COVID 19 VACCINE MODI S SENSATIONAL DECISION VACCINE FOR TEENAGERS WILL HAVE NO EFFECT EVK
Explained: మోదీ సంచలన నిర్ణయం.. టీనేజర్లకు టీకా.. ఎటువంటి ప్రభావం చూపనుంది!
ప్రతీకాత్మక చిత్రం
Covid 19 Vaccine | దేశంలో ఒమిక్రాన్ (Omicron) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ డిసెంబర్ 25, 2021న ఆకస్మికంగా జాతినుద్దేశించి ప్రసం గిం చారు. ఈ ప్రసంగంలో కీలకంగా 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల వారికి కరోనా వ్యాక్సిన్ అందిజేస్తున్నట్టు ప్రకటించారు. దీని ద్వారా విద్యావ్యవస్థపై ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
దేశంలో ఒమిక్రాన్ (Omicron) కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ డిసెంబర్ 25, 2021న ఆకస్మికంగా జాతినుద్దేశించి ప్రసం గిం చారు. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ కచ్చితంగా మాస్క్‌లు (Masks) ధరించాలని సూచించారు. కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ అందించనున్నట్టు ప్రధాని చెప్పారు. ఈ వ్యాక్సినేషన్ (Vaccination) జనవరి 03 నుంచి ప్రారంభం అవుతుందని ప్రధాని మోదీ తెలిపారు. ఫ్రంట్‌లైన్ వర్క్‌ర్లకు బూస్టర్ డోస్‌ను కూడా జనవరి 10 నుంచి అందిస్తామని మోదీ అన్నారు. ఈ నేపథ్యంలో టీనేజర్లకు వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల దేశంలో ప్రభావితం అయ్యే అంశాలు ఏంటో చూద్దాం.
"రవీందర్ ప్రముఖ ఎంఎన్సీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతనికి ఇద్దరు పిల్లలు. కరోనా తరువాత పాఠశాలలు తెరిచినా స్కూల్లకు పంపడం లేదు. పిల్లలకు ఏమన్నా అయితే ఎలా అని ఆలోచిస్తున్నాడు."
ఇది ఒక్క రవీందర్ విషయమే కాదు. దేశంలో చాలా మంది పిల్లల తల్లిదండ్రుల ఆలోచనా ఇదే. పాఠశాలలు తెరిచినా మధ్యతరగతి కుటుంబాల నుంచి పిల్లలు బడులకు రావడం లేదు. తాజాగా మోదీ నిర్ణయం దేశ వ్యాప్తంగా విద్యా వ్యవస్థపై పడనుంది. మరో మూడు, నాలుగు నెలల్లో ఇంటర్, టెన్త్, డిగ్నీ పరీక్షలు వస్తున్నాయి. ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో తల్లిదండ్రుల్లో కలవరం మొదలైంది. పిల్లలను ఎలా పరీక్షలకు పంపాలో భయం నెలకొంది.
తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 20 లక్షలకు పైగా 15 నుంచి 18 ఏళ్ల వయసు పిల్లలు ఉన్నారు. ప్రతీ రాష్ట్రంలోను విద్యార్థుల సంఖ్య గణనీయంగానే ఉంది. ప్రభుత్వం జనవరి 3, 2022 నుంచి పిల్లలకు టీకా పంపిణీ చేయడం ప్రారంభిస్తే. మూడునెలల్లో చాలా వరకు విద్యార్థులు టీకా పొందుతారు. పరీక్షలకు హాజరు అయ్యేందుకు భయం తగ్గుతుందని విద్యా వేత్తలు చెబుతున్నారు.
పరీక్షల అనంతరం విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యే నాటికి చాలా మందికి టీకా అందుతుంది. దీని ద్వారా పిల్లలకు పాఠశాలలకు పంపడానికి తల్లిదండ్రులకు భయం తగ్గుతుంది. ఇది కచ్చితంగా విద్యా వ్యవస్థకు మంచి చేసే నిర్ణయమేనని చెబుతున్నారు.
సాధారణంగా పిల్లలకు ఇమ్యూనిటీ శక్తీ (Immunity Power) ఎక్కువగానే ఉంటుంది. ప్రభుత్వం వారికీ టీకా వేయడం ద్వారా కరోనా చైన్‌ను అరికట్టి నట్టే. ఎందుకంటే పాఠశాలలకు వచ్చే విద్యార్థులకు టీకా ఇవ్వడం ద్వారా వైరస్ (Virus) వ్యాప్తి తగ్గుతుంది. ఎలా అంటే.. స్కూల్ నుంచి విద్యార్థి నేరుగా ఇంటికి వెళ్తాడు. ఇంట్లో వారికి వైరస్ అంటించే ప్రమాదం ఉంది. టీకా వేయడం ద్వారా ఈ కరోనా చైన్ ఆగిపోతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇటీవల కేంద్ర ఆరోగ్యం సంస్థ పిల్లల టీకాపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. అయితే తాజాగా మోదీ ఆకస్మకి నిర్ణయంతో దేశ వ్యాప్తంగా విద్యా వ్యవస్థకు మంచి జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.
మన దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ అందరం అత్యం త అప్రమత్తం గా ఉం డాల్సిన సమయమిది. ఒమిక్రాన్ వస్తోం ది.. ఎవరూ భయాం దోళనకు గురికావొద్దని మోదీ అన్నారు. ఒమిక్రాన్‌తో ప్రపంచ దేశాలు ఇబ్బంది పడుతున్నాయని, ఇవాళ దేశవ్యా ప్తం గా 18 లక్షల పడకలు అం దుబాటులో ఉన్నా యి. పిల్లలకు 90వేల బెడ్స్ సిద్ధం గా ఉన్నాయని ఆయన అన్నారు. దేశంలో టీకాల కొరత, మందుల కొరత లేదని అన్నారు.
మోదీ ఏమన్నారు..
- ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ కచ్చితంగా మాస్క్‌లు ధరించాలని సూచించారు. కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని
- మోదీ అన్నారు. 15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల పిల్లలకు వ్యాక్సినేషన్ అందించనున్నట్టు ప్రధాని చెప్పారు.
- ఈ వ్యాక్సినేషన్ జనవరి 03 నుంచి ప్రారంభం అవుతుందని స్పష్టం చేశారు.
- ఫ్రంట్‌లైన్ వర్క్‌ర్లకు బూస్టర్ డోస్‌ను కూడా జనవరి 10 నుంచి అందిస్తామని మోదీ అన్నారు.
- మన దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ అం దరం అత్యం త అప్రమత్తం గా ఉండాలి.
- ఒమిక్రాన్‌తో ప్రపంచ దేశాలు ఇబ్బంది పడుతున్నాయని, ఇవాళ దేశవ్యా ప్తం గా 18 లక్షల పడకలు అం దుబాటులో ఉన్నాయని వెల్లడించారు.
- పిల్లలకు 90వేల బెడ్స్ సిద్ధం గా ఉన్నాయని ఆయన అన్నారు. దేశంలో టీకాల కొరత, మందుల కొరత లేదని అన్నారు.
- ముఖ్యంగా పుకార్లను నమ్మొద్దని హితవు పలికారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.