Covid vaccines: కోవిడ్ వ్యాక్సిన్లపై ఇంకా అనుమానాలు ఉన్నాయా? నిపుణుల సలహాలు తెలుసుకోండి...

మరోవైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ జాతీయ సగటును మించి జోరుగా సాగుతుండటంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య, శాతం గణనీయంగా తగ్గింది. గత నెల మే 16న ప్రతి 100 టెస్టుల్లో 25.56% మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆ రోజు రాష్ట్రవ్యాప్తంగా 94,550 మందికి పరీక్షలు చేయగా 24,171 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

దేశంలో అందుబాటులో ఉన్న కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లకు సంబంధించిన ప్రశ్నలు, వాటికి సమాధానాలు తెలుసుకుందాం.

  • Share this:
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇంకా భయపెట్టిస్తూనే ఉంది. ఈ వైరస్ దాదాపు అన్ని దేశాలకు విస్తరించింది. సార్స్ కోవ్-2 మూల వైరస్.. ఇప్పుడు అనేక దేశాల్లో వివిధ వేరియంట్లుగా రూపం మార్చుకుంటోంది. వైరస్ గురించి గత ఏడాది ప్రారంభంలో ప్రపంచానికి తెలిసింది. అయినా ఇప్పటికీ దీనికి మందు అందుబాటులోకి రాలేదు. అయితే వివిధ దేశాలు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు, మహమ్మారిని నిరోధిస్తున్నట్లు క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది. ఈ క్రమంలో చాలా దేశాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించాయి. కరోనా వైరస్‌ను పూర్తి స్థాయి వ్యాక్సినేషన్ ద్వారానే అంతం చేయగలుగుతామని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో కూడా ఈ ఏడాది జనవరిలోనే వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైంది. అయితే దేశంలో ఇప్పటికీ టీకాలపై అనుమానాలు, పుకార్లు వ్యాప్తిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో అందుబాటులో ఉన్న కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లకు సంబంధించిన ప్రశ్నలు, వాటికి సమాధానాలు తెలుసుకుందాం.

1. ప్రతి ఒక్కరూ టీకాలు తప్పనిసరిగా తీసుకోవాలా?
ఏదైనా వ్యాధికి చికిత్స లేదా టీకాలు తీసుకోవడం అనేది ఎప్పుడూ తప్పనిసరి కాదు. ఇది పూర్తిగా ప్రజల వ్యక్తిగత నిర్ణయం. అయితే వైరస్‌పై పోరాడటానికి వ్యాక్సిన్‌ తోడ్పడుతుంది. ఎక్కువ మందికి టీకాలు వేస్తే వైరస్ వ్యాప్తి తగ్గిపోతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది.

2. టీకాలు ఎవరు తీసుకోవచ్చు?
18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవడానికి అర్హులు. ప్రస్తుతం రెండు నుంచి 18 సంవత్సరాల వయసు ఉన్నవారిపై ట్రయల్స్ కొనసాగుతున్నాయి. త్వరలో రెండేళ్లు నిండిన అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అయితే గర్భిణులు, పాలిచ్చే తల్లులపై ఇంకా ట్రయల్స్ చేపట్టలేదు. డయాబెటిస్, హైపర్‌టెన్షన్, క్యాన్సర్, గుండె జబ్బులు, మూత్రపిండాల వ్యాధులు, కాలేయ సమస్యలు, థైరాయిడ్ వ్యాధి గ్రస్థులు.. వంటి వారికి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వీరు వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కువ. అందువల్ల వీరు టీకాకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే వీరికి ఉన్న వ్యాధులు, వాటి నివారణకు తీసుకుంటున్న మందుల గురించి టీకాలు వేసే కేంద్రాల్లో తెలియజేయాల్సి ఉంటుంది.

3. వ్యాక్సిన్ ఎవరు తీసుకోకూడదు?
మెడిసిన్ అలర్జీ లేదా వ్యాక్సిన్ అలర్జీలు ఉన్న వారు, ఈ సమస్య గురించి వ్యాక్సినేషన్ సెంటర్లో ఆరోగ్య సంరక్షణ కార్యకర్తకు చెప్పాలి. మొదటి డోసు తీసుకున్నప్పుడు వ్యాక్సిన్ అలర్జీ వంటి సమస్యల బారిన పడినవారు, రెండో డోసు తీసుకోకూడదు. తీవ్రమైన జ్వరం, దగ్గు, జలుబు, ఇతర వ్యాధి లక్షణాలు ఉన్నవారు, అనారోగ్యాల నుంచి పూర్తిగా కోలుకున్న తరువాత టీకా తీసుకోవాలి. ప్లేట్‌లెట్లు తక్కువగా ఉన్నవారు, రక్తం పల్చబడటానికి మందులు వాడేవారు సైతం, వారి అనారోగ్యాల గురించి ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలకు తెలియజేయాలి.

