Home /News /explained /

CUBA IS GIVING COVID 19 VACCINE TO TWO YEAR OLD HERE IS THE REASON AK GH

Explained: రెండేళ్ల పిల్లలకు కరోనా వ్యాక్సిన్ .. ఆ దేశం తొందరపడుతోందా?.. ఇతర దేశాల ఏం చెబుతున్నాయి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రెండేళ్ల చిన్నారులకు వ్యాక్సిన్లు ఇచ్చేందుకు క్యూబా ఎందుకు తొందర పడుతోంది? పిల్లలకు వ్యాక్సిన్​ వేసేందుకుమిగతాదేశాలు ఏం చేస్తున్నాయి? వంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

క్యూబా.. కరేబియన్‌ దీవుల్లో ఉండే ఒక చిన్న కమ్యూనిస్ట్ దేశం. ప్రకృతి అందాలతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న ఈ దేశంలో కోటికి పైగా ప్రజలు నివసిస్తున్నారు. కరోనా సమయంలో క్యూబా ఆహారం, మందుల కొరతతో అతలాకుతలమైంది. ఈ క్రమంలో ఈ చిన్న దేశం సొంతంగా కోవిడ్ -19 వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడం విశేషం. అయితే సోమవారం నుంచి క్యూబా ప్రభుత్వం రెండేళ్ల చిన్నారులకు సైతం టీకా కార్యక్రమం ప్రారంభించింది. దాంతో ఇది రెండేళ్ల చిన్నారులకు టీకాలు వేసిన తొలి దేశంగా రికార్డు సృష్టించింది. ప్రస్తుతం క్యూబాలో పిల్లలు, కౌమారదశలో ఉన్నవారు అధిక సంఖ్యలో కోవిడ్-19 బారినపడుతున్నారు. వారంతా కూడా స్వల్ప లక్షణాలతోనే బాధపడుతున్నారు. ఈ క్రమంలో రెండేళ్ల చిన్నారులకు వ్యాక్సిన్లు ఇచ్చేందుకు క్యూబా ఎందుకు తొందర పడుతోంది? పిల్లలకు వ్యాక్సిన్​ వేసేందుకుమిగతాదేశాలు ఏం చేస్తున్నాయి? వంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

పిల్లల కోసం క్యూబా ఏ వ్యాక్సిన్ ఉపయోగిస్తుంది?
సోబెరానా -2 (Soberana-2), అబ్దాలా (Abdala) అనే రెండు దేశీయ టీకాలను క్యూబా వాడుతోంది. గత వారం 2-18 ఏళ్ల పిల్లల కోసం సోబెరానా -2 వ్యాక్సిన్ అత్యవసర వినియోగాన్ని ఆమోదించినట్లు దేశంలోని డ్రగ్స్ వాచ్‌డాగ్, మెడిసిన్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (సెక్మెడ్) ప్రకటించింది. సోబెరానా -2 టీకాను రెండు డోసులుగా ఇస్తే... అబ్దాలా టీకాను మూడు డోసులుగా పెద్దలకు ఇస్తారు. ఈ దేశంలో తయారైన టీకాలు అన్నీ కూడా ప్రోటీన్ సబ్యూనిట్ టీకాలే కావడం విశేషం. ఈ టీకాల్లో కరోనావైరస్ ఉండదు. వీటిలో మానవ కణాలపై దాడి చేసే కరోనా ఉపరితల స్పైక్ ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. స్పైక్ ప్రోటీన్ కోసం జన్యు సమాచారాన్ని సేకరించి, ఆపై బ్యాక్టీరియా/ఈస్ట్ కణాలలోకి చొప్పించి.. తరువాత స్పైక్ ప్రోటీన్లను సేకరించి ఈ టీకాలను తయారు చేస్తారు. ఇవి చాలా సురక్షితం కానీ తక్కువ కాలమే కరోనా నుంచి రక్షణ కల్పిస్తాయి. క్యూబా వ్యాక్సిన్లను దాని దేశీయ ఔషధాల నియంత్రణ సంస్థ ఆమోదించింది కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆమోదించలేదు.

పిల్లలకు టీకాలు వేయడానికి క్యూబా ఎందుకు తొందరపడుతోంది?
క్యూబాలో జూలై నెల ద్వితీయార్థం నుంచి ప్రతిరోజూ 6,000కి పైగా కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం అక్కడ రోజువారీ కేసులు 7 వేలుగా నమోదవుతున్నాయి. ప్రపంచ దేశాల్లోని ఒక మిలియన్ ప్రజలతో పోల్చుకుంటే.. క్యూబాలో పాజిటివ్ రేటు చాలా ఎక్కువగా ఉంది. దాంతో పిల్లల కోసం టీకా అందుబాటులోకి తెచ్చిన క్యూబా అధికారులు.. త్వరలోనే 90 శాతం జనాభాకి టీకాలు ఇవ్వనున్నామని తెలిపారు. టూరిస్ట్ సీజన్ నవంబర్ నాటికి డెల్టా వేరియంట్ వ్యాప్తిని పూర్తిస్థాయిలో అరికట్టాలని అక్కడి అధికారులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. క్యూబాలో ఇంటర్నెట్ సదుపాయాలు ఉండవు కాబట్టి పిల్లలు పాఠశాలకు వెళ్లడం అనివార్యంగా మారింది. దాంతో పిల్లలకు టీకాలు వేసేందుకు క్యూబా ముమ్మరం చేసింది.

KTR: టీఆర్ఎస్ నేతలకు గుడ్ న్యూస్ చెప్పిన కేటీఆర్.. త్వరలోనే వారికి పదవులు..

kiara advani: కియారా అద్వానీలా ఉన్న యువతి.. అట్రాక్ట్ అవుతున్న ఫ్యాన్స్.. ఇంతకీ ఎవరామె..

పిల్లలు కోవిడ్ -19 టీకాలు కచ్చితంగా తీసుకోవాలా?
ఏడు దేశాల వ్యాప్తంగా పిల్లలపై చేసిన అధ్యయనం ప్రకారం, కరోనాతో చనిపోయిన 10 లక్షల మందిలో ఇద్దరు పిల్లల కంటే తక్కువే ఉన్నారు. ఈ స్టడీ లాన్సెట్ జర్నల్ లో పబ్లిష్ చేశారు. కరోనా ముప్పు తక్కువగా ఉన్నప్పటికీ పిల్లలకి వ్యాక్సిన్ ఇవ్వడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. డబ్ల్యూహెచ్‌ఓ మాత్రం పిల్లలకు ఇప్పుడే టీకాలు ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతోంది. కరోనా నుంచి ప్రమాదం ఉంటే తప్ప పిల్లలకు వ్యాక్సిన్లు వేయాల్సిన అవసరం లేదని జులైలో వ్యాక్సిన్ అడ్వైజరీలో వెల్లడించింది.

ఇతర దేశాలు ఏం చేస్తున్నాయి?
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు కౌమారదశ (adolescents) బాలబాలికలకు టీకాలు వేయడం ప్రారంభించాయి. కానీ రెండేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఏ దేశం కూడా టీకాలు ఇవ్వడంలేదు. ఫ్రాన్స్, నెదర్లాండ్స్, జర్మనీ, ఇటలీ తదితర దేశాలు 12 ఏళ్లు పైబడిన పిల్లలకు టీకాలు అందిస్తుండగా.. 12 ఏళ్లు కంటే ఎక్కువగా వయసున్న వ్యక్తులు కూడా టీకా తీసుకోవాల్సిందిగా అమెరికా కోరుతోంది. ఇక ఇండియా 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి టీకాలు వేయలేదు. జైడస్‌ క్యాడిలా, భారత్ బయోటెక్ పిల్లల టీకాలపై పరీక్షలను నిర్వహిస్తున్నాయి. వచ్చే ఏడాదిలో ఈ టీకాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Corona Vaccine, Covid vaccine, Cuba

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు