హోమ్ /వార్తలు /Explained /

Pregnancy: కరోనా వ్యాక్సిన్ గర్భధారణపై ప్రభావం చూపిస్తుందా?

Pregnancy: కరోనా వ్యాక్సిన్ గర్భధారణపై ప్రభావం చూపిస్తుందా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కొవిడ్ లేదా టీకా వల్ల గర్భధారణపై ఎలాంటి జీవ సంబంధ ప్రభావాలు ఉండవని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆంశంపై ఎవరికైనా సందేహాలు ఉంటే నిజాలేంటో తెలుసుకోవాలని నిపుణులు అందరికీ సూచిస్తున్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో అలాంటి ప్రభావం కనిపించలేదని ఫైజర్ అధ్యయనాన్ని వైద్యులు ఉదహరిస్తున్నారు.

ఇంకా చదవండి ...


ప్రపంచాన్ని గత కొద్దినెలలుగా కరోనా మహమ్మారి వణికిస్తోంది. రోజుల వ్యవధిలోనే ప్రపంచాన్ని చుట్టేసింది. కోట్లాది మందిని పొట్టనపెట్టుకుంది. ఆరోగ్య వంతులతో పోలిస్తే ఇదివరకే అనారోగ్యం బారిన పడివారిపై కోవిడ్​ ప్రభావం ఎక్కువగా చూపింది. అయితే కరోనాకు ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్లు సైతం వచ్చాయి. అయితే వాటిపై కొద్దిమందిలో అపోహలు అయితే ఉన్నాయి. కరోనా టీకా తీసుకుంటే సంతాన సాఫల్యంపై ప్రభావం చూపిస్తుందా? గర్భం ధరించే అవకాశాలను తగ్గిస్తుందా? గర్భధారణ అంశంలో సమస్యలు వస్తాయా? వంటి సందేహాలు అనేక మందికి కలుగుతున్నాయి. అయితే ఇవేవీ నిజం కాదని అంటున్నారు వైద్య నిపుణులు. అవన్నీ అపోహలేనని స్పష్టం చేస్తున్నారు. కొవిడ్ లేదా టీకా వల్ల గర్భధారణపై ఎలాంటి జీవ సంబంధ ప్రభావాలు ఉండవని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ ఆంశంపై ఎవరికైనా సందేహాలు ఉంటే నిజాలేంటో తెలుసుకోవాలని నిపుణులు అందరికీ సూచిస్తున్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన పరీక్షల్లో అలాంటి ప్రభావం కనిపించలేదని ఫైజర్ అధ్యయనాన్ని వైద్యులు ఉదహరిస్తున్నారు.


ఒక అధ్యయనంలో భాగంగా ఒకే సంఖ్యలో రెండు వేర్వేరు బృందాలకు పైజర్ టీకాలను, డమ్మీ టీకాలను ఇచ్చారు. వ్యాక్సిన్ తీసుకోని బృందంలోని మహిళలతో సమానంగా తీసుకున్న బృందంలోని మహిళలు గర్భం దాల్చారని తేల్చారు. టీకాలు తీసుకుంటే స్వల్పకాలం రుతుక్రమంలో మార్పులు కనిపిస్తున్నాయన్న సందేహాలపై పరిశోధకులు ఇప్పుడు దృష్టి సారించారు. టీకాలు సంతాన సౌభాగ్యంపై ఎలాంటి ప్రభావం చూపించడం లేదని నిపుణులు చెబుతున్నారు. సాధారణ మహిళలతో పోలిస్తే గర్భవతుల్లో కరోడా ప్రభావం ఎక్కువగా ఉందని ప్రాణవాయువు అవసరం ఎక్కువగా ఏర్పడుతోందని నిపుణులు ఇప్పటికే పేర్కొంటున్నారు. అంటే వారు వ్యాక్సిన్ తీసుకోవడమే మేలని సూచిస్తున్నారు. టీకాలు తీసుకున్న వేలాది మంది గర్భవతులతో నిపుణులు మాట్లాడారు.

కోవిడ్-19 టీకా తీసుకున్నాక అది చాలావరకు కండర కణాలు, లింఫ్ గ్రంథుల్లోని రోగనిరోధక కణాలకే -పరిమితమవుతుంది. డీఎన్ఏలో ఎలాంటి మార్పులు కలగజేయదు. అందువల్ల జన్యుపరమైన మార్పులేవీ. తలెత్తవు. పైగా ప్రస్తుతం అందుబాటులో ఉన్నవన్నీ మృత వైరస్ టీకాలు, కొవాగ్జిన్ టీకాను పూర్తిగా చనిపోయిన వైరస్​తో తయారుచేశారు. స్పుత్నిక్ టీ అడినో వైరస్​తో కూడుకున్నది. మిగతా టీకాలు.. వీటిల్లోనూ హానికారక వైరస్ ఏదీ ఉండదు. అందువల్ల గర్భిణికి, పిండానికి ఎలాంటి ముప్పూ ఉండదు. ఆ మాటకొస్తే గర్భిణులకు చాలాకాలంగా టీకాలు వంటివి ఇస్తూనే ఉన్నాం. ఇవి నిర్వీర్య వైరస్ టీకాలు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని చూస్తే కానీ, టీకాల విషయంలో సందేహాలు, భయాలు అవసరం లేదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

First published:

Tags: Corona Vaccine, Pregnancy, Pregnant women

ఉత్తమ కథలు