హోమ్ /వార్తలు /Explained /

Chinaతో సఖ్యత లేదు: ముఖం మీదే చెప్పేసిన భారత్: జైశంకర్, దోవల్‌తో వాంగ్ యీ భేటీ వివరాలివే..

Chinaతో సఖ్యత లేదు: ముఖం మీదే చెప్పేసిన భారత్: జైశంకర్, దోవల్‌తో వాంగ్ యీ భేటీ వివరాలివే..

జైశంకర్, దోవల్‌తో వాంగ్ యీ భేటీ

జైశంకర్, దోవల్‌తో వాంగ్ యీ భేటీ

చైనా కుత్సిత నీతిని భారత్ మరోసారి ఎండగట్టింది. ఏకంగా చైనా విదేశాంగ మంత్రి ముఖం మీదే.. ‘మీతో మాకు సఖ్యత లేదు’ అని కుండబద్దలు కొట్టింది. ఢిల్లీకి వచ్చిన చైనీస్ అతిథికి రాచమర్యాదలు చేస్తూనే భారత్ తెలివిగా తన వ్యతిరేకతను ప్రదర్శించింది.

ఇంకా చదవండి ...

ఓ చేత్తో షేక్ హ్యాండ్ ఇస్తున్నట్లు నటిస్తూ, మరో చేతిలోని చురకత్తితో వెన్నుపోటుకు యత్నించే చైనా కుత్సిత నీతిని భారత్ మరోసారి ఎండగట్టింది. ఏకంగా చైనా విదేశాంగ మంత్రి ముఖం మీదే.. ‘మీతో మాకు సఖ్యత లేదు’ అని కుండబద్దలు కొట్టింది. ఢిల్లీకి వచ్చిన చైనీస్ అతిథికి రాచమర్యాదలు చేస్తూనే భారత్ తెలివిగా తన వ్యతిరేకతను ప్రదర్శించింది. లదాక్ సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడే దిశగానూ భారత్ తన వంతు కృషి చేసింది. ఢిల్లీ పర్యటనకు వచ్చిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ శుక్రవారం నాడు మన విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో భేటీ అయి, కీలక అంశాలు చర్చించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం గురించి కూడా నేతలు మాట్లాడుకున్నారు. ఆ సమావేశాల పూర్తి వివరాలివే..

చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఢిల్లీలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్, ఎన్ఎస్ఏ దోవల్ తో భేటీ అయి, కీలక అంశాలపై చర్చలు జరిపారు. దేశ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడు.. రెండు దేశాల మధ్య సఖ్యత ఉందని తాను చెప్పలేనని జైశంకర్‌.. వాంగ్ యీ ముఖం మీదే వ్యాఖ్యానించారు. తూర్పు లదాక్, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులపై చైనాకు ఇండియా స్ట్రాంగ్‌ మెసేజ్‌ ఇచ్చినట్లయింది.

Numerology: ఈ తేదీన పుట్టినవారిపై సూర్యుడి ప్రభావం.. ఐడియాలను డబ్బులుగా మార్చగల తెలివి..

సరిహద్దుల్లో ఉద్రిక్తతల మధ్య చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ భారత్ లో పర్యటించడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. కేంద్ర మంత్రి ఎస్‌ జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ను కలిసిన చైనా మంత్రి. సరిహద్దుల్లో నెలకొన్న ఆందోళనలను చైనా విదేశాంగ మంత్రి దృష్టికి తీసుకెళ్లామన్న జైశంకర్‌.. ఇప్పటికీ సరిహద్దులో ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాలు ఉన్నాయని స్పష్టం చేశారు.

కాగా, చైనాతో ఘర్షణ ప్రాంతాల్లో పరిస్థితులను భారత్‌ సరిచేసిందని, పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో ప్రస్తుత పరిస్థులే అందుకు నిదర్శనమని జైశంకర్ అన్నారు. ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఏం చేయాలనేదానిపై చర్చలు అవసరమని భారత్ నొక్కి చెప్పింది. ఇరు దేశాల సీనియర్‌ మిలిటరీ కమాండర్లు ఇప్పటికే 15 రౌండ్ల సమావేశాలు నిర్వహించారని, సాధారణ పరిస్థితులు నెలకొనేలా మరిన్ని సమావేశాలు అవసరమని భారత్ అభిప్రాయపడింది.

Ravi Pillai: అత్యంత ఖరీదైన లగ్జరీ హెలికాప్టర్ కొన్న తొలి భారతీయుడు.. Viral Photos అదుర్స్!

సరిహద్దు వివాదాలకు సంబంధించి 1993, 1996 ఒప్పందాలకు విరుద్ధంగా సరిహద్దుల్లో బలగాల మోహరింపు కొనసాగుతున్నదని, అలాంటప్పుడు రెండు దేశాల మధ్య సాధారణ పరిస్థితులు ఉన్నాయని చెప్పలేమన్నారు మంత్రి జైశంకర్‌. 2020లో గాల్వాన్ ఘర్షణ తర్వాత రెండేళ్లలో భారత్, చైనా మధ్య ఇదే మొదటి దౌత్యపరమైన సమావేశం ఇదే కావడం విశేషం. గాల్వాన్ ఘర్షణలో 20 మంది భారతీయులు, కనీసం నలుగురు చైనా సైనికులు మరణించారు.

ఇరుదేశాల మధ్య నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతల ప్రభావం ఇతర ప్రాంతాల్లోనూ కనిపిస్తోందన్న మంత్రి జైశంకర్. సరిహద్దులో నెలకొన్న పరిస్థితుల ప్రభావం గత రెండేళ్ల వ్యవహారాల్లో చూడొచ్చన్నారు. సంబంధాలు బాగుండేందుకు అవసరమైన శాంతి, ప్రశాంతత లేనప్పుడు పరిస్థితులు ఇలానే ఉంటాయని వ్యాఖ్యానించారు. చర్చలో చైనా విదేశాంగ మంత్రికి భారతదేశ భావాలను స్పష్టంగా తెలియజేశామని జైశంకర్ పేర్కొన్నారు.

Ukraine War: కుప్పకూలిన పుతిన్ కూతురి కాపురం.. భర్త నుంచి మారియా విడాకులు.. యుద్దం వల్లే?

చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఢిల్లీ పర్యటనలో భారత్ ఘాటుగా ప్రతిస్పందించిన దరిమిలా సరిహద్దులో బలగాల ఉపసంహరణ దిశగా డ్రాగన్ నిర్ణయం తీసుకోనున్నట్లు రిపోర్టులు వచ్చాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో జరిగిన సమావేశంలో వీలైనంత త్వరగా బలగాల ఉపసంహరణకు వాంగ్ యీ హామీ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడున్న పరిస్థితులు ఇరు దేశాలకూ ప్రయోజనకరం కాదని అజిత్‌ దోవల్‌, వాంగ్‌ యీ అంగీకరించారని ప్రభుత్వ వర్గాల సమాచారం.

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను చైనా సందర్శనకు ఆహ్వానించిన చైనా మంత్రి వాంగ్ యీ. కాగా, కాశ్మీర్‌ అంశంపై ఇస్లామాబాద్‌ ఓఐసీ సమావేశంలో వాంగ్‌ యీ చేసిన వ్యాఖ్యలకు గట్టిగా బదులిచ్చిన భారత్‌. ఓఐసీ మీట్‌లో కశ్మీర్‌ వివాదంపై ఇస్లామిక్‌ మిత్ర దేశాల వైఖరి మళ్లీ విన్నాం.. చైనా ఉద్దేశమూ అదేనన్న వాంగ్ యీ. జమ్మూకశ్మీర్‌పై చైనా అధికారమేంటని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన ఇండియా.

BSP: మాయవతి కీలక నిర్ణయం.. అల్లుడు ఆకాశ్ చేతికి అంకుశం.. యూపీలో ఘోర వైఫల్యం తర్వాత..

పాలస్తీనా, కశ్మీర్‌ ప్రజల స్వాతంత్ర్య పోరాటాలకు చైనా సాయం కొనసాగుతుందని వాంగ్ యీ నాటి సమావేశంలో వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్‌లో వాంగ్‌ యీ చేసిన వ్యాఖ్యలను భారత్‌ ఎందుకు ఖండించిందో వివరించారన్న జైశంకర్‌. భారత్‌కు సంబంధించి చైనా స్వతంత్ర విధానాన్ని పాటించాలని, ఇతర దేశాల అభిప్రాయాలను పట్టించుకోకూడదని  కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.

భారత్ చైనా విదేశాంగ మంత్రులు జైశంకర్, వాంగ్ యయీ మధ్య రష్యా ఉక్రెయిన్ యుద్ధంపైనా చర్చ జరిగింది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో తలెత్తే భౌగోళిక-రాజకీయ సమస్యలపై చర్చించిన విదేశాంగ మంత్రులు. రష్యా, ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ ఆవశ్యకతను ఇరుపక్షాలు అంగీకరించాయన్న జైశంకర్. రష్యా, ఉక్రెయిన్‌ కాల్పుల విరమణకు అంగీకరించి, సామరస్యంగా సమస్య పరిష్కరించుకోవాలన్నదే చైనా, భారత్‌ ఉద్దేశమని స్పష్టీకరణ. ఆప్ఘనిస్థాన్‌లో పరిస్థితిపై కూడా ఇరుపక్షాలు చర్చించుకున్నట్లు తెలియజేసిన జైశంకర్. ఈ ఏడాది బ్రిక్స్ సదస్సుకు అన్ని దేశాలూ హాజరవ్వాలని చైనా కోరుకొంటోందని తెలిపిన వాంగ్ యీ.

Published by:Madhu Kota
First published:

Tags: China, India, Ladakh, Russia-Ukraine War

ఉత్తమ కథలు