకోవాలి. విశ్రాంతి తీసుకోవాలి. ఆహారం విషయంలో శ్రద్ధ పెట్టాలి. లిక్విడ్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి. జ్వరం, కీళ్ల నొప్పులు తగ్గించడానికి పారాసెట్మాల్ తీసుకోవచ్చు. అయితే ఆస్పిరిన్ లేదా ఇబుప్రొఫెన్ మందులు తీసుకోకూడదు. ఇవి రక్తస్రావం ప్రమాదాన్ని పెంచుతాయని డబ్ల్యూహెచ్ఓ సలహా ఇచ్చింది. సరైన వైద్య సంరక్షణ తీసుకుంటే డెంగ్యూ నుంచి బయటపడవచ్చు. మరణాల రేటు ఒక శాతం కంటే తక్కువగా ఉన్నప్పటికీ ఈ వ్యాధిని తేలికగా తీసుకోకూడదు.
Published by:Veera Babu
First published: