పార్లమెంట్లో(Parliament) ఏ సభలోనైనా ప్రశ్నలు లేవనెత్తడానికి, వాటిని అంగీకరించడానికి, స్పీకర్ (Speaker) లేదా ఛైర్మన్ (chairman) వాటికి సమాధానం ఇవ్వడానికి ఉన్న నియమాలు ఏంటీ? కొన్ని సందర్భాల్లో ప్రత్యుత్తరం కోసం సభ్యులు అడిగిన ప్రశ్నలను తొలగిస్తుంటారు (Parliament Question Disallowed) ... ఎందుకు? పార్లమెంట్ నియమాలు (Rules of Parliament) ఏం చెబుతున్నాయి? వంటి ఆసక్తికర విషయాలపై ఇప్పుడు చర్చ జరుగుతుంది. రాజ్యసభలో డిసెంబర్ 2న కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అడిగిన ప్రశ్నను రాజ్యసభ చైర్మన్ (Chairman of the Rajya Sabha) తొలగించారు. అసలు ఆయన ప్రశ్న ఏంటంటే... అంతర్జాతీయ విమానాశ్రాయాల్లో ఎన్నారైలను వేధించి వెనక్కి పంపారా? వారిలో కొందరు రైతు నిరసనలకు మద్దతు ఇవ్వమని అన్నారా అనేది దాని సారాంశం. బుధవారం.. బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి తాను లేవనెత్తిన ప్రశ్నకు అనుమతి దొరకలేదని (Question Disallowed) చెప్పారు. లద్దాఖ్‌లో చైనీయులు ఎల్ఏసీ (LAC)ని దాటారా అనే ప్రశ్నను ఆయన సంధించారు. అయితే తన ప్రశ్నను జాతీయ ప్రయోజనాల దృష్ట్యా అనుమతించలేమని (Question Disallowed) రాజ్యసభ సెక్రటేరియట్.. తనకు తెలియజేసినట్లు ఆయన ట్వీట్ చేశారు. గత కొన్నిపార్లమెంట్ సెషన్లలో ప్రధానంగా ప్రతిపక్షాలకు చెందిన ఎంపీలు తమ ప్రశ్నలకు అనుమతి ఇవ్వలేదని (Question Disallowed) ఆరోపిస్తున్నారు.
ప్రశ్నలు ఎలా అంగీకరిస్తారు?
పార్లమెంట్ ఉభయ సభలలో ఎన్నికైన సభ్యులు (Members) వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల నుంచి నక్షత్ర గుర్తు (Star symbol) ఉన్న ప్రశ్నలు, నక్షత్ర గుర్తు లేని ప్రశ్నలు (Starless questions), స్వల్ప వ్యవధి ప్రశ్నలు (Short duration questions), ప్రైవేట్ సభ్యులకు సంబంధించిన ప్రశ్నల రూపంలో సమాచారాన్ని పొందే హక్కు (Right) ను పొందుతారు. సాధారణంగా ఎంపీల ప్రశ్నల జాబితా (List of questions) సుధీర్ఘంగా ఉంటుంది. ఇవన్నీ కూడా కఠినమైన క్లియరెన్స్ ప్రక్రియ ద్వారా వెళుతుంది. రాజ్యసభలో ప్రశ్నల ఆమోద యోగ్యత రాష్ట్రాల కౌన్సిల్‌లోని విధానపరమైన, రూల్స్ 47-50 ద్వారా నిర్వహిస్తారు. ఆమోదయోగ్యత షరతులను నెరవేర్చే ప్రశ్న వచ్చిన తర్వాత సెక్రటేరియట్ దానిని సంబంధిత మంత్రిత్వ శాఖకు పంపుతుంది. మంత్రిత్వ శాఖ (Ministry) నుంచి వాస్తవాలు అందిన తర్వాత ప్రశ్న ఆమోద యోగ్యత కోసం పరిశీలిస్తారు. ప్రశ్నల తుది జాబితా మంత్రులకు పంపిణీ చేస్తారు. దాని ఆధారంగా వారు తమ సమాధానాలను రూపొందించుకుంటారు.
లోక్‌సభ (Lok Sabha)లో ప్రశ్నలకు నోటీసు అందిన తర్వాత బ్యాలెట్లు ప్రాధాన్యత (Ballots are a priority)ను నిర్ణయిస్తాయి. నక్షత్ర గుర్తు ఉన్న ప్రశ్నలు, నక్షత్ర గుర్తు లేని, స్వల్ప వ్యవధి ప్రశ్నలు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో విడివిడిగా నమోదు చేస్తారు. ఆ తర్వాత... ఆమోదయోగ్యత కోసం పరిశీలిస్తారు. ప్రశ్నలకు సమాధానమివ్వడానికి... మంత్రిత్వ శాఖలు, విభాగాలను ఐదు గ్రూపులుగా విభజించారు. సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో సమాధానాలు ఇవ్వడానికి కేటాయించారు. ఒక్కో మంత్రికి వారంలో ఒక రోజు రాజ్యసభలో ప్రశ్నలకు సమాధానమివ్వడానికి, లోక్‌సభలో ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి మరొక రోజును నిర్ణయించే విధంగా కేటాయించారు.
నక్షత్ర గుర్తు ప్రశ్నలు...
ఈ సంబంధిత ప్రశ్నలకు సమాధానాన్ని ఆ శాఖ మంత్రి మౌఖికంగా ఇస్తారు. అందువల్ల ఒకటి, రెండు ప్రశ్నలు అడగడానికి ఛాన్స్ ఉంటుంది.
నక్షత్ర గుర్తు లేని ప్రశ్నలు...
దీనికి సంబంధించిన ప్రశ్నలకు సంబంధిత మంత్రి లిఖిత పూర్వక జవాబు (Written answer) ఇస్తారు. అందువల్ల ఇతర ప్రశ్నలకు ఛాన్స్ ఉండదు.
స్వల్ప వ్యవధి ప్రశ్నలు...
ఇంపార్టెంట్ (Important), ప్రజా ప్రాధాన్యత అంశాలపై మౌఖికంగా అడిగే ప్రశ్నలను స్వల్ప వ్యవధి ప్రశ్నలు అంటారు. ఈ ప్రశ్నలను అడగాలంటే సాధారణంగా ఈ ప్రశ్నలకు 10 రోజుల ముందు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది.
ప్రైవేట్ సభ్యునికి ప్రశ్న...
లోక్‌సభ విధివిధానాల్లోని రూల్ 40, రాజ్యసభ రూల్స్ (Rajya Sabha Rules)లోని రూల్ 48 ప్రకారం, ఏదైనా బిల్లు, తీర్మానం, ఇతర విషయానికి సంబంధించిన అంశంతో వ్యవహరిస్తే ప్రైవేట్ సభ్యునికి ప్రశ్న సంధించవచ్చు.
ప్రశ్నోత్తరాల సమయం...
ఉభయ సభలలో ప్రతి సిట్టింగ్‌లో మొదటి గంట సాధారణంగా ప్రశ్నలు అడగడానికి, సమాధానం ఇవ్వడానికి కేటాయిస్తారు. దీనిని ప్రశ్నోత్తరాల సమయం (Question time) అంటారు. మౌఖిక సమాధానాల కోసం 15 ప్రశ్నలు... రాతపూర్వక సమాధానాల కోసం ఒక జాబితా నుంచి మరొకదానికి వాయిదా వేసిన ప్రశ్నలు (Postponed questions), రాష్ట్రపతి పాలనలో రాష్ట్రాలకు సంబంధించిన 15 ప్రశ్నలతో సహా ఏ రోజుకైనా మొత్తం ప్రశ్నల సంఖ్య 175కి పరిమితం చేశారు. పార్లమెంట్ ఆమోద యోగ్యత నియమాలు 47-50 (రాజ్యసభ), 41-44 (లోక్‌సభ) ద్వారా నిర్వహిస్తారు. రాజ్యసభ ఛైర్మన్ (Chairman of the Rajya Sabha) లేదా లోక్‌సభ స్పీకర్‌కు సభ నిబంధనల ప్రకారం ఒక ప్రశ్న లేదా భాగాన్ని ఆమోదించాలా వద్దా అని నిర్ణయించే అధికారం ఉంది.
పెగాసెస్‌పై ప్రశ్నలను అనుమతించలేదు..
గత వర్షాకాల సమావేశాల్లో (In monsoon meetings) రాజ్యసభలో 833 ప్రశ్నలను అనుమతించలేదు. 2013-14 శీతాకాల సమావేశాల సమయంలో రాజ్యసభ 748 ప్రశ్నలను అనుమతించలేదు. ఒకసారి ప్రశ్నలనుఅనుమతించకపోతే సభ్యులు తమ నిర్ణయాన్ని సవాలు చేయడం కష్టమే. ఈ వర్షాకాల సెషన్స్‌లోనూ (In monsoon meetings) పార్లమెంట్ కొన్ని ప్రశ్నలను అనుమతించలేదు. అందులో పెగాసెస్‌కు సంబంధించినది ఒకటైతే.. మరొకటి సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వం అడిగిన ప్రశ్నను కూడా అనుమతించలేదు. ప్రజాస్వామ్యంలో భారతదేశ స్థానంపై తృణముల్ ఎంపీ శాంతా ఛెత్రి అడిగిన ప్రశ్నను కూడా అనుమతించలేదు. ఇదివరకు చాలా ప్రశ్నలు అరుదుగా అనుమతించకపోయేవారు. కానీ ఈ మధ్య ఇలాంటి సందర్భాలు సాధారణమైపోతున్నాయి. సున్నిత విషయాలు, జాతీయ భద్రతకు సంబంధించిన విషయాల్లో ప్రశ్నలకు అనుమతిలేదని లోక్‌సభ మాజీ ప్రధాన కార్యదర్శి పీడీటీ ఆచార్య తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Lok Sabha Speaker Om Birla, Parliament, Parliament Winter session