• HOME
  • »
  • NEWS
  • »
  • EXPLAINED
  • »
  • CONGRESS PARTY IN KERALA FACED MAY SPLITS AND GROUP HERE IS THE FULL DETAILS AK GH

ఆ రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎప్పుడూ చీలికలే.. త్వరలోనే ఎన్నికలు.. ఇప్పుడేంటి పరిస్థితి ?

ఆ రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎప్పుడూ చీలికలే.. త్వరలోనే ఎన్నికలు.. ఇప్పుడేంటి పరిస్థితి ?

ఫ్రతీకాత్మక చిత్రం

కేరళ కాంగ్రెస్ గురించి చెప్పాలంటే అదో పెద్ద మ్యూజికల్ ఛైర్ గేమ్ లాంటిది అంటుంటారు రాజకీయ నిపుణులు. ప్రతి ఒక్కరూ కేవలం సీటు కోసమే ఇటు, అటు తిరుగుతూ ఉంటారు.

  • Share this:
కేరళలో కాంగ్రెస్ పార్టీలోని వ్యక్తుల మధ్యే అభిప్రాయ భేదాలు, బలహీనతలు ఉన్నట్లు ఆ పార్టీ నేతలే ఒప్పుకుంటున్నారు. వీటి వల్లనే ప్రముఖ కాంగ్రెస్ నేత పీసీ చకో ఆ పార్టీకి రాజీనామా చేశారు. అంతే కాదు.. కేరళలో కాంగ్రెస్ పార్టీ ఇకపై కొనసాగదు అని చెప్పారు. కేరళలో కాంగ్రెస్ పార్టీ అనేదే లేదు. కాంగ్రెస్ (ఐ), కాంగ్రెస్ (ఎ) పార్టీలే ఉన్నాయని ఆయన చెప్పడం గమనార్హం. అయితే ఈ విషయాన్ని వ్యతిరేకిస్తూ చకోకి ప్రజల్లో అభిమానులు తగ్గిపోయారని.. అందుకే రాజకీయాల నుంచి తప్పుకునేందుకు ఆయన ఈ మార్గాన్ని ఎంచుకున్నారని కాంగ్రెస్ పార్టీలోని వ్యక్తులు ఆయనను విమర్శిస్తున్నారు.

గతంలో ఎమర్జెన్సీ సమయంలో ఎన్నికలు నిర్వహించినప్పుడు కాంగ్రెస్ పార్టీలో చీలికలు ఏర్పడ్డాయి. 1978 లో పార్టీ చీలిపోయినప్పుడు ఇందిరా గాంధీకి చెందిన వర్గం తమ కాంగ్రెస్ పార్టీ పేరును కాంగ్రెస్ (ఐ) గా నిర్ధారించుకున్నారు. ఈ క్యాంప్ నే కాంగ్రెస్ (ఆర్ ) గా కూడా వ్యవహరిస్తారు. ఇక కామరాజ్ అధ్యక్షతన నడిచే కాంగ్రెస్ (ఒ) పార్టీ అసలైన కాంగ్రెస్ పార్టీ అని చెబుతారు. అయితే ఆ తర్వాత ఇది కూడా వేరే పార్టీలో కలిసిపోయింది. మాజీ ముఖ్యమంత్రి కరుణాకరన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంప్ లో కె. సుధాకరన్, వీడీ సతీషన్, కె మురళీధరన్ వంటివారు కలిసి కొత్త క్యాంప్ ప్రారంభించారు. కాంగ్రెస్ (ఒ) కూడా అందులోనే విలీనమైంది. దీన్ని కాంగ్రెస్ ఉర్స్ గా వ్యవహరిస్తారు. మాజీ ముఖ్యమంత్రి అయిన డి. దేవరాజ్ ఉర్స్ దీనికి ప్రధాన అధ్యక్షత వహించారు. ఇది ఇందిరా కాంగ్రెస్ కి వ్యతిరేకంగా నిలవడం విశేషం.

అయితే ఆ తర్వాత కూడా పార్టీ ఒక్కటే అయినా దానిలోనే క్యాంపులు విడిపోవడం, కొత్త క్యాంపులు ఏర్పడడం సహజంగా మారింది. చివరికి కేరళలో యునైటెడ్ కాంగ్రెస్ పార్టీ అనేదే లేకుండా అయిపోయింది. ఎప్పుడు చీలికలతో కొట్లాటలతోనే సాగుతూ వచ్చింది. ఈ తరుణంలో ప్రముఖ కేరళ లీడర్ ఏకే ఆంటోనీ నేతృత్వంలో మరో కాంగ్రెస్ క్యాంప్ ని ప్రారంభించారు. అందుకే ఈ కాంగ్రెస్ పార్టీ కి కాంగ్రెస్ (ఎ) అని పేరు వచ్చింది. ఉర్స్ కాంగ్రెస్ లో సభ్యులుగా ఉన్నవారు కూడా 1980లో దాని నుంచి విడిపోయి ఇందులో భాగస్థులయ్యారు.

ఊమన్ చాందీ, ఎంఎం హస్సన్ వంటి నేతలతో పాటు ఎంతోమంది యువనేతలు కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలంటే ఏదో ఒక క్యాంప్ పట్ల విశ్వాసం చూపిస్తేనే అది సాధ్యమవుతుందని అప్పట్లో అందరూ భావించేవారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఒక్కటిగా ఉన్నా అందులో మాత్రం క్యాంప్ రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇవి పార్టీలోపలి విషయంగా మారిపోయాయి. కాంగ్రెస్ లోని ఒక పక్షం నేత ముఖ్యమంత్రిగా ఎంపికైతే మరో వర్గం నేతను పార్టీ అధ్యక్షుడిగా ఎంపిక చేయడం ద్వారా అధిష్టానం కూడా పార్టీలో గొడవలు లేకుండా కొనసాగిస్తూ వచ్చింది. రెండు వర్గాలు పార్టీలో తమ పక్షమే ప్రధానమైనదని చెప్పుకుంటూ ఉండేవి. ఏకే ఆంటోనీ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ (ఎ) ఈకే నాయనర్ ప్రభుత్వానికి మద్దతును అందించింది.

అయితే 1982లో ఆ ప్రభుత్వం కూలిపోవడంతో ఈ వర్గం తిరిగి కాంగ్రెస్ లో చేరింది. కరుణాకరన్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ వర్గం కూడా ఎల్ డీఎఫ్ ప్రభుత్వంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో చేతులు కలిపింది. కానీ ఎల్ డీఎఫ్ తమ వర్గానికి తగినంత ప్రాధాన్యం ఇవ్వట్లేదని తిరిగి అసెంబ్లీ ఎలక్షన్ల సమయంలో వారు కూడా కాంగ్రెస్ తోనే కలిసిపోయారు. ఇలా కేరళలో కాంగ్రెస్ పార్టీ విడిపోవడం, కలిసిపోవడం వంటివి కామన్ గా మారిపోయాయి.

తాజా పరిస్థితి ఇది..
కేరళ కాంగ్రెస్ గురించి చెప్పాలంటే అదో పెద్ద మ్యూజికల్ ఛైర్ గేమ్ లాంటిది అంటుంటారు రాజకీయ నిపుణులు. ప్రతి ఒక్కరూ కేవలం సీటు కోసమే ఇటు, అటు తిరుగుతూ ఉంటారు. అయితే వారు గ్రూప్ లు మార్చుకోవడం పెద్దగా జరగదు కానీ కొంత కాలం తర్వాత ఏ గ్రూప్ కి సంబంధం లేకుండా వ్యవహరిస్తారు అంటున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రకారం కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ (ఎ) కాస్త ఎక్కువ మంది మద్దతు ఉందట. ఈ వర్గం నుంచే ఎక్కువ మంది ముఖ్యమంత్రులు ఎంపికవ్వడం కూడా విశేషం. అయితే ఆంథోనీ, కరుణాకరన్ వంటి వాళ్ల పేర్లను ప్రస్తుతం కాంగ్రెస్ మర్చిపోయింది. ప్రస్తుతం మొత్తం ఛాందీ, చేని నాథల్ మధ్యలోనే పోటీ నడుస్తోంది. 2013 లో ఆంథోనీ రిటైర్డ్ అయినప్పటి నుంచి ఈ రెండు వర్గాల మధ్య వైరం పెరిగిపోయింది. అయితే ఈ రెండు వర్గాలకు చెందిన మరో వ్యక్తి కేరళ కాంగ్రెస్ లో ఉన్నారు. ఆయనే శశి థరూర్. ఆయన కేవలం హైకమాండ్ కే విధేయుడుగా ఉంటారు. ఎన్నికల సమయంలో మాత్రం సీఎం అభ్యర్థి, ఈ రెండు వర్గాల మధ్య వైరం లాంటివి బాగా హైలైట్ అవుతుంటాయి.
First published: