హోమ్ /వార్తలు /Explained /

Olympics 2036: ఒలింపిక్స్‌ 2036కు భారత్ ఆతిథ్యం ఇస్తుందా? ఇందుకు అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి?

Olympics 2036: ఒలింపిక్స్‌ 2036కు భారత్ ఆతిథ్యం ఇస్తుందా? ఇందుకు అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి?

ఒలింపిక్స్ (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

ఒలింపిక్స్ (ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

రాబోయే ఒలింపిక్స్ పారిస్(2024), లాస్ ఏంజెల్స్(2028), బ్రిస్బేన్(2032)లో జరగనున్నాయి. ఆపై వచ్చే 2036, 2040 విశ్వక్రీడలకు ఆతిథ్యమిచ్చేందుకు చాలా దేశాలు పోటీ పడుతున్నాయి.

ఒలింపిక్స్ (Olympics).. ఈ విశ్వక్రీడల్లో పతకం సాధించాలి, దేశాన్ని అగ్రస్థానంలో నిలపాలని ప్రపంచంలోని ప్రతి ఒక్క క్రీడాకారుడితో పాటు సగటు సామాన్యుడు సైతం కోరుకుంటాడు. మనదేశంలో అయితే ఒలింపిక్స్ గురించి వేరే చెప్పక్కర్లేదు. మన వాళ్లకు ఏదైనా పతకం వస్తే పతాక స్థాయిలో సంబరాలు చేసుకుంటారు. అలాంటిది ఒలింపిక్స్‌కు భారత్ ఆతిథ్యమిస్తే ఎలా ఉంటుంది? మన దేశంలో, మన ప్రజల మధ్య విశ్వక్రీడలు నిర్వహిస్తే ఆ ఉత్సాహం గురించి వేరే చెప్పాలా..? అయితే ఒలింపిక్స్ నిర్వహణకు భారత్ ఇప్పటికే చాలా సార్లు ప్రయత్నించినప్పటికీ రిక్తహస్తాలే మిగిలాయి. ఈ నేపథ్యంలో విశ్వక్రీడలను నిర్వహించే స్థోమత భారత్‌కు ఉందా? వీటిని నిర్వహించడానికి ఉన్న అడ్డంకులేంటి? వంటి విషయాలు తెలుసుకుందాం.

* ఒలింపిక్స్‌కు విముఖత..

రాబోయే ఒలింపిక్స్ పారిస్(2024) (Paris 2024 Olympics), లాస్ ఏంజెల్స్(2028) (Olympics 2028), బ్రిస్బేన్(2032)లో జరగనున్నాయి. ఆ పై వచ్చే 2036, 2040 విశ్వక్రీడలకు ఆతిథ్యమిచ్చేందుకు చాలా దేశాలు పోటీ పడుతున్నాయని అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య(ఐఓసీ) (IOC) అధ్యక్షులు థామస్ బాచ్ (Thomas Bach) అన్నారు. ఈ జాబితాలో భారత్ కూడా ఉందని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో ఒలింపిక్స్ ఆతిథ్యమిచ్చేందుకు ఉత్సాహం చూపుతున్న వారి సంఖ్య తగ్గిపోయిందని సంప్రదాయవాదులు అంటున్నారు. పెరుగుతున్న ఖర్చులతో పాటు ఇంత పెద్ద కార్యక్రమాన్ని క్రమశిక్షణతో నిర్వహించడం అనేక వివాదాలకు తావు ఇస్తున్నాయని, ఫలితంగా చాలా దేశాలను నిరుత్సాహపరుస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. అయితే వీటిలో సత్యం లేదని థామస్ బాచ్ తెలిపారు.

* థామస్ బాచ్ ఎందుకు అలా అన్నారు..

టోక్యో ఒలింపిక్స్ సందర్భంగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన థామస్ బాచ్.. సుదీర్ఘ కాలంలో విశ్వక్రీడల ఆతిథ్యానికి ఎలాంటి ఆటంకం లేదని చెప్పారు. భారత్, ఇండోనేషియా, జర్మనీ, ఖతర్ లాంటి దేశాలు 2036లో హోస్ట్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నాయని చెప్పారు. దీనిపై తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని ఐఓసీ అధ్యక్షులు స్పష్టం చేశారు.

* ఏయే దేశాలు ఆసక్తి చూపుతున్నాయి..

థామస్ బాచ్ (Thomas Bach) పేర్కొన్న నాలుగు దేశాల్లో మూడు ఆసియాకు చెందినవే. అంతేకాకుండా ఇంతకుముందెన్నడు ఈ దేశాలు ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వలేదు. జర్మనీ చివరగా అర్ధశతాబ్దం క్రితం ఒలింపిక్స్ హోస్ట్ చేసింది. విశ్వక్రీడలకు ఆతిథ్యం ఇవ్వాలని భారత్ తరచూ తన కోరికను వ్యక్త పరుస్తూనే ఉంది. రాబోయే దశాబ్దన్నర కాలంలో ఆసియా గేమ్స్, యూత్ ఒలింపిక్స్, సమ్మర్ ఒలింపిక్స్‌కు అతిథ్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు భారత ఒలింపిక్ సంఘం (IOA) గతంలోనే చెప్పింది. ఐఓఏ అధ్యక్షులు రాజీవ్ మెహతా కూడా ఈ ఆలోచనపై తమకు ఆసక్తి ఉందని ధ్రువీకరించారు.

భారత స్వాతంత్య్ర శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా 2048 విశ్వ క్రీడలను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు దిల్లీ సర్కారు తెలిపింది. ఖతర్ లాంటి చిన్న దేశం కూడా వచ్చే ఏడాది ఫిఫా వరల్డ్ కప్ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది. ఇండోనేషియా 2018లో ఆసియా గేమ్స్ నిర్వహించింది. జర్మనీ కూడా ఐరోపాలో అతిపెద్ద దేశాల్లో ఒకటి. కాబట్టి ఒలింపిక్స్ నిర్వహణకు ఈ దేశాలు ఉత్సుకత ప్రదర్శిస్తున్నాయి.

* ఒలింపిక్స్ నిర్వహణకు కొన్ని దేశాల్లో విముఖత ఎందుకు?

ఇటీవల నిర్వహించిన టోక్యో ఒలింపిక్స్, విశ్వక్రీడల చరిత్రలోనే అత్యంత ఖరీదైనవి. అంతేకాకుండా మహమ్మారి కారణంగా ఓ ఏడాది ఆలస్యం కావడం, బడ్జెట్ కూడా కొన్నిసార్లు అధికంగా అంచనా వేయడం, విదేశీ ప్రేక్షకులను నిషేధించడం లాంటి కారణాల వల్ల ఆదాయం బాగా తగ్గింది. 2016 రియో ఒలింపిక్స్‌ సమయంలో నిర్వాహకులు జికా వైరస్‌తో పోరాడాల్సి వచ్చింది. 2004లో గ్రీస్ విశ్వ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన తరువాత.. ఇప్పటికీ ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది.

కరోనా కారణంగా టోక్యోలో ఈ గేమ్స్‌ను చాలా మంది స్థానికులు వ్యతిరేకించారు. ఈ ఏడాది విశ్వక్రీడలు ఆరంభమయ్యే వరకు కూడా జపాన్ వాసుల్లో ఈ అసంతృప్తి కొనసాగింది. ఈ కారణాలే కాకుండా ఒలింపిక్స్ కోసం బిడ్డింగ్, లాబీయింగ్ లాంటివి ఎంతో ఖరీదైన విషయాలు. అనేక ఆతిథ్య నగరాలు వారసత్వ సమస్యలతో పోరాడుతున్నాయి. మౌలిక సదుపాయాలు, క్రీడల కోసం ఏర్పాటు చేసిన వేదికలకు భారీగా ఖర్చు పెట్టడం వల్ల చాలా దేశాలపై దీర్ఘకాలికంగా ఆర్థిక భారం పడుతోంది.

* క్రీడల నిర్వహణతో లాభ, నష్టాలేవి?

గ్లామర్ కోసం, పలుకుబడి దెబ్బతిన్న దేశాలు ఆటలకు అతిథ్యమివ్వడానికి ఆసక్తి చూపుతాయి. 2008లో బీజింగ్ ఒలింపిక్స్ చైనాను పెద్ద గ్లోబల్ పవర్‌గా నిలిపాయి. భారత్ ఈ కారణంగా క్రీడల నిర్వహణకు ఇష్టపడుతుంది. ఖర్చు, ఇబ్బందులకు తగిన మూల్యం ఉంటుందని భావిస్తోంది. బ్రిటన్, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు ఆటలు అవసరమైన ప్రాంతాల్లో క్రీడా, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఉత్ప్రేరకంగా పనిచేశాయి.

ఒలింపిక్స్ కాకుండా ఇతర క్రీడలైన ఆసియన్, కామన్వెల్త్ గేమ్స్ కూడా క్రమశిక్షణతో నిర్వహించాల్సిన క్రీడా కార్యక్రమాలు. 2018లో వియత్నాం ఆసియాడ్‌కు ఆతిథ్యమివ్వాల్సి ఉండగా.. ఆర్థిక మాంద్యం కారణంగా తన అసమర్థతను వ్యక్తం చేసింది. కామన్వెల్త్ లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది.

SAI Recruitment: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 220 అసిస్టెంట్ కోచ్​ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక* సమస్యల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి?

ఒలింపిక్స్ ఈవెంట్లలో పాల్గొనేవారి సంఖ్యను పరిమితం చేసి ఆటల ఖర్చులను నియంత్రించడానికి ప్రయత్నించాలి. బడ్జెట్‌ను అదుపులో ఉంచడానికి నిర్ణీత విధానాలను తప్పకుండా అనుసరించాల్సి ఉంది. ఇటీవలే యూరోపియన్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ ఖండం అంతటా ప్రదర్శితమైంది. ఇదే విధంగా ఒలింపిక్స్, ఇతర క్రీడా కార్యక్రమాలను సంయుక్తంగా నిర్వహించడం వల్ల ఆర్థిక, ఇతర లాజిస్టికల్ భారం ఒకే దేశంపై పడదు. ఇది పొరుగు దేశాలను ఉమ్మడి ప్రాజెక్టులో కలిసి పనిచేయడానికి ప్రేరేపిస్తుంది.

Joe Root Records: జో రూట్ రికార్డుల జోరు.. ఇండియాపై తిరుగులేని గణాంకాలు... బ్రాడ్‌మాన్ రికార్డుకు ఎసరు


First published:

Tags: Olympics, Tokyo Olympics

ఉత్తమ కథలు