Dragon Man: సైంటిస్టులకు షాక్... చైనాలో వింత మనిషి... ఆశ్చర్యకర పరిశోధన

సైంటిస్టులకు షాక్... చైనాలో వింత మనిషి (image credit - twitter - Strong Bad)

Dragon Man: ఈ భూమిపైకి కోతి నుంచి మానవుడు వచ్చాడనేది ఓ థియరీ. దీనికి భిన్నంగా చైనాలో మరో రకమైన మనుషులు జీవించినట్లు తేలడం షాకింగ్ విషయం. అసలు సైంటిస్టులు ఏమంటున్నారు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

  • Share this:
    Dragon Man: చైనాలో పరిశోధకులకు ఓ పురాతన పుర్రె దొరికింది. అది మనిషిదే అని అర్థమవుతున్నా... మనిషి పుర్రెలా మాత్రం లేదు. మనుషుల్లోనే అదో రకమైన జాతి కావచ్చు అనే డౌట్ వచ్చేలా ఉంది. ఈ పుర్రె ఇప్పుడు దొరకలేదు. 1933లో హార్బిన్ దగ్గర దొరికింది. ఇన్నాళ్లూ దీన్ని పట్టించుకోకుండా వదిలేశారు. దీన్ని 85 ఏళ్లుగా ఓ బావిలో దాచి ఉంచారు. ఎందుకంటే... జపాన్ ఆర్మీ నుంచి దీన్ని కాపాడాలని అలా చేశారు. దాంతో... ఈ పుర్రె కాలక్రమంలో బావిలో దుమ్ముతో నిండిపోయింది. ఐతే... 2018లో ఈ పుర్రెను తిరిగి తవ్వి... హెబీ Geo యూనివర్శిటీ ప్రొఫెసర్ జి కియాంగ్ చేతిలో పెట్టారు. ఆయన దాన్ని తీసుకెళ్లి... ఈశాన్య చైనాలో భద్రపరిచారు. పరిశోధనల ప్రకారం ఈ పుర్రె ఉన్న వ్యక్తి 1,40,000 ఏళ్ల కిందట చైనాలో తిరిగినట్లు లెక్క.

    ఈ భూమిపై మనుషులను పోలినట్లు ఉండే ఆది మానవులు నియాండెర్తల్స్ (Neanderthals) తర్వాతి తరంగా చెబుతున్నారు. ఈ కొత్త పాత పుర్రె కలిగిన మానవులు... నియాండెర్తల్స్‌కి, మనుషులకీ మధ్య దగ్గర పోలికలు కలిగివున్నట్లు అంచనా వేస్తున్నారు. కాకపోతే ఈ మానవులు ప్రత్యేక జాతి అని అంటున్నారు. దీంతో... అసలు ఆఫ్రికా ఖండం నుంచి మనుషులు ఏయే ఖండాలపై ఎప్పుడెప్పుడు వెళ్లారు... ఎలాంటి మార్పులు వారిలో వచ్చాయనేది మరోసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.


    ఈ కొత్త మనిషి చనిపోయినప్పుడు 50 ఏళ్ల వయసు ఉంటుందని అంచనా వేశారు. మగ వ్యక్తిగా తేల్చారు. కళ్లు లోతుగా ఉన్నాయని తేల్చారు. మెదడు మాత్రం చాలా పెద్దగా ఉందట. నుదుటి భాగం చాలా మందంగా ఉందని పరిశోధనలో తేలింది. ముఖం చాలా పొడవుగా కోలగా ఉంది... దవడలు తిన్నగా ఉన్నాయి. ఈ పరిశోధన వివరాల్ని ది ఇన్నోవేషన్ జర్నల్‌లో రాశారు.

    ఇది కూడా చదవండి: HERO E-Bikes: యూరప్ దేశాలకు ఈ-బైక్స్ పంపిన హీరో సైకిల్స్... మేడ్ ఇన్ ఇండియా

    2019లో గ్రీకు గుహలో... ఓ పగిలిన పుర్రె సైంటిస్టులకు దొరికింది. ఆఫ్రికా కాకుండా ఇతర ఖండాల్లో దొరికిన పురాతన ఆధునిక మానవుల్ని పోలిన పుర్రె అదే అంటున్నారు. అది 2,10,000 నాటిదిగా తెలిపారు. మొత్తానికి ఇలా ఆది మానవులు... ఆఫ్రికా నుంచి వేర్వేరు ఖండాలకు వెళ్లి జీవించారు. తద్వారా వేర్వేరు పురాతన పుర్రెలు దొరుకుతున్నాయి.
    Published by:Krishna Kumar N
    First published: