Facebook Conspiracy Theories: ఫేస్‌బుక్ సేవలు నిలిచిపోవడం వెనుక పెద్ద కుట్ర? సంచలన విషయాలు వెల్లడించిన ఫేస్‌బుక్ మాజీ ఉద్యోగిని

ప్రతీకాత్మక చిత్రం

సోమవారం రాత్రి 9 గంటల సమయం నుంచి ఫేస్‌బుక్ తో సహా ఆ సంస్థకే చెందిన వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌, మెసెంజర్ సేవలు స్తంభించిపోయాయి. గంటలు గడుస్తున్నా ఈ సైట్ల సేవలు మళ్లీ అందుబాటులోకి రాకపోవడంతో కోట్లాదిమంది యూజర్లు తెగ హైరానా పడ్డారు. ఈ క్రమంలో ఫేస్‌బుక్ తమ వైపు నుంచే తప్పిదం జరిగిందని.. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పింది.

  • Share this:
సోమవారం రాత్రి 9 గంటల సమయం నుంచి ఫేస్‌బుక్‌తో (Facebook) సహా ఆ సంస్థకే చెందిన వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌, మెసెంజర్ (WhatsApp, Instagram, Facebook) సేవలు స్తంభించిపోయాయి. గంటలు గడుస్తున్నా ఈ సైట్ల సేవలు మళ్లీ అందుబాటులోకి రాకపోవడంతో కోట్లాదిమంది యూజర్లు తెగ హైరానా పడ్డారు.

ఈ క్రమంలో ఫేస్‌బుక్ (Facebook) తమ వైపు నుంచే తప్పిదం జరిగిందని.. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని చెప్పింది. అంతకు మించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో పలు అనుమానాలు పుట్టుకొచ్చాయి.

కేవలం ఫేస్‌బుక్, దాని అనుబంధ సంస్థలు మాత్రమే నిలిచిపోవడం పలు ఊహాగానాలకు దారితీసింది. అయితే టెక్ నిపుణులు (Tech Experts) మాత్రం ఇంటర్నెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఈ సమస్య తలెత్తి ఉండొచ్చని అభిప్రాయ పడుతున్నారు. ముఖ్యంగా డీఎన్ఎస్, బీజీపీ వల్ల సేవలు నిలిచిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ సమయంలో కుట్ర సిద్ధాంతకర్తలు ఇది ఒక భారీ హ్యాక్ అని ప్రచారాలు చెయ్యటం మొదలెట్టారు.

అంతేకాదు, మాజీ ఫేస్‌బుక్ ఉద్యోగిని ఫ్రాన్సిస్ హౌగెన్ (37) టెక్ దిగ్గజం గురించి సంచలన విషయాలు వెల్లడించారు. ఫేస్‌బుక్ కావాలనే ప్రజలను పక్కదారి పట్టిస్తోందని ఆమె "సిక్స్ టీ మినిట్స్(60 Minutes) ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ద్వేషపూరిత ప్రసంగాలు, దుష్ప్రచారాలు అరికట్టేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను కూడా ఫేస్‌బుక్ పక్కదారి పట్టిస్తుందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఈ సమయంలో ఒక పాపులర్ కాన్‌స్పిరసీ థియరీ తెరపైకి వచ్చింది. దాని ప్రకారం హ్యాకింగ్ ఫోరమ్‌లో 1.5 బిలియన్ల ఫేస్‌బుక్ రికార్డులను విక్రయించారట.

X2-ఈమెయిల్స్ అనే కంపెనీ సెప్టెంబర్ 22న ఒక సంచలన పోస్ట్‌ను షేర్ చేసింది. అందులో "ఈ ఏడాది ఫేస్‌బుక్ తమ సైట్ యూజర్ల నుంచి 1.5 బిలియన్ డేటాబేస్ కంటే ఎక్కువ సమాచారం సేకరించింది. ఈ డేటాబేస్ లో 100% ఈమెయిల్‌లు, ఫోన్ నంబర్లు కూడా ఉన్నాయి" అని పేర్కొంది. అయితే ఇప్పుడు X2 ఈమెయిల్స్ పోస్ట్ గురించి కూడా యూజర్లు మాట్లాడుకుంటున్నారు. నిజానికి ఆ పోస్టు.. "అన్ని వెబ్ సైట్లు బేసిక్ ఇన్ఫర్మేషన్ (ఈమెయిల్స్, జెండర్, లొకేషన్, సిటీస్) సేకరించినట్లే (data scraped) ఫేస్‌బుక్ డేటా సేకరించింది." అని మాత్రమే వెల్లడించింది. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ సేకరణ ఎలాంటి హ్యాక్ కు సంబంధించిన చర్య కాదు. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్న కాన్‌స్పిరసీ థియరీ స్కామ్ అయ్యే అవకాశం ఉంది. ఫేస్ బుక్ డేటా కొన్నట్లు చెప్పే విక్రేతలను ఇతర యూజర్లు నమ్మవద్దని కొందరు హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: Shocking: ఉదయాన్నే నీళ్లు రావట్లేదు.. ట్యాంక్ మూత తీసి చూడమని కూతురికి చెప్పిన తల్లి.. చూసి భయంతో కేకలేసిన కూతురు..!

"స్కామర్ 20 మంది యూజర్ల డేటా మాత్రం సెండ్ చేస్తున్నాడు. ఈ 20 ఐడీల డేటా నమ్మి 5,000 డాలర్లు పంపితే మోసపోయినట్లే. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి" అని టెక్నాలజీ నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పుడిప్పుడే హ్యాకింగ్ నేర్చుకుంటున్న కొందరు అందరికీ తెలిసిన బేసిక్ ఇన్ఫర్మేషన్(scraped data) అమ్మకానికి పెడుతుంటారు. కొందరి దగ్గర నిజంగా హ్యాక్ చేసిన డేటా ఉండొచ్చు కానీ చాలా మంది స్కామ్ చేయడానికే ప్రయత్నిస్తారు. అందుకే జాగ్రత్తగా ఉండటం ముఖ్యం అని నిపుణులు చెబుతున్నారు.
Published by:Sambasiva Reddy
First published: