Covid 19 Vaccination: ఎక్క‌డున్నా.. వ‌ద‌లం: పొలంలోనే కోవిడ్ టీకా

ప్రతీకాత్మక చిత్రం

ప‌ల్లె ప్రజలకు ప్ర‌తీ రోజు ప‌నికి వెళ్ల‌నిదే పూట గ‌డ‌వ‌దు. అలాంటి వారు ప‌నులు వ‌దులుకొని వ్యాక్సినేష‌న్ కేంద్రాలకు వ‌చ్చి టీకా వేయించుకోవాలని ఆశించ‌డం క‌ష్టం. కాని వారి ఆరోగ్యాన్ని విస్మ‌రించ‌కుండా చిత్తూరు జిల్లా వైద్య శాఖ వారి ప‌ని ప్ర‌దేశాల‌కే వెళ్లి వారికి టీకా అందిస్తున్నారు.

  • Share this:
    ప‌ల్లె వాసుల‌కు రెక్క‌డితేగాని డొక్క‌డ‌ని ప‌రిస్థితి. ప్ర‌తీ రోజు ప‌నికి వెళ్ల‌నిదే పూట గ‌డ‌వ‌దు. అలాంటి వారు ప‌నులు వ‌దులుకొని వ్యాక్సినేష‌న్ కేంద్రాలకు వ‌చ్చి టీకా వేయించుకోవాలని ఆశించ‌డం క‌ష్టం. కాని వారి ఆరోగ్యాన్ని విస్మ‌రించ‌కుండా చిత్తూరు జిల్లా వైద్య శాఖ వినూత్న ప‌ద్ధ‌తికి శ్రీకారం చుట్టింది. వారి ప‌ని ప్ర‌దేశాల‌కే వెళ్లి వారికి టీకా అందించాల‌ని నిర్ణ‌యించుకుంది. అందుకోసం వైద్య సిబ్బంది పొలం బాట ప‌ట్టారు. గంగవరం మండలం జీడిమాకులపల్లిలో వైద్య సిబ్బంది మీరు ఎక్కడున్నా వ‌ద‌లం మీ ఆరోగ్య‌మే మాకు ముఖ్యం అంటూ వ‌రినాట్లే వేసే కూలీల వ‌ద్ద‌కు వెళ్లి అక్క‌డే టీకా వేస్తున్నారు.
    ఆగస్టు చివరన లేదా సెప్టెంబర్‌ మొదటి వారంలో క‌రోనా కేసులుపెరిగే అవ‌కాశం ఉంద‌ని వైద్యులు సూచిస్తున్న నేప‌థ్యంలో కేసుల నియంత్ర‌ణ‌పై రాష్ట్ర‌వైద్య ఆరోగ్య శాఖ దృష్టి సారించింది. ఇందుకోసం వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం చేసింది. ఇందు కోసం వారి ప‌ని ప్ర‌దేశాల‌కే వెళ్లి వారికి టీకా అందించాల‌ని నిర్ణ‌యించుకుంది. అందుకోసం వైద్య సిబ్బంది పొలం బాట ప‌ట్టారు. ఆంధ్రప్ర‌దేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లా గంగ‌రం మండలం జీడిమాకులపల్లిలో వైద్య సిబ్బంది మీరు ఎక్కడున్నా వ‌ద‌లం మీ ఆరోగ్య‌మే మాకు ముఖ్యం అంటూ వ‌రినాట్లే వేసే కూలీల వ‌ద్ద‌కు వెళ్లి అక్క‌డే టీకా వేస్తున్నారు.
    త‌గ్గ‌ని వ్యాప్తి
    కోవిడ్ వ్యాప్తి ప్రధాన నగరాల్లో బాగానే ఉన్నా చిన్న పట్టణాల్లోని ప్ర‌జ‌ల్లో కొంత నిర్లక్ష్యం కన్పిస్తోంది. బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించడం, గాలి బాగా ఆడే ప్రదేశాల్లో ఉండటం, మూసి ఉన్న ప్రదేశాల్లో గుంపులుగా చేరకపోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆంధ్ర ప్ర‌దేశ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 2,55,26,861 ప‌రీక్ష‌లు చేయ‌గా 19,87,761 కేసులు న‌మోద‌య్యాయి. ఇందులో 18,766 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. 19,55,380 మంది కోవిడ్ బారిన ప‌డి కోలుకోగా 13,615.మంది మృతి చెందారు.
    ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న భ‌యాలు..
    రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలోనే ప్ర‌భుత్వం బ‌డులు తెర‌వాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డం పిల్ల‌ల త‌ల్లిదండ్రుల్లో భ‌యాందోళ‌న నెల‌కొంది. బ‌డులు తెరిస్తే ఎంత మంది తమ పిల్ల‌ల‌ను పంపుతారో ఇంకా అర్థం కాని ప‌రిస్థితి ఉంది. ఓ వైపు పిల్ల‌లు చ‌దువులు దెబ్బ‌తింటున్న‌య‌నే బాధ ఉన్న వారి ఆరోగ్య‌మే ప్ర‌ధానంగా త‌ల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. ఏది ఏమైనా త్వ‌ర‌గా వాక్సినేష‌న్ పూర్తి చేస్తే త్వ‌ర‌గా పూర్తి చేస్తే క‌రోనా వ్యాప్తి త‌గ్గ‌వ‌చ్చ‌ని వైద్యులు అభిప్రాయ ప‌డుతున్నారు.
    Published by:Sharath Chandra
    First published: