Home /News /explained /

CAN VPN BE TRACKED OR HACKED KNOW ALL ABOUT VPN GH VB

Explained: VPN టూల్ ఎంతవరకు సేఫ్‌..? దీన్ని ట్రాకింగ్, హ్యాకింగ్ చేయవచ్చా..?పూర్తి సమాచారం ఇలా..

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

డిజిటల్ సెక్యూరిటీ, ప్రైవసీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ యూజర్లు VPNలను ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో VPN ప్రాధాన్యం ఏంటి? దీన్ని ట్రాక్ చేసి హ్యాక్ చేయవచ్చా? VPN యూజర్లకు ఎలా రక్షణ కల్పిస్తుంది? వంటి వివరాలు తెలుసుకుందాం.

ఆన్‌లైన్‌లో ఎక్కువ టైమ్ గడిపేవారు డిజిటల్ ప్రైవసీ, ప్రొటక్షన్‌ గురించి ఆందోళన చెందుతుంటారు. హ్యాకర్లు వ్యక్తుల వివరాలను ట్రేస్ చేయడం, ఐడెంటిటీని దొంగిలించడం లేదా వారి క్రెడిట్ కార్డ్‌లను యాక్సెస్ చేయడం.. వంటివి ఈ రోజుల్లో సాధారణంగా మారాయి. దీంతో డిజిటల్ సెక్యూరిటీ, ప్రైవసీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ యూజర్లు VPNలను ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో VPN ప్రాధాన్యం ఏంటి? దీన్ని ట్రాక్ చేసి హ్యాక్ చేయవచ్చా? VPN యూజర్లకు ఎలా రక్షణ కల్పిస్తుంది? వంటి వివరాలు తెలుసుకుందాం.

New Work Structure: వర్క్ ఫ్రమ్ హోమ్ పై ప్రభుత్వం తీసుకురానున్న నిబంధనలు ఇవే.. వివరాలిలా.. 


VPN అంటే ఏంటి..?
VPN అంటే వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్. ఇది ఒక ఇంటర్నెట్ టూల్. ఇది యూజర్లకు, ఇంటర్నెట్​కు సురక్షితమైన కనెక్షన్​ అందిస్తుంది. దీని సాయంతో ఆన్​లైన్​లో మిమ్మల్ని ఎవరూ ట్రాక్​ చేయకుండా, సురక్షితంగా, మీకు కావాల్సిన వెబ్​సైట్లను ఉపయోగించవచ్చు. మీరు తక్కువ సేఫ్టీ ఉండే పబ్లిక్ కనెక్షన్ లేదా హోమ్ ఇంటర్నెట్ కనెక్షన్‌కు కనెక్ట్ అయినప్పుడు ప్రైవేట్ నెట్‌వర్క్‌ను సులభంగా సృష్టించేందుకు సహాయపడుతుంది. నెట్‌వర్క్ ట్రాఫిక్‌, మీ IP అడ్రస్, లొకేషన్ వంటి వివరాలను VPN ఎన్‌క్రిప్ట్ చేస్తుంది.

VPNను ఎందుకు ఉపయోగిస్తారు..?
మీ డివైజ్‌లో డౌన్‌లోడ్, అప్‌లోడ్ చేసిన డేటాను థర్డ్-పార్టీ ట్రాకర్‌లు, మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP), వెబ్‌సైట్‌లు, మాల్వేర్, స్పైవేర్ వంటివి గుర్తించకుండా VPN కాపాడుతుంది. VPNను ఉపయోగించినప్పుడు మీ IP అడ్రస్, లొకేషన్‌ను ఎవరూ ట్రాక్ చేయలేరు. మీరు ఆన్‌లైన్‌లో ఏం చేస్తున్నారనేది ఎవరూ గుర్తించలేరు. మీ ఆన్‌లైన్ సెషన్‌ను హ్యాకర్ ట్రేస్ చేసినప్పటికీ, ఆ డేటా ఎన్‌క్రిప్ట్ అవుతుంది.

