Home /News /explained /

CRYPTOCURRENCY TO ATTRACT 30 TAX SAYS BUDGET 2022 NEW CRYPTO INCOME TAX RULE EXPLAINED GH VB

Explained: బడ్జెట్‌లో క్రిప్టో ఆస్తులపై 30% పన్ను.. అమల్లోకి రానున్న కొత్త క్రిప్టో ఇన్‌కమ్ ట్యాక్స్.. ఆ వివరాలిలా..

నిర్మలా సీతారామన్

నిర్మలా సీతారామన్

డిజిటల్‌ కరెన్సీలపై దేశంలో ఎలాంటి పన్ను ఉంటుందో కేంద్ర బడ్జెట్‌ 2022 స్పష్టత ఇచ్చింది. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా వీటిపై విధించే ట్యాక్స్‌పై కీలక ప్రకటన చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.

గత కొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్లు(Crypto Investments) భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే ఇవి ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారే ప్రమాదం ఉండటంతో క్రిప్టో ఆస్తులు, పెట్టుబడులపై నియంత్రణ విధించాలని కేంద్ర ప్రభుత్వం(Central Government) నిర్ణయించింది. దీనికి సంబంధించి కొత్త చట్టాన్ని సైతం తీసుకురానున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో డిజిటల్‌ కరెన్సీలపై(Digital Currency) దేశంలో ఎలాంటి పన్ను ఉంటుందో కేంద్ర బడ్జెట్‌ 2022 స్పష్టత ఇచ్చింది. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా వీటిపై విధించే ట్యాక్స్‌పై కీలక ప్రకటన చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. గడిచిన కొన్ని సంవత్సరాలుగా భారత్‌లో క్రిప్టోకరెన్సీ బాగా పాపులారిటీ సంపాదించింది. 10 కోట్ల మంది క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారులతో డిజిటల్‌ టోకెన్లలో అతి పెద్ద మార్కెట్లలో ఒకటిగా ఉంది భారత్‌. వర్చువల్‌ కరెన్సీ పెట్టుబడులపై పన్ను నిబంధనలు రూపొందించాలని చాలా కాలంగా పెట్టుబడిదారులు కోరుతున్నారు.

Budget 2022: బడ్జెట్ 2022 హైలెట్స్​.. ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి..? వేటి ధరలు తగ్గుతాయంటే..?


దానికి సంబంధించిన కొత్త నిబంధనలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. వర్చువల్‌ లేదా క్రిప్టోకరెన్సీ ఆస్తిని బదిలీ చేస్తే 30 శాతం పన్ను ఉంటుందని 2022 బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించింది. వాటి కొనుగోలు ఖర్చు మినహా లావాదేవీల్లో నష్టాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడం వంటి వాటిని అనుమతించమని తెలిపింది.

ట్యాక్స్ కోసం కొత్త సెక్షన్
వర్చువల్ క్రిప్టోలపై ట్యాక్స్‌కు సంబంధించి సెక్షన్‌ 115BBHను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఒక అసెస్సీ మొత్తం ఆదాయంలో ఏదైనా వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తి బదలాయింపు ద్వారా లభించిన ఆదాయం కూడా ఉంటే.. ఆ వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తిపై విధించే 30% ట్యాక్స్‌తో పాటు ఆ వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తి బదిలీని మినహాయిస్తే అస్సెస్సీ చెల్లించాల్సిన మొత్తం ఆదాయం ప్రకారం ట్యాక్స్ లెక్కిస్తారు.

ఈ గందరగోళం ఎలా ఉన్నా ఊహాజనిత ఆదాయం తరహాలో డిజిటల్‌ కరెన్సీపై నికరంగా 30 శాతం పన్ను ఉంటుంది. అంతే కాదు క్రిప్టో ఆస్తుల బదిలీపై ఒక పరిమితి తర్వాత 1 శాతం లెక్కన TDS కూడా ఉంటుంది. క్రిప్టో ఆస్తులను బహుమతిగా అందుకుంటే, అందుకునే వారు వాటిపై పన్ను చెల్లించాలి. ఈ నిబంధన ఏప్రిల్‌ 1, 2023 నుంచి వర్తిస్తుంది కాబట్టి 2023-24, ఆ తర్వాతి అసెస్‌మెంట్‌ సంవత్సరాలకు కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయి.

Union Budget 2022: దేశంలోని అన్ని ప్రాంతాలకు 400 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు

కంపెనీల స్పందన ఎలా ఉంది?
పన్నుపై స్పష్టత ఇవ్వడాన్ని డిజిటల్‌ కరెన్సీలో లావాదేవీలు జరిపే సంస్థలు స్వాగతిస్తున్నాయి. సృజనాత్మక దిశగా ప్రగతిశీల దృక్పథాన్ని ప్రభుత్వం అందిపుచ్చుకుందని WazirX వ్యవస్థాపకులు, సీఈఓ నిశ్చల్‌ షెట్టి అభిప్రాయపడ్డారు. పన్ను విధించడం ద్వారా ఈ రంగానికి ప్రభుత్వం చట్టబద్ధత కల్పించిందని అన్నారు.

పాదర్శకత వస్తుందంటున్న నిపుణులు
వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తులపై పన్ను విధించడం ద్వారా పెట్టుబడిదారులు, ఎక్స్‌చేంజీలు సహ మొత్తం ఈ వ్యవస్థలో పారదర్శకత వస్తుందని నిపుణులు అంటున్నారు. వర్చువల్‌ డిజిటల్‌ ఆస్తుల నుంచి వచ్చే ఆదాయంలో 30 శాతం పన్ను అన్నది ఒక సానుకూల చర్యగా ఈ రంగంలోని వారు భావిస్తున్నారు. అంతే కాదు క్రిప్టో లావాదేవీలకు చట్టబద్ధత కల్పించడంతో పాటు దేశవ్యాప్తంగా క్రిప్టో, NFTలకు మరింత ఆమోదం లభిస్తుందని అంటున్నారు. ఈ చర్యల ద్వారా భారతదేశంలో ప్రగతి, సృజనాత్మకతలో కొత్త శకం ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.
Published by:Veera Babu
First published:

Tags: Budget, Budget 2022-23, Business, Cryptocurrency, Union Budget 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు