AP Corona one year: ఏపీలో కరోనా తొలి కేసుకు ఏడాది పూర్తి? మళ్లీ మొదలైన కలవరం

AP Corona one year: ఏపీలో కరోనా తొలి కేసుకు ఏడాది పూర్తి? మళ్లీ మొదలైన కలవరం

ఏపీలో కరోనా వైరస్ కు ఏడాది

ప్రజల నిర్లక్ష్యం మరోసారి కరోనాను ఆహ్వానిస్తోందేమో అనే భయం పెరుగుతోంది. గతంలో వైరస్ కేసులు భారీగా నమోదవుతున్న సమయంలో అంతా చాలా జాగర్తలు పాటించారు. కానీ ఇప్పుడు నిబంధనలను లైట్ తీసుకుంటున్నారు. మాస్కులు పెట్టుకోవడం లేదు. శానిటైజర్ రాసుకోవడం లేదు.. భౌతిక దూరం పాటించడం లేదు. అయితే ఏపీలో తొలి కరోనా కేసు నమోదై ఏడాది పూర్తి అవుతోంది. ఇప్పుడు మళ్లీ వైరస్ కేసులు పెరుగుతుండడం ఆందోళన పెంచుతోంది.

 • Share this:
  ఆంద్ర ప్రదేశ్ ను కరోనా వైరస్ మళ్లీ భయపెడుతోంది. ఏపీలో తొలి కరోనా కేసు నమోదై ఏడాది పూర్తి అయ్యింది. ఏపీలో గత ఏడాది మార్చి 12న తొలి కేసు అధికారికంగా నిర్ధారణ అయ్యింది. అప్పటి నుంచి ఆ మహమ్మారి రాష్టాన్ని గజగజా వణికిచింది. ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. ఈ ఏడాది కాలంలో రాష్ట్రంలో సగటున రోజుకు 2442 కరోనా కేసులు నమోదయ్యాయి. అంటే వైసర్ విస్తరణ ఏ రేంజ్ లో సాగిందో ఊహిస్తేనే భయమేస్తోంది.

  ఓవరాల్ గా చూస్తే కరోనా కేసుల నమోదులో దేశంలో ప్రస్తుతం నాలుగో స్థానంలో ఏపీ కొనసాగుతోంది. ముఖ్యంగా గత ఆగస్టు-సెప్టెంబర్ కాలంలో దేశంలో రెండో స్థానంలో ఏపీనే నిలిచింది. ఈ ఏడాది మొత్తాన్ని పరిశీలిస్తే.. ఆగస్టు 26వ తేదీన అత్యధికంగా 10,830 కేసులు నమోదయ్యాయి. వరుసగా పదిరోజులకుపైగానే 10 వేలకు పైగా కేసులు నమోదవుతూ వచ్చాయి. దీంతో భయానకవాతావరణం నెలకొంది. అలాగే గత ఏడాది ఆగస్టు నెలలో రెండు రోజుల్లో అత్యధిక మరణాలు కూడా నమోదయ్యాయి. ఒకే రోజున 97 మంది మృత్యువాత పడ్డారు. గడిచిన ఏడాదిలో ఆగస్టు 1వ తేదీన అత్యధికంగా 12,750 మంది రికవరీ అయ్యారు. అయితే సరిగ్గా ఏడాది తర్వాత ఏపీలో మళ్లీ కరోనా కేసులు పుంజుకుంటుండడం ఆందోళన పెంచుతోంది. ప్రస్తుతం చిత్తూరు, కృష్ణా జిల్లాలు ఏపీని భయపెడుతున్నాయి.

  ఇదీ చదవండి: ఏపీలో మళ్లీ కరోనా కలవరం: తాడేపల్లిలో మున్సిపల్ ఉద్యోగులకు: చిత్తూరులో విద్యార్థులకు వైరస్

  మొన్నటి వరకు కేసులు తగ్గాయని అంతా ఆనంద పడ్డారు. కానీ మళ్లీ ఇప్పుడు కరోనా కలవరపెడుతోంది. మళ్లీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 47,803 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 174 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఇద్దరు మృతి చెందారు. అదే సమయంలో 78 మంది రికవరీ అయ్యారు. దీంతో.. పాజిటివ్‌ కేసుల సంఖ్య 8 లక్షల 91వేల 178 కి చేరగా.. కోలుకున్నవారి సంఖ్య 8 లక్షల 82వేల 841 కి చేరింది. ఇక, ఇప్పటి వరకు కరోనాతో 7వేల 179 మంది మృతిచెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1158 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. గత వారం నుంచి 100కి తగ్గకుండా కేసులు నమోదు అవుతుండడంతో మళ్లీ ఆందో పెంచుతోంది.

  ఏపీ వ్యాప్తంగా జోరుగా వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం  సాగుతోంది. చాలామంది ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకున్నారు. అయినా మళ్లీ వైరస్ విస్తరిస్తుండడం ఆందోళన పెంచుతోంది. ముఖ్యంగా ఈ సారి వైరస్ పెరగడానికి ప్రజల నిర్లక్ష్యమే కారణం అవుతోంది. ఎందుకంటే ఒకప్పుడు కరోనా అంటే జనాల్లో భయం ఉండేంది. మాస్కు పెట్టుకోనేది ఎవరూ బయటకు వచ్చేవారు కాదు.. కచ్చితంగా భౌతిక దూరం పాటించేవారు.. కానీ ప్రస్తుతం బయట పరిస్థితి చూస్తే ఆందోళన పెరుగుతోంది. మాస్కు పెట్టుకోకుండానే రోడ్లపైకి జనం వచ్చేస్తున్నారు. సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ లో జనం భారీగానే కనిపిస్తున్నారు కానీ వారికి మాస్కులు కనిపించడం లేదు. ఇక వైన్ షాపుల దగ్గర పరిస్థితి అయితే అందరికీ తెలిసిందే.  శానిటైజర్ సంగతే మరిచిపోయారు. భౌతిక దూరం పాటించాలనే నిబంధనే లేనట్టు ప్రవర్తిస్తున్నారు. వీటికి తోడు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేయడానికి చాలామంది ఓటర్లు పోటెత్తారు. కానీ ఎవరూ మాస్కులు పెట్టుకున్నట్టు కనిపించలేదు. ఇక రాజకీయ నేతలు ప్రచారాల పేరిట భారీగా బహిరంగ సభలు నిర్వహించినా ఎక్కడా భౌతిక దూరం కనిపించలేదు. ఇలా మన నిర్లక్ష్యమే ఇప్పుడు కరోనా విస్తరణకు కారణమవుతోంది.
  Published by:Nagesh Paina
  First published:

  అగ్ర కథనాలు