4. ఏ టీకా మంచిది?
అందుబాటులో ఉన్న అన్ని వ్యాక్సిన్లూ మంచివే. క్లినికల్ ట్రయల్స్‌లో రెండు టీకాలు సమర్థతను చాటాయి. ఈ రెండూ వైరస్ నుంచి రక్షణ కల్పిస్తాయని తేలింది. అందువల్ల ఈ విషయంలో వ్యాక్సిన్ల మధ్య పోటీ, ఆధిపత్యం ఉండదు.

5. మొదటి డోసు ఒక వ్యాక్సిన్, రెండో డోసు మరో వ్యాక్సిన్ తీసుకోవచ్చా?
ఒక వ్యక్తి మొదటిసారి తీసుకున్న వ్యాక్సిన్‌ డోసునే రెండోసారి కూడా తీసుకోవాలి.

6. టీకాలు తీసుకున్న తరువాత అన్ని పనులూ చేసుకోవచ్చా?
వ్యాక్సిన్లు తీసుకున్న వారు ఎప్పటిలాగే అన్ని పనులు చేసుకోవచ్చు. యంత్రాలపై పనిచేయడం, డ్రైవింగ్ చేయడం, ఇతర శక్తి సామర్థ్యాలపై టీకాలు ఎలాంటి ప్రభావం చూపవు.

7. ప్రతి ఒక్కరూ రెండు వ్యాక్సిన్ డోసులు తప్పకుండా తీసుకోవాలా?
అర్హత ఉన్నవారు అందరూ రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాలి. ఒకే డోసు టీకా పొందిన వారితో పోలిస్తే, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న వారికి ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ.

8. వ్యాక్సిన్ డోసుల మధ్య ఎంత విరామం ఉండాలి?
కోవాగ్జిన్ రెండు డోసుల మధ్య 28 రోజులు; కోవిషీల్డ్ వ్యాక్సిన్‌కు 12 నుంచి 16 వారాల వరకు విరామం ఉండాలి.

9. వ్యాక్సిన్ డోసులు తీసుకున్న తరువాత శరీరంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి?
మన శరీరం కరోనా వైరస్‌తో పోరాడటానికి అవసరమైన యాంటీబాడీలను టీకా ఉత్పత్తి చేస్తుంది. రెండు డోసులు తీసుకున్న తరువాత ఈ యాంటీబాడీల సంఖ్య విస్తృతంగా పెరుగుతుంది. ఆ తరువాత ఇన్‌ఫెక్షన్ సోకినా, ప్రమాద కరంగా మారదు. అయితే వ్యాక్సిన్ తీసుకున్న తరువాత కొంతమందిలో తలనొప్పి, ఆకలి తగ్గడం, మైకం, వికారం, వాంతులు, పొత్తికడుపు నొప్పి, దురద, దద్దుర్లు, ఒళ్లు నొప్పులు, అలసట, జ్వరం వంటి దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉంది. వీటిని తగ్గించడానికి పారాసెటమాల్ మాత్రలు తీసుకుంటే సరిపోతుంది.

10. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న తర్వాత కూడా మాస్కులు ధరించాలా?
వ్యాక్సినేషన్‌తో సంబంధం లేకుండా అందరూ మాస్క్ ధరించాలి. వ్యాక్సిన్ వైరస్ నుంచి వంద శాతం రక్షణను ఇస్తుందని చెప్పలేం. అందువల్ల ముక్కు, నోటిని పూర్తిగా కప్పి ఉంచే మాస్కులు ధరించడం, సామాజిక దూరం, వ్యక్తిగత పరిశుభ్రత.. వంటి మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలి.

11. మద్యపానం, ధూమపానం చేసేవారు వ్యాక్సిన్ తీసుకుంటే ఏవైనా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందా?
ధూమపానం, మద్యపానం చేసేవారు కూడా టీకాలు తీసుకోవచ్చు. వీరికి వ్యాక్సిన్లు ప్రమాదకరంగా మారుతాయని చెప్పడానికి ఎలాంటి డేటా అందుబాటులో లేదు. కానీ ఇలాంటి అలవాట్లు ఉన్నవారిలో రోగనిరోధక శక్తి తగ్గిపోయే అవకాశం ఉంది. ఫలితంగా వీరికి ఇన్‌ఫెక్షన్ మరింత ప్రమాదకరంగా మారవచ్చు. వీటి వల్ల ఇతర అనారోగ్యాల ముప్పు కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మద్యపానం, పొగతాగడం వంటి అలవాట్లను మానేయడం మంచిది. వ్యాక్సిన్ తీసుకున్న తరువాత రెండు రోజుల వరకు ఆల్కహాల్‌కు దూరంగా ఉండటం మంచిది.
First published: