Home /News /explained /

CORONA ALERT BE CARE FULL BUT NOT TO CARRY THE VIRUS TAKE PRECAUTIONS ONLY NGS

Corona Alert: కరోనా నిర్ధారణ అయ్యిందా? పాజిటివ్ లక్షణాలు ఉన్నాయా? ఇలా చేయండి. భయం వద్దు

కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకోండి. భయం వద్దు అంటున్న నిపుణులు

కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకోండి. భయం వద్దు అంటున్న నిపుణులు

కరోనా సెకెండ్ వేవ్ గురించి అసలు భయపడొద్దు అంటున్నారు వైద్యులు, నిపుణులు. గతంతో పోలిస్తే ఈసారి మరణాలు పెరిగేలా కనిపించడానికి అసలు కారణం భయమే అంటున్నారు. కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.. భయం మాత్రం అవసరం లేదంటున్నారు. కరోనాను ఇలా చేస్తే జయించొచ్చని మానసిక వైద్యులు చెబుతున్నారు.

ఇంకా చదవండి ...
  తెలుగు రాష్ట్రాలపై కరోనా కాటేస్తోంది. రెండు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య రెట్టింపు అవుతున్నాయి. దానికితోడు మరణాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా సెకెండ్ వేవ్ సునామీలా చెలరేగిపోతోంది. గతంతో పోల్చుకుంటే ఈ సారి మరణాల సంఖ్య పెరగంతో ప్రజలను భయం వెంటాడుతోంది. అయితే సెకెండ్ వేవ్ లో మరణాలు పెరుగుతున్నాయి అన్నది కేవలం అపోహ మాత్రమే అంటున్నారు వైద్య నిపుణులు. కరోనా వస్తే ఏదో జరిగిపొంతుందనే భయమే ఎక్కువగా ప్రాణాలు బలితీసుకోడానికి కారణమవుతోంది. ఇటీవల కరోనా సోకిందని మనస్థాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నవారి సంఖ్య పెరగడం ఆందోళన పెంచుతోంది. కానీ అసలు కరోనా గురించి అంత భయపడాల్సిన అవసరం లేదు. కరోనాను జయించే అయుధం మనుకు అందుబాటులో ఉంది. మానసిక వైద్యులు, వైద్య నిపుణులు కూడా అదే చెబుతున్నారు.

  వైద్యనిపుణులు చెబుతున్న మాట ఒకటే.. కరోనా సోకకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. ఇది అందరికీ తెలిసిందే అయినా నిర్లక్ష్యం మాత్రం పనికిరాదుంటున్నారు. అందుకే వీలైనంత భౌతిక దూరం పాటించాలని.. శానిటైజర్ తో చేతులు శుభ్రంగా కడుక్కోవాలని.. అలాగే మాస్కు ధరించడం తప్పని సరి అంటున్నారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వచ్చినా అంత భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనుషుల నిర్లక్ష్యం కారణంగా కరోనా రావడ సర్వసాధారణమంటున్నారు.

  కరోనా సోకినా భయం అవసరం లేదంటున్నారు. సరైనా సమయంలో గుర్తించి వైద్యం చేయించుకోవాలని.. దానికి తోడు పోషకాహారం తీసుకుంటూ ధైర్యంగా ఉంటే వెంటనే కోలుకోవచ్చు అంటున్నారు. ఏపీలోని తాజా పరిస్థితి చూసుకుంటే.. గడిచిన 24 గంటల్లో 7055 మంది కరోనా నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జయ్యారనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. 80 ఏళ్లు దాటినవాళ్లు సైతం కరోనాను జయించి ధైర్యంగా బయట పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. కేవలం దీర్ఘకాలిక అరోగ్య సమస్యలు ఉన్నా.. కరోనా సోకినప్పుడు బ్రీత్ అందే వరకు గుర్తించలేకపోతేనే సమస్య వస్తుందని లేదంటే కరోనా గురించి భయపడాల్సిన పరిస్థితే లేదంటున్నారు.

  ముఖ్యంగా వైరస్‌పై తగిన అవగాహన లేకపోవటం, లక్షల మంది ప్రతి రోజూ దేశ వ్యాప్తంగా వైరస్‌ బారినపడటంతో సర్వత్రా భయాందోళనకు గురవుతున్నారన్నారు. ఆందోళన చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని ధైర్యంగా కరోనాను జయించవచ్చు అంటున్నారు. ముఖ్యంగా పట్టణాల్లో మృతుల్లో ఎక్కువ మంది తీవ్రమైన అనారోగ్య సమస్యలతో అప్పటికే బాధపడుతుండటమో లేక వృద్ధాప్యంలో ఉన్నవారే ఉన్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ 99శాతం మంది వైద్యం పొంది తిరిగి ఆరోగ్యవంతులై ఇళ్లకు వెళ్తున్నారని చెబుతున్నారు.

  ముఖ్యంగా కరోనా వ్యాప్తి చేసేవారిగా ఎవరూ మారొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా పరీక్షలు చేస్తున్నా.. ఫలితాలు ఆలస్యంగా వస్తున్నాయి. అయితే  ఫలితాలు రానంత వరకు పరీక్షలు చేసుకున్నవారు కచ్చితంగా క్వారంటైన్ లోనే ఉండాలని. బయట తిరగకూడదని హెచ్చరిస్తున్నారు. అప్పుడే కరోనాను కట్టడి చేయగలమంటున్నారు. మరోవైపు ఎవరికి వారు తమ వంతు కర్తవ్యంగా వైరస్‌ అనుమానిత లక్షణాలు కనిపించిన వెంటనే ఐసోలేషన్‌కు వెళ్లిపోవాలని సూచిస్తున్నారు. లక్షణాలు ఉన్నప్పటి నుంచి అందరికీ దూరంగా ఉంటూ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలంటున్నారు. ఒకవేళ పాజిటివ్‌ వస్తే వెంటనే ఆసుపత్రిలో చేరాలి. అవకాశం ఉన్నవాళ్లు పెద్దగా లక్షణాలు లేని వాళ్లు ఐసోలేషన్‌లో ఉండి.. వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడుకోవాలని సూచిస్తున్నారు.

  చిన్ని చిన్న లక్షణాలతో ఉన్నవారు ఎలాంటి భయం లేకుండా.. పౌష్టికాహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా విటమిన్లు అధికంగా ఉండే పండ్లు, డ్రైఫ్రూట్స్‌, మాంసం తదితర వ్యాధి నిరోధకశక్తిని పెంచే ఆహారం తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు. కానీ కరోనా సోకింది ఏం అయిపోతుందో అనే భయాన్ని మాత్రం దరిచేరనివ్వకూడదు అంటున్నారు. వైరస్‌ వచ్చిన తర్వాత చికిత్సపొందే కంటే రాకుండా జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యమని, మాస్కు కట్టుకోవటం, జనసమూహం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటం, తరచూ శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఆయాసం, దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలు కనిపించిన వెంటనే ఇతరులకు దూరంగా ఉండాలి అంటున్నారు వైద్యులు. పరీక్షల్లో పాజిటివ్‌ ఫలితం వచ్చి.. కరోనా లక్షణాలు బయటకు కనిపించని వారు సౌకర్యం ఉంటే కచ్చింతగా హోం ఐసొలేషన్ లో ఉండాలి అంటున్నారు. వారి నివాసంలో ప్రత్యేక గది, మరుగుదొడ్డి ఉండాలంటున్నారు. ఇళ్లలో చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యా ధులతో బాధపడుతున్న వారు ఉండకూడదన్నారు.

  కరోనా బారినపడి మరణిస్తున్న వారి పట్ల కూడా సమాజంలో అనేక అపోహలు ఉన్నాయని. ప్రాణంతో ఉన్న దేహంలోనే వైరస్‌ బతికి ఉంటుంది. శరీరంలో వైరస్‌ రెట్టింపు స్థాయిలో అభివృద్ధి అవుతుంది. అదే మృతదేహంలో అయితే వైరస్‌ మనుగడు సాధించలేదు. బ్యాక్టీరియా మాత్రమే మనగలుతుంది కానీ వైరస్‌ ఎక్కువసేపు బతకలేదంటున్నారు. మనిషి చనిపోయిన ఆరు గంటల తర్వాత అత ని శరీరంలో వైరస్‌ బతికి ఉండదంటున్నారు. వైరస్ గురించి వర్రీ వద్దని.. ముఖ్యంగా భయం ఏ మాత్రం దరి చేరనివ్వొద్దని.. మనలో ఉండే ధైర్యమే మనకు శ్రీరామ రక్ష అంటున్నారు. మానసికంగా ధైర్యంగా ఉన్నవారు కరోనాను తప్పక జయిస్తారని వైద్యులు సూచిస్తున్నారు.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra, Andhra Pradesh, AP News, Corona, Corona effect, Corona habits, Corona patients, Corona positive

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు