హోమ్ /వార్తలు /Explained /

Corona virus: కరోనా సోకని చిట్టచివరి దేశాల్లో ఒకటి కిరిబాటి.. ఇప్పుడు వందల కేసులతో తల్లడిల్లుతున్న దేశం

Corona virus: కరోనా సోకని చిట్టచివరి దేశాల్లో ఒకటి కిరిబాటి.. ఇప్పుడు వందల కేసులతో తల్లడిల్లుతున్న దేశం

ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 6,75,085 మంది వైరస్​ బారినపడగా.. మరో 1,337 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 57,58,81,194కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 64,04,942 మంది మరణించారు.(ప్రతీకాత్మక చిత్రం)

ప్రపంచ దేశాల్లో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 6,75,085 మంది వైరస్​ బారినపడగా.. మరో 1,337 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 57,58,81,194కు చేరింది. ఇప్పటివరకు వైరస్​తో 64,04,942 మంది మరణించారు.(ప్రతీకాత్మక చిత్రం)

ఇప్పటివరకు కరోనా వ్యాప్తిని అడ్డుకోగలిగి దేశాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. దురదృష్టవశాత్తు, ఇప్పుడు ఆ దేశాల్లోని ఒక ప్రాంతంలో పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదవుతున్నాయి.

గత రెండేళ్లుగా వివిధ వేరియంట్ల రూపంలో కరోనా వైరస్ (corona virus) ప్రపంచ దేశాలపై కోరలు చాస్తోంది. ఈ మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడం ఎవరి తరం కావడం లేదు. అయితే ప్రపంచంలో ఇప్పటివరకు కరోనా వ్యాప్తిని అడ్డుకోగలిగి దేశాలు కొన్ని మాత్రమే ఉన్నాయి. దురదృష్టవశాత్తు, ఇప్పుడు ఆ దేశాల్లోని ఒక ప్రాంతంలో పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఓషియానియా (Oceania) ఖండంలోని ద్వీపదేశమైన కిరిబాటి (Kiribati) తన సరిహద్దులను మూసేసి 2021 వరకు కరోనాను దరిదాపుల్లోకి కూడా రాకుండా అరికట్టగలిగింది. అయితే తాజాగా ఈ దేశం తమ పౌరులలో 54 మందిని ఇళ్లకు అనుమతించే ఉద్దేశంతో ఒక విమానం కోసం అంతర్జాతీయ సరిహద్దులను ఓపెన్ చేసింది. ఆ విమానంలో ఉన్నవారికి కరోనా సోకడంతో అక్కడి కేసులు ఒక్కసారిగా పెచ్చరిల్లాయి. ఈ పసిఫిక్ మహాసముద్రంలోని ద్వీపదేశంలో కరోనా కరాళనృత్యం చేస్తుండటంతో అత్యవసరంగా లాక్‌డౌన్‌లు విధించాల్సిన పరిస్థితి వచ్చింది.

జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్-డే సెయింట్స్ చర్చ్‌ విజ్ఞప్తి మేరకే కిరిబాటి ప్రభుత్వం విదేశాల నుంచి ఓ విమానాన్ని తమ దేశంలోకి అనుమతించింది. అయితే ఇందులో ఉన్న వారిలో చాలా మంది మిషనరీలు కాగా వారు సరిహద్దు మూసివేతకు ముందు కిరిబాటిని విడిచిపెట్టి విదేశాలలో మతవిశ్వాసాన్ని వ్యాప్తి చేయడానికి బయల్దేరారు. సమీపంలోని ఫిజీ(Fiji)లో తిరిగి వచ్చే ప్రతి ప్రయాణికుడిని అధికారులు మూడుసార్లు పరీక్షించారు. వారికి టీకాలు వేయాలని, వారు ఇంటికి వెళ్లగానే అదనపు పరీక్షలతో నిర్బంధంలో ఉంచాలని ఆదేశించారు. కానీ ఈ చర్యల వల్ల ఏ ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకంటే సగం కంటే ఎక్కువ మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని గుర్తించేలోపే వైరస్ కమ్యూనిటీలకు పాకేసింది. దీంతో కంగుతిన్న సదరు దేశం వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా హుటాహుటిన ఎమర్జెన్సీ (state of emergency or state of disaster)ని ప్రకటించింది. విమాన ప్రయాణికుల్లో మొదట 36 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ కాగా శనివారం నాటికి ఈ సంఖ్య 266కి చేరుకుంది.

కిరిబాటి, అనేక ఇతర చిన్న పసిఫిక్ దేశాలు వైరస్ వ్యాప్తిని నివారించిన అతి కొద్ది దేశాల్లో ఒకటిగా ఉన్నాయి. ఇవి ప్రపంచం నుంచి వేరయినట్లుగానే ఉంటాయి. అలాగే కఠినమైన సరిహద్దు ఆంక్షలను అమలు చేస్తాయి. అందుకే మొన్నటిదాకా కరోనాని ఎదుర్కోగలిగాయి కానీ అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్ వేరియంట్‌ని ఆపలేక చేతులెత్తేశాయి. ఆన్‌లైన్ సైంటిఫిక్ పబ్లికేషన్ అవర్ వరల్డ్ ఇన్ డేటా ప్రకారం, కిరిబాటి 113,000 మంది జనాభాలో 33% మంది మాత్రమే పూర్తిగా టీకాలు తీసుకున్నారు. 59% మంది కనీసం ఒక డోసు వేయించుకున్నారు. అనేక ఇతర పసిఫిక్ దేశాల వలె, కిరిబాటి ప్రాథమిక ఆరోగ్య సేవలను మాత్రమే అందిస్తుంది. కిరిబాటి దేశంలో రెండు ఇంటెన్సివ్ కేర్ బెడ్‌లు మాత్రమే ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు. దీనివల్ల గతంలో జబ్బుపడిన రోగులను చికిత్స కోసం కిరిబాటి నుంచి ఫిజీ లేదా న్యూజిలాండ్‌కు పంపించాల్సిన పరిస్థితి వచ్చిందని డాక్టర్లు తెలిపారు. అయితే అసలు వైద్య సేవలే అందుబాటులో లేని కిరిబాటిలో కరోనా విజృంభించిందని తెలిసి డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పుడు కిరిబాటి అధికారులు మల్టిపుల్ క్వారంటైన్ సైట్‌లను తెరిచి కర్ఫ్యూ ప్రకటించి, లాక్‌డౌన్‌లు కూడా విధించారు. ప్రెసిడెంట్ తానేటి మామౌ సోషల్ మీడియాలో మాట్లాడుతూ పరిస్థితిని నియంత్రించేందుకు ప్రభుత్వం తన వనరులన్నింటినీ ఉపయోగిస్తోందని చెప్పారు. అలాగే టీకాలు వేయించుకోవాలని ప్రజలను కోరారు. యూఎస్ రాష్ట్రమైన ఉటాలో ఉన్న చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లేటర్-డే సెయింట్స్ కిరిబాటితో సహా అనేక పసిఫిక్ దేశాలలో బలమైన ఉనికిని కలిగి ఉంది. ఇక్కడ దాని 20,000 మంది సభ్యులు దీనిని మూడవ-అతిపెద్ద క్రైస్తవ వర్గంగా మార్చారు. చర్చిలో దాదాపు 53,000 మంది మిషనరీలు ప్రపంచవ్యాప్తంగా సేవలందిస్తున్నారు. వీరు ప్రజలను మార్చేందుకు పనిచేస్తున్నారు. మహమ్మారి వారికి సవాళ్లను విసిరింది. దీంతో నిశ్శబ్దంగా ఉన్న చర్చి మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో మళ్లీ స్పందించి... ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో మతమార్పిడి చేయాలని మిషనరీలని కోరింది. నెల తర్వాత వారిని బయట ప్రదేశాల్లో దింపింది. ఏప్రిల్ 2021లో కోవిడ్-19 వ్యాక్సిన్‌లు చాలా దేశాల్లో విస్తృతంగా అందుబాటులోకి వచ్చినప్పుడు, చర్చి అధికారులు మిషనరీలందరినీ టీకాలు తీసుకోవాలని ప్రోత్సహించారు.

"మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి కిరిబాటి సరిహద్దులు మూసివేయబడినందున, ఈ వ్యక్తులలో చాలా మంది వారి 18 నుండి 24 నెలల ఊహించిన సేవకు మించి మిషనరీలుగా కొనసాగారు, కొందరు 44 నెలల వరకు సేవలందిస్తున్నారు" అని చర్చి ప్రతినిధి సామ్ పెన్రోడ్ చెప్పారు.

మరో పసిఫిక్ దేశమైన టోంగాలో కూడా కరోనా కలకలం సృష్టించింది. అక్టోబరులో ఆఫ్రికాలో నుంచి టోంగాకు తిరిగి వచ్చిన మిషనరీ న్యూజిలాండ్ మీదుగా స్వదేశానికి వెళ్లాడు. అతడికి కరోనా సోకడంతో టోంగా దేశంలో తొలి పాజిటివ్ కేసుగా నమోదైనట్లయింది. అయితే అతనికి టీకా వేసి, క్వారంటైన్ లో ఉంచారు. ఈ నెల ప్రారంభంలో వినాశకరమైన అగ్నిపర్వత విస్ఫోటనం, సునామీ నుంచి కోలుకున్నందున టోంగా కరోనా వ్యాప్తిని నిరోధించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. 105,000 మంది ఉన్న దేశం ప్రపంచం నలుమూలల నుండి సహాయం పొందుతోంది,

205,000 జనాభాతో సమీపంలోని సమోవా కూడా దాని తొలిసారిగా పెరుగుతున్న కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రయత్నిస్తోంది. ఇక్కడ గురువారం నాటికి, ప్రయాణికులకు కరోనా కేసుల సంఖ్య 27కి పెరిగింది. పసిఫిక్‌లోకి వైరస్ ఎంట్రీ ఇవ్వడం లాక్‌డౌన్‌లు, ఇతర పరిమితులను ప్రేరేపించినప్పటికీ, ఐలాండ్ లైఫ్ లోని అన్ని సాంప్రదాయిక అంశాలు ఎక్కువ కాలం నిలిచిపోవని తెలుస్తోంది.

First published:

Tags: Explained

ఉత్తమ కథలు