Chhatisgarh Naxal encounter: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు చేసిన దాడి వెనక మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు మడ్వి హిడ్మా ఉన్నట్లు తెలుస్తోంది. అతను ఎవరో, ఏం చేస్తున్నాడో తెలుసుకుందాం.
Chhatisgarh Naxal encounter:నక్సలిజం చరిత్రలో మరో చీకటి అధ్యాయం... తాజాగా జరిగిన మావోయిస్టుల దాడి. ఛత్తీస్‌గఢ్ అడవుల్లో శనివారం పచ్చదనం పోయి... రక్తంతో చెట్లన్నీ ఎర్రబారాయి. ఎటు చూసినా... ప్రాణహానే. ఎన్కౌంటర్లో ఇటు భద్రతా బలగాలు, అటు మావోయిస్టులు... రెండువైపులా భారీగా ప్రాణనష్టం జరిగింది. మృతులంతా చెట్టుకొకరు, పుట్టకొకరుగా చెల్లాచెదురుగా పడిపోయారు. ఈ దాడిలో 24 మంది భద్రతా బలగాలు అమరులవ్వగా... 30 మంది మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తోంది. కచ్చితంగా ఎంత మంది చనిపోయారో తెలియట్లేదు. ప్రస్తుతం కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్... బీజాపూర్‌లో ఉన్న CRPF డీజీ కుల్దీప్ సింగ్... పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
మడ్వి హిడ్మా (Hidma) ఎవరు?
ఈ దాడి తర్వాత... తెరపైకి వచ్చిన పేరు మడ్వి హిద్మా. ఇతనో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు కమాండర్. ఇతనే ఈ దాడికి సూత్రధారి అనీ, ఇతనే ప్లాన్ వేశాడనే అనుమానాలు కలుగుతున్నాయి. 3 గంటలకు పైగా ఎన్కౌంటర్ కొనసాగిందంటే... హిడ్మా ఏ రేంజ్లో స్కెచ్ వేసి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు.
అసలేం జరిగింది?
ఏప్రిల్ 2న బీజాపూర్ అడవుల్లో భద్రతా దళాలు భారీ కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. సుక్మా-బీజాపూర్ సరిహద్దులోని సౌత్ బస్తర్ అడవిలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గ్రూప్ (DRG), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కలిసి 2వేల మంది జవాన్లు అడవులను గాలించారు. శనివారం తారెమ్ ప్రాంతంలో 400 సభ్యులతో కూడిన జవాన్ల బృందంపై 600 మంది మావోయిస్టులు మెరుపు దాడిచేశారు. దాంతో రెండువైపులా భీకర పోరు జరిగింది.
#WATCH | Delhi: Home Minister Amit Shah taking top-level meeting with senior officers on Bijapur encounter at his residence.
Home Secretary Ajay Bhalla, Director IB Arvinda Kumar and senior CRPF officers are attending the meeting. pic.twitter.com/3opzROJC7g
హిడ్మా ఏం చేస్తున్నాడు?
హిడ్మా... 21 సభ్యుల మావోయిస్టు సెంట్రల్ కమిటీలో సభ్యుడు. ఆ టీమ్‌లో ఇతనే చిన్నవాడు.
హిడ్మానే చేయించాడని ఎలా చెబుతున్నారు?
కొన్నాళ్లుగా హిడ్మా బీజాపూర్ ప్రాంతంలోనే ఉంటున్నాడని నిఘా వర్గాల నుంచి సమాచారం ఉంది. ఇతను ప్లాన్స్ వెయ్యడంలో దిట్ట. సడెన్‌గా దాడులు చేయించడంలో హిడ్మాకి మంచి పట్టుంది.
దాడిలో మావోయిస్టుల దగ్గర ఏ ఆయుధాలు ఉన్నాయి?
ఈసారి జరిగిన దాడిలో... భద్రతా బలగాల రాకను ముందే గుర్తించిన మావోయిస్టులు పెద్ద సంఖ్యలో కాపుకాశారు. వారి దగ్గర లైట్ మెషిన్ గన్స్ ఉన్నాయి. సరిగ్గా భద్రతా బలగాలు తమకు సమీపంలోకి రాగానే... చుట్టుముట్టి కాల్పులు జరిపారని సమాచారం.
హిడ్మా వయసు ఎంత ఉంటుంది?
హిడ్మా ఓ గిరిజనుడు. వయసు దాదాపు 40 ఏళ్లు ఉంటుంది. ఇతనికి స్వయంగా 180 నుంచి 250 మంది దాకా మావోయిస్టు ఫైటర్లు ఉన్నారు. వాళ్లను ఇతనే నడిపిస్తున్నాడు.
హిడ్మా అంత క్రూరుడా?
హిడ్మా చాలా డేంజరస్. అతని ఆలోచనలు భయంకరంగా ఉంటాయి. శత్రువుల్ని చంపాలనే కసి చాలా ఎక్కువ. ఉన్నట్టుండి దాడులు చేయించడంలో హిడ్మా ఆరితేరాడు. చిన్న చిన్న దాడులు చేయించడం హిడ్మాకు నచ్చదు. దాడి జరిగితే... వందల సంఖ్యలో జవాన్లు చనిపోవాలని కోరుకునే రకం.
గెరిల్లా దళాలేమైనా నడుపుతున్నాడా?
అవునని తెలిసింది. పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా బెటాలియన్ నంబర్ వన్ను ఇతనే నడుపుతున్నట్లు సమాచారం ఉంది.
హిడ్మాను పట్టి అప్పగిస్తే ఏం ఇస్తారు?
హిడ్మా తలపై రూ.40 లక్షల రివార్డ్ ఉంది. కానీ అతన్ని పట్టుకోవాలంటే ముందు... అతని చుట్టూ ఉన్న సామ్రాజ్జాన్ని కంట్రోల్ చెయ్యాలి. అప్పుడే అది సాధ్యమని నిఘావర్గాలు భావిస్తున్నాయి.
ప్రస్తుతం పరిస్థితి ఏంటి?
ప్రస్తుతం జవాన్లకు ఇదో పరీక్షా సమయం. అసలీ మావోయిస్టుల సమస్యను ఎలా పరిష్కరించాలనే దానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన 30 మంది జవాన్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొందరు జవాన్ల ఆచూకీ లభించట్లేదు. వారి కోసం బీజాపూర్ అడవుల్లో భద్రతా దళాలు గాలిస్తున్నాయి... అలాగే మావోయిస్టుల కోసం కూంబింగ్ కూడా కొనసాగుతోంది.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.