VPN ఎలా పని చేస్తుంది..?
వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌(VPN)లు ఇంటర్నెట్ రీజియన్ చెక్స్‌ను, సెన్సార్‌షిప్‌ను ఓవర్ రైడ్ చేసి రిస్రిక్టెడ్ కంటెంట్‌ను యాక్సెస్ చేస్తాయి. ఉదాహరణకు భారతదేశంలో అందుబాటులో లేని Netflix షోలను VPNని ఉపయోగించి చూడవచ్చు.

VPNను ఉపయోగిస్తున్నప్పుడు ఎవరైనా మిమ్మల్ని ట్రాక్ చేయగలరా..?
వాస్తవానికి అత్యంత సురక్షితమైన సర్వర్లు, కనెక్షన్‌లను కూడా కొన్నిసార్లు ట్రేస్ చేయవచ్చు. హ్యాకింగ్ కంటే ట్రాకింగ్ చాలా సులభం, కానీ ఇది అంత హానికరంకాదు. సమాచారాన్ని బహిర్గతం చేయదు. చొరబాటుదారులు వెతికే అంశాలు ఏంటి అనేది వారికి నిర్దిష్టంగా తెలిస్తే, మీ డేటాను సులభంగా ట్రాక్ చేయవచ్చు. మీరు హై-ప్రొఫైల్ పర్సన్ లేదా హై-టెక్ శత్రువులు ఉన్న వ్యక్తి అయితే.. VPN కనెక్షన్‌ ఉన్నప్పటికీ, ట్రాక్ చేయడం సాధ్యమవుతుంది. అయితే మీ నిర్దిష్ట కనెక్షన్‌ను గుర్తించడానికి అవసరమైన మొత్తం డేటా, డిజిటల్ ఇన్‌ఫర్మేషన్‌ను యాక్సెస్ చేసేందుకు చాలా సమయం తీసుకుంటుంది. ఇది చాలా ఖరీదైన విషయం. కాబట్టి మీకు VPN సెక్యూరిటీ ఉన్నప్పటికీ, ఇవి వంద శాతం రక్షణ అందిస్తాయని చెప్పలేం.

Xiaomi 12: డిసెంబర్​ 28న మార్కెట్​లోకి షియోమి12 స్మార్ట్​ఫోన్.. ఆన్​లైన్​లో లీకైన ఫీచర్ల వివరాలివే..


మీరు VPN యూజ్ చేస్తున్నప్పటికీ, మిమ్మల్ని ఎవరూ ట్రాక్ చేయకూడదంటే ప్రీమియం పెయిడ్ VPN ప్రొవైడర్‌ సేవలను ఉపయోగించుకోవచ్చు. ఫ్రీ- VPNలు యాప్‌లు ప్రకటనల ద్వారా కొన్నిసార్లు మీ డేటాను విక్రయించడం ద్వారా డబ్బు సంపాదిస్తాయి. ఇలాంటి ఉచిత VPN కూడా మీ ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఎన్‌క్రిప్ట్ చేయగలదు. ఆన్‌లైన్ బెదిరింపుల నుంచి మిమ్మల్ని రక్షించగలదు. కానీ ఆ కనెక్షన్‌కు నిర్దిష్ట లాగింగ్ విధానాలు (no-logging policies) ఉండకపోవచ్చు. అందువల్ల మీరు ట్రాకింగ్ గురించి ఆందోళన చెందుతుంటే, మీ VPN ప్రొవైడర్‌కు నో లాగింగ్ పాలసీ ఉందో లేదో తనిఖీ చేయండి. అవసరమైతే మరో వీపీఎన్ ప్రొవైడర్‌ సేవలను యాక్సెస్ చేసుకోండి.

New Rules: జనవరి 1 నుంచి అమల్లోకి కొత్త GST నిబంధనలు.. ఆందోళనలో నిపుణులు.. కారణం ఏంటంటే.. 


ప్రమాదకరమైన లేదా సెన్సార్డ్ దేశాలలో ఉన్న వారికి ప్రీమియం VPN అవసరమవుతుంది. ఆ దేశాల్లో చట్టవిరుద్ధమైన లేదా బ్లాక్ చేసిన వెబ్‌సైట్‌లను క్రమం తప్పకుండా యాక్సెస్ చేస్తే, ప్రభుత్వాలు మిమ్మల్ని ట్రాక్ చేయవచ్చు. మంచి VPN సర్వీస్ ప్రొవైడర్.. ఏ ప్రభుత్వంతోనూ సహకరించని తటస్థ దేశంలో పనిచేస్తుంది. అందువల్ల ఇవి మెరుగైన సేవలను అందిస్తాయి.

VPNను హ్యాక్ చేయవచ్చా?
VPNలు సర్వర్ల కలెక్షన్లుగా (collection of servers) కాకుండా సెంట్రలైజ్డ్ ఏజెన్సీలుగా పనిచేస్తాయి. ఒక హ్యాకర్ ఒక VPN కనెక్షన్‌ను హ్యాక్ చేయడానికి ప్రయత్నిస్తే, వారికి మిలియన్ కనెక్షన్‌లు ఎదురవ్వచ్చు. సాంకేతికంగా VPN కనెక్షన్‌ను హ్యాక్ చేయగలిగినప్పటికీ, ఆ ప్రయత్నం విజయవంతం కావడానికి పెద్ద మొత్తంలో టెక్నికల్ రిసోర్సెస్ కావాలి. అలాగే బెస్ట్ క్వాలిటీ VPNలు కఠినమైన నో-లాగింగ్ విధానాలను కలిగి ఉంటాయి. VPNలు పనిచేసే సర్వర్‌లు సాంకేతికంగా ఇంటర్నెట్‌కి కనెక్ట్ చేయడానికి చాలా తక్కువ డేటాను నిల్వ చేస్తాయి. కానీ మీరు సర్వర్‌లను డిస్‌కనెక్ట్ చేసినప్పుడు లేదా మారిన ప్రతిసారీ, మీ డేటా మొత్తం రిమూవ్ అవుతుంది. కాబట్టి హ్యాకర్ VPN సర్వర్‌లోకి ప్రవేశించగలిగినప్పటికీ, వారు యాక్సెస్ చేయడానికి అతి తక్కువ సమాచారం ఉంటుంది.

VPN ప్రొవైడర్ హ్యాకింగ్ కేసులు కొన్ని వెలుగు చూశాయి. కానీ ఏజెన్సీల నో-లాగింగ్ విధానాల కారణంగా పెద్దగా డేటా దొంగతనానికి గురి కాలేదు. మరో మాటలో చెప్పాలంటే, సెక్యూరిటీ సిస్టమ్స్‌ను ట్రేస్ చేసే హ్యాకర్లు ఎప్పుడూ ఎదురవుతూనే ఉంటారు. అందువల్ల VPNకు హ్యాకింగ్‌ ప్రమాదం ఉన్నప్పటికీ, అందుకు అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

Taste The TV: టీవీని నాకండి.. అందేంటి అనుకుంటున్నారా.. నిజమే.. ఆ టేస్టే వేరు.. వివరాలివే..


ఆన్‌లైన్‌ సేఫ్టీకి చిట్కాలు
ఆన్‌లైన్‌ సేఫ్టీకి కేవలం VPN ఒక ఫైనల్ సొల్యూషన్ కాదు. ఇది కనెక్షక్స్ ఎన్‌క్రిప్షన్ కోసం పనిచేసే బెస్ట్ ప్రైవసీ, సెక్యూరిటీ టూల్. అయితే డిజిటల్ సెక్యూరిటీ కోసం బలమైన పాస్‌వర్డ్స్ ఎంచుకోవడం, డౌన్‌లోడ్ చేసే కంటెంట్‌ విషయంలో అప్రమత్తంగా ఉండటం, వైరస్ లేదా మాల్వేర్ ప్రమాదాలపై అవగాహన పెంచుకోవడం, ఫేక్ లేదా స్పామ్ ఈమెయిల్స్‌తో జాగ్రత్తగా వ్యవహరించడం.. వంటి సేఫ్టీ టిప్స్ పాటించాలి.
Published by:Veera Babu
First published:

Tags: Latest Technology, Technology

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు