Covid-19: కరోనా సెకండ్ వేవ్‌కు అసలు కారణమేంటి? ప్రజల తప్పా? ప్రభుత్వ నిర్లక్ష్యమా?

తమిళనాడులోని ప్రార్థనా మందిరాలతో పాటు పార్కులు, బ్యూటీ పార్లర్లు, సెలూన్లు, జిమ్‌లు మూసివేస్తున్నట్లు ఆదేశించింది ప్రభుత్వం. సినిమా థియేటర్స్ కూడా ఇందులో భాగమే. వాటిని కూడా మూసేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో మరోసారి ఇండస్ట్రీపై భారీ ప్రభావం పడటం ఖాయం అయిపోయింది.

UK వేరియంట్ వైరస్ UK లో పెద్ద సమస్యగా మారింది. దీన్ని మొదట్లోనే గుర్తించి అక్కడ కఠినమైన ఆంక్షలు, లాక్​డౌన్​ ,టీకా ప్రక్రియ వేగవంతం చేయడంతో కరోనా వ్యాప్తి గొలుసు విచ్ఛిన్నమైంది. కానీ భారత్​లో ప్రజలు, ప్రభుత్వాల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

  • Share this:
ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా భారత్​లో రోజుకు 3 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే, గత పది రోజుల క్రితం వరకు రోజుకు వందలు, వేలల్లోనే నమోదైన కేసులు.. ఇప్పుడు ఎందుకు ఇలా వేగంగా లక్షల్లో పెరుగుతున్నాయి? దీనికి గల కారణాలేంటో అర్థం కాక అంతా తలలు పట్టుకుంటున్నారు. కేసులు ఇలా వేగంగా పెరుగుతుండటంపై సెంటర్ ఫర్ సెల్యులార్ & మాలిక్యులర్ బయాలజీ (సిసిఎమ్‌బి) అధ్యయనం చేస్తోంది. వైరస్ జన్యువులోని వైవిధ్యాలను గుర్తించడంపై సీసీఎంబీ కరోనా ప్రారంభం నుంచి పనిచేస్తోన్న విషయం తెలిసిందే. దేశంలోని తన 10 జాతీయ ప్రయోగశాల్లో INSACOG (ఇండియన్ SARS-CoV-2 జెనోమిక్ కన్సార్టియం) ఏర్పాటు చేసింది. ఈ కన్సార్టియం దేశవ్యాప్తంగా వివిధ వైరస్ వైవిధ్యాలను నిశితంగా పరిశీలిస్తోంది. కొత్త వేరియంట్లను ప్రజా సమూహంలోకి ప్రవేశించకుండా నిరోధించడమే దీని ముఖ్య కర్తవ్యం.

ఉదాహరణకు, ఎవరైనా అంతర్జాతీయ ప్రయాణికుడు హైదరాబాద్‌కు వచ్చి కొవిడ్–19కు పాజిటివ్​గా నిర్ధారణ అయితే, వేరియంట్ తెలుసుకోవడానికి అతని నమూనాలను సీక్వెన్సింగ్ కోసం CCMB ల్యాబ్​కు పంపిస్తారు. దాని ఆధారంగా, ఆ వ్యక్తిని ఇన్​స్టిట్యూషనల్ క్వారంటైన్​ లేదా హోమ్​ క్వారంటైన్​​ దేనిలో ఉంచాలో నిర్ణయం తీసుకుంటారు. ఈ విధంగా UK వేరియంట్‌ సోకిన వందలాది మంది ప్రయాణికులను గుర్తించి వారిని ప్రజల్లో కలిసిపోకుండా, సంక్రమణ వ్యాప్తి చెందకుండా సీసీఎంబీ నిరోధించవచ్చని సీసీఎంబీ పేర్కొంది. వాస్తవానికి, UK వేరియంట్ వ్యాప్తిని అడ్డుకునే ప్రక్రియలో తెలంగాణ చాలా బాగా పని చేసిందని, అయితే, పంజాబ్‌ విమానాశ్రయంలో కేసులు గుర్తించబడకపోవడంతో UK వేరియంట్ కమ్యూనిటీల్లోకి చొచ్చుకుపోయిందని సీసీఎంబీ తెలిపింది.

అయితే, దేశంలో సెకండ్​ వేవ్ సంక్రమణ ధోరణిని పరిశీలిస్తున్నామని, ప్రస్తుతం B.1.617 (ఇండియన్ డబుల్ మ్యూటెంట్) వేరియంట్​పై మా అధ్యయనాన్ని కొనసాగిస్తున్నామని సీసీఎంబీ అధికారి ఒకరు చెప్పారు. రాబోయే కొద్ది రోజుల్లో, ఈ కొత్త వేరియంట్​పై స్పష్టత వస్తుందని, ఈ వేరియంట్​తో ఆందోళన చెందాల్సిన అవసరం ఉందా? లేదా? అనే విషయం మనకు తెలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతానికైతే B.1.617 సెకండ్​ వేరియంట్​ పెద్ద ఆందోళనగా అనిపించడం లేదని, ఎందుకంటే దీనిలో రీ ఇన్ఫెక్షన్లను ఎక్కడా గమనించలేదని. దీని టీకాతో అడ్డుకోవచ్చని భావిస్తున్నామని ఆయన అన్నారు. కాగా, ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్​ విజృంభించడానికి కారణం కొత్త వేరియంట్ అవునా? కాదా? అనే విషయంపై అధ్యయనం చేస్తున్నట్లు సీసీఎంబీ డైరెక్టర్​ రాకేష్​ మిశ్రా తెలిపారు. ఈ వేరియంట్​ పరివర్తనం చెందుతుందా అన్న కోణంలోనూ స్టడీ చేస్తున్నారు. ఇతర వేరియంట్ల కన్నా B.1.617 మరింత ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతున్న విషయంలో తమ వద్ద స్పష్టమైన ఆధారాలు లేవని పేర్కొన్నారు.

ప్రజల నిర్ణక్ష్యమే కారణమా?
సహజంగా వైరస్​లు అన్ని సమయాలలో మ్యుటేషన్​ చెందుతుంటాయి. అయితే, మ్యుటేషన్​ చెందిన వైరస్​ ఇంత వేగంగా వ్యాప్తి చెందటం ఆందోళన కలిగిస్తోంది. దీనిపై సీసీఎంబీ శాస్త్రవేత్తలు స్పందిస్తూ“మేం కొన్ని నెలల క్రితం, 6000 భారతీయ ఐసోలేట్ల నమూనాలను విశ్లేషించినప్పుడు, 7,500 కన్నా ఎక్కువ వేరియంట్‌లను కనుగొన్నారు. అందువల్ల, వైరస్​తో పాటు ప్రతి రోజూ వేరియంట్లు కూడా మారుతుంటాయని అర్థం చేసుకోవచ్చు. అయితే వేరియంట్ దాని డొమైన్‌ను విస్తరించడానికి అనేక మార్గాలున్నాయి. కానీ, వాటి ప్రతిస్పందన ప్రజల కదలికపై ఆధారపడి ఉంటుంది.

ఉదాహరణకు, UK వేరియంట్ UK లో పెద్ద సమస్యగా మారింది. దీన్ని మొదట్లోనే గుర్తించి అక్కడ కఠినమైన ఆంక్షలు, లాక్​డౌన్​ ,టీకా ప్రక్రియ వేగవంతం చేయడంతో కరోనా వ్యాప్తి గొలుసు విచ్ఛిన్నమైంది. కానీ భారత్​లో ప్రజలు, ప్రభుత్వాల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇక్కడ ఎన్నికలు, మతపరమైన సమావేశాలు, వివాహాలు-ఒకేసారి చాలా పెద్ద సంఘటనలు జరుగుతుండటంతో, సంక్రమణ పెరుగుదల వేగంగా పెరిగింది. ఏ వైరస్​లైనా మ్యుటేషన్​ చెందుతుంటాయి. కానీ, వీటిని కానీ వీటి తీవ్రత మానవ ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. ప్రజలు కరోనా నిబంధనలను తప్పకుండా పాటిస్తే ఈ పరిస్థితులు ఎంతో ఆశాజనకంగా ఉండేవని సీసీఎంబీ సైంటిస్టులు చెబుతున్నారు.
Published by:Shiva Kumar Addula
First